- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
ఈ కాలపు వచనాలు
- సంఖ్యాకాండము 6:7సుమారు క్రీ.పూ. 1490
వారి సొంత తండ్రి లేదా తల్లి లేదా సోదరుడు లేదా సోదరి మరణించినా కూడా, వారు తమను తాము ఆచారబద్ధంగా అపవిత్రం చేసుకోవద్దు, ఎందుకంటే దేవునికి వారు అంకితం చేసుకున్న చిహ్నం వారి తలపై ఉంటుంది.
- సంఖ్యాకాండము 6:8సుమారు క్రీ.పూ. 1490
వారి సమర్పణ కాలం అంతా, వారు యెహోవాకు ప్రతిష్ఠించబడ్డారు.
- సంఖ్యాకాండము 6:9సుమారు క్రీ.పూ. 1490
“ ‘నాజీరు చేయబడినవారు ఉన్నచోట ఎవరైనా చనిపోయి, తాము ప్రతిష్ఠించుకున్న దానికి సూచనగా ఉన్న వారి వెంట్రుకలు అపవిత్రం అయితే, వారు ఏడవ రోజున, శుభ్ర పరచుకునే రోజున తమ తల గొరిగించుకోవాలి.
- సంఖ్యాకాండము 6:10సుమారు క్రీ.పూ. 1490
తర్వాత ఎనిమిదవ రోజు రెండు తెల్ల గువ్వలను, రెండు పావురపు పిల్లలను సమావేశ గుడారం ద్వారం దగ్గర యాజకుడి దగ్గరకు తేవాలి.
- సంఖ్యాకాండము 6:11సుమారు క్రీ.పూ. 1490
నాజీరు శవం దగ్గర ఉండడం పాపమవుతుంది, కాబట్టి ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా యాజకుడు వాటిలో ఒకదాన్ని పాపపరిహారబలిగా, ఇంకొక దానిని దహనబలిగా అర్పించాలి. అదే రోజు తమ తలను మరలా పవిత్రం చేసుకోవాలి.
- సంఖ్యాకాండము 6:12సుమారు క్రీ.పూ. 1490
వారు ప్రత్యేకించుకున్న కాలాన్ని నియమించుకొని తిరిగి తమను తాము యెహోవాకు ప్రత్యేకించుకుని ఒక ఏడాది గొర్రెపిల్లను అపరాధపరిహారబలి కోసం తేవాలి. ప్రత్యేకించుకున్న కాలంలో అపవిత్రులయ్యారు కాబట్టి మునుపటి రోజులు లెక్కకు రావు.
- సంఖ్యాకాండము 6:13సుమారు క్రీ.పూ. 1490
“ ‘ప్రత్యేకించుకున్న కాలం ముగిసినప్పుడు నాజీరు పాటించవలసిన నియమమేదంటే వారు సమావేశ గుడారం ద్వారం దగ్గరకు రావాలి.
- సంఖ్యాకాండము 6:14సుమారు క్రీ.పూ. 1490
అక్కడ వారు యెహోవాకు తమ అర్పణలు అర్పించాలి: దహనబలి కోసం లోపం లేని ఏడాది మగ గొర్రెపిల్ల, పాపపరిహారబలి కోసం లోపం లేని ఆడ గొర్రెపిల్ల, సమాధానబలి కోసం లోపం లేని పొట్టేలు,
- సంఖ్యాకాండము 6:15సుమారు క్రీ.పూ. 1490
వీటితో పాటు భోజనార్పణలు, పానార్పణలు, ఒక గంపెడు నూనె కలిపిన పులుపు కలపకుండ చేసిన నాణ్యమైన పిండి వంటలు ఒలీవనూనె కలిపిన మందమైన రొట్టెలు, ఒలీవనూనె పూసిన అప్పడాలు తీసుకురావాలి.
- సంఖ్యాకాండము 6:16సుమారు క్రీ.పూ. 1490
“ ‘ఇవన్నీ యాజకుడు యెహోవా ఎదుట ఉంచి పాపపరిహారబలి, దహనబలి అర్పించాలి.
- సంఖ్యాకాండము 6:17సుమారు క్రీ.పూ. 1490
అతడు గంపెడు పులియని రొట్టెలతో పాటు పొట్టేలును భోజనార్పణ పానార్పణంతో పాటు యెహోవాకు సమాధానబలిగా అర్పించాలి.
- సంఖ్యాకాండము 6:18సుమారు క్రీ.పూ. 1490
“ ‘అప్పుడు సమావేశ గుడారం ద్వారం దగ్గర, నాజీరు తాను ప్రత్యేకించుకున్న దానికి చిహ్నంగా ఉన్న తల వెంట్రుకలను గొరిగించుకోవాలి. ఆ వెంట్రుకలు సమాధానబలి అగ్నిలో వేసేయాలి.
- సంఖ్యాకాండము 6:19సుమారు క్రీ.పూ. 1490
“ ‘నాజీరు తాను ప్రత్యేకించుకున్న దానికి చిహ్నంగా ఉన్న తల వెంట్రుకలను గొరిగించుకున్న తర్వాత వండిన పొట్టేలు జబ్బను, గంపలోని ఒక పులుపు కలపకుండ చేసిన మందమైన రొట్టెను, ఒక అప్పడాన్ని యాజకుడు నాజీరు చేయబడిన వాని చేతిలో పెట్టాలి.
- సంఖ్యాకాండము 6:20సుమారు క్రీ.పూ. 1490
యాజకుడు అప్పుడు వాటిని యెహోవా ఎదుట పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించాలి; పైకెత్తబడి అర్పించబడిన రొమ్ము, ప్రత్యేక అర్పణగా సమర్పించబడిన తొడ పరిశుద్ధమైనవి, అవి యాజకునికి చెందినవి. ఆ తర్వాత, నాజీరు చేయబడిన వాడు ద్రాక్షరసం త్రాగవచ్చు.
- సంఖ్యాకాండము 6:21సుమారు క్రీ.పూ. 1490
“ ‘తాము ప్రత్యేకించుకున్న దాని ప్రకారం యెహోవాకు అర్పణలను తెస్తామని మ్రొక్కుబడి చేసే నాజీరుల నియమము. వారు తేగలిగితే అధనపు అర్పణలను కూడా తీసుకురావచ్చు. నాజీరు నియమం ప్రకారం వారు చేసిన మ్రొక్కుబడులను వారు తప్పక నెరవేర్చాలి.’ ”
- సంఖ్యాకాండము 6:22సుమారు క్రీ.పూ. 1490
యెహోవా మోషేతో ఇలా చెప్పారు,
- సంఖ్యాకాండము 6:23సుమారు క్రీ.పూ. 1490
“అహరోను, అతని కుమారులతో చెప్పు, ‘ఈ విధంగా ఇశ్రాయేలీయులను దీవించాలి:
- సంఖ్యాకాండము 6:24సుమారు క్రీ.పూ. 1490
“ ‘ “యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక;
- సంఖ్యాకాండము 6:25సుమారు క్రీ.పూ. 1490
యెహోవా నీ మీద తన ముఖాన్ని ప్రకాశింప జేసి నిన్ను కరుణించును గాక;
- సంఖ్యాకాండము 6:26సుమారు క్రీ.పూ. 1490
యెహోవా నీవైపు తన ముఖాన్ని త్రిప్పును గాక సమాధానం ఇచ్చును గాక.” ’
- సంఖ్యాకాండము 6:27సుమారు క్రీ.పూ. 1490
“ఇలా అహరోను అతని కుమారులను ఇశ్రాయేలీయులను నా నామమున దీవించినప్పుడు, నేనే స్వయంగా ఆశీర్వదిస్తాను.”
- సంఖ్యాకాండము 7:1సుమారు క్రీ.పూ. 1490
మోషే సమావేశ గుడారాన్ని సిద్ధం చేసినప్పుడు దాన్ని అభిషేకించి, దాన్ని, దాని సామాగ్రినంతటిని ప్రతిష్ఠించాడు. అతడు బలిపీఠాన్ని, దాని వస్తువులను కూడా ప్రతిష్ఠించాడు.
- సంఖ్యాకాండము 7:2సుమారు క్రీ.పూ. 1490
తర్వాత ఇశ్రాయేలు నాయకులు, లెక్కించబడిన వారిపట్ల బాధ్యత వహించిన గోత్ర నాయకులు యైన కుటుంబ పెద్దలు అర్పణలు అర్పించారు.
- సంఖ్యాకాండము 7:3సుమారు క్రీ.పూ. 1490
వారు యెహోవా ఎదుటకు ప్రతి నాయకుడి నుండి ఒక ఎద్దు, ప్రతి ఇద్దరి నుండి ఒక బండి చొప్పున ఆరు పైకప్పు ఉన్న బండ్లు, పన్నెండు ఎద్దులను తమ బహుమతులుగా తెచ్చారు. వీటిని వారు సమావేశం గుడారం ముందు సమర్పించారు.
- సంఖ్యాకాండము 7:4సుమారు క్రీ.పూ. 1490
యెహోవా మోషేతో,