కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సంఖ్యాకాండము 4:37సుమారు క్రీ.పూ. 1490

    సమావేశ గుడారం దగ్గర సేవచేసే కహాతు వంశాల మొత్తం లెక్క ఇది. యెహోవా మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మోషే అహరోనులు వారిని లెక్కించారు.

  2. సంఖ్యాకాండము 4:38సుమారు క్రీ.పూ. 1490

    గెర్షోనీయులు వారి వంశాలు, కుటుంబాల ప్రకారం లెక్కించబడ్డారు.

  3. సంఖ్యాకాండము 4:39సుమారు క్రీ.పూ. 1490

    వంశాల ప్రకారం, ముప్పై నుండి యాభై సంవత్సరాల లోపు వయస్సు కలిగి, సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చిన పురుషులందరు 2,630 మంది.

  4. సంఖ్యాకాండము 4:40సుమారు క్రీ.పూ. 1490

    Even those that were numbered of them, throughout their families, by the house of their fathers, were two thousand and six hundred and thirty.

  5. సంఖ్యాకాండము 4:41సుమారు క్రీ.పూ. 1490

    సమావేశ గుడారం దగ్గర సేవ చేసిన గెర్షోను వంశాల మొత్తం లెక్క ఇది. యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే అహరోనులు వారిని లెక్కించారు.

  6. సంఖ్యాకాండము 4:42సుమారు క్రీ.పూ. 1490

    మెరారీయులు వారి వంశాలు కుటుంబాల ప్రకారం లెక్కించబడ్డారు.

  7. సంఖ్యాకాండము 4:43సుమారు క్రీ.పూ. 1490

    వంశాల ప్రకారం, ముప్పై నుండి యాభై సంవత్సరాల లోపు వయస్సు కలిగి సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చిన పురుషులందరు 3,200 మంది.

  8. సంఖ్యాకాండము 4:44సుమారు క్రీ.పూ. 1490

    Even those that were numbered of them after their families, were three thousand and two hundred.

  9. సంఖ్యాకాండము 4:45సుమారు క్రీ.పూ. 1490

    మెరారి వంశాల మొత్తం లెక్క ఇది. మోషే ద్వారా వచ్చిన యెహోవా ఆజ్ఞమేరకు మోషే అహరోనులు వారిని లెక్కించారు.

  10. సంఖ్యాకాండము 4:46సుమారు క్రీ.పూ. 1490

    మోషే, అహరోను ఇశ్రాయేలు నాయకులు కలిసి లేవీయులందరిని వంశాల, కుటుంబాల ప్రకారం లెక్కించారు.

  11. సంఖ్యాకాండము 4:47సుమారు క్రీ.పూ. 1490

    వంశాల ప్రకారం, ముప్పై నుండి యాభై సంవత్సరాల వయస్సు కలిగి సమావేశ గుడారంలో సేవ చేయడానికి దాన్ని మోయడానికి వచ్చిన వారి

  12. సంఖ్యాకాండము 4:48సుమారు క్రీ.పూ. 1490

    సంఖ్య 8,580.

  13. సంఖ్యాకాండము 4:49సుమారు క్రీ.పూ. 1490

    మోషే ద్వార వచ్చిన యెహోవా ఆజ్ఞ ప్రకారం, వారందరికి వారి వారి పనులు, వారు మోయాల్సినవి అప్పగించబడ్డాయి. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, వారు లెక్కించబడ్డారు.

  14. సంఖ్యాకాండము 5:1సుమారు క్రీ.పూ. 1490

    యెహోవా మోషేతో ఇలా అన్నారు,

  15. సంఖ్యాకాండము 5:2సుమారు క్రీ.పూ. 1490

    “ఎవరికైనా అపవిత్రమైన కుష్ఠువ్యాధి ఉన్నా లేదా ఏదైనా స్రావము కలిగి ఉన్నా లేదా శవాన్ని ముట్టుకొని ఆచారరీత్య అపవిత్రమై ఉన్నా, అలాంటి వారిని శిబిరంలో నుండి పంపివేయాలని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించు.

  16. సంఖ్యాకాండము 5:3సుమారు క్రీ.పూ. 1490

    పురుషులనైనా స్త్రీలనైనా పంపివేయాలి; నేను ప్రజలమధ్య నివసిస్తాను కాబట్టి వారు శిబిరాన్ని అపవిత్రం చేయకుండేలా వారిని పంపివేయాలి.”

  17. సంఖ్యాకాండము 5:4సుమారు క్రీ.పూ. 1490

    ఇశ్రాయేలీయులు అలాగే చేశారు; వారిని శిబిరం బయటకు పంపివేశారు. యెహోవా మోషేకు సూచించిన ప్రకారం వారు చేశారు.

  18. సంఖ్యాకాండము 5:5సుమారు క్రీ.పూ. 1490

    యెహోవా మోషేతో ఇలా చెప్పారు,

  19. సంఖ్యాకాండము 5:6సుమారు క్రీ.పూ. 1490

    “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఏ స్త్రీ గాని, పురుషుడు గాని యెహోవా పట్ల ద్రోహులై మనుష్యులు చేసే పాపాల్లో దేనినైనా చేసి అపరాధులైతే,

  20. సంఖ్యాకాండము 5:7సుమారు క్రీ.పూ. 1490

    వారు వారి పాపాన్ని ఒప్పుకుని వారు చేసిన అపరాధానికి పూర్ణ ప్రాయశ్చిత్తం చేయాలి, చేసిన తప్పుకు అయిదవ వంతు చేర్చి ఎవరికి విరుద్ధంగా తప్పు చేశారో వారికి ఇవ్వాలి.

  21. సంఖ్యాకాండము 5:8సుమారు క్రీ.పూ. 1490

    అయితే ఆ వ్యక్తికి నష్టపరిహారం చెల్లించడానికి సమీపబంధువు లేకపోతే, ఆ నష్టపరిహారం యెహోవాది, అది ప్రాయశ్చిత్త బలిగా ఇవ్వబడే పొట్టేలుతో పాటు యాజకునికి ఇవ్వబడాలి.

  22. సంఖ్యాకాండము 5:9సుమారు క్రీ.పూ. 1490

    ఇశ్రాయేలీయులు ఒక యాజకునికి తీసుకొనివచ్చే పవిత్రమైన విరాళాలన్నీ అతనికే చెందుతాయి.

  23. సంఖ్యాకాండము 5:10సుమారు క్రీ.పూ. 1490

    పవిత్రమైనవి వాటి యజమానులకు చెందుతాయి, కానీ వారు యాజకునికి ఇచ్చేది యాజకునికే చెందుతుంది.’ ”

  24. సంఖ్యాకాండము 5:11సుమారు క్రీ.పూ. 1490

    యెహోవా మోషేతో ఇలా అన్నారు,

  25. సంఖ్యాకాండము 5:12సుమారు క్రీ.పూ. 1490

    “ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారికి ఇలా చెప్పు: ‘ఒకవేళ ఒక వ్యక్తి భార్య దారితప్పి అతనికి నమ్మకద్రోహం చేసి,