కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సంఖ్యాకాండము 4:12సుమారు క్రీ.పూ. 1490

    “వారు పరిశుద్ధాలయంలో పరిచర్య కోసం వాడే వస్తువులన్నిటిని తీసుకుని వాటిని నీలి బట్టలో చుట్టి, మన్నికైన తోలుతో కప్పి మోసుకెళ్లే పలక మీద ఉంచాలి.

  2. సంఖ్యాకాండము 4:13సుమారు క్రీ.పూ. 1490

    “వారు ఇత్తడి బలిపీఠం మీది నుండి బూడిదను తీసివేసి, దాని మీద ఊదా బట్ట కప్పాలి.

  3. సంఖ్యాకాండము 4:14సుమారు క్రీ.పూ. 1490

    తర్వాత వారు బలిపీఠం దగ్గర పరిచర్యకు వాడే అన్ని పాత్రలను, నిప్పు పెనాలు, ముళ్ళ గరిటెలు, పారలు, ప్రోక్షణ గిన్నెలతో సహా దాని మీద పెట్టాలి. దాని మీద మన్నికైన తోలు కప్పి, మోతకర్రలను వాటి స్థలంలో దూర్చాలి.

  4. సంఖ్యాకాండము 4:15సుమారు క్రీ.పూ. 1490

    “అహరోను అతని కుమారులు పరిశుద్ధ సామాగ్రి, పరిశుద్ధ ఉపకరణాలన్నిటిని కప్పడం పూర్తి చేసిన తర్వాత, ప్రజలు ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే కహాతీయులు వచ్చి దానిని మోయాలి. అయితే వారు పరిశుద్ధమైన వాటిని ముట్టకూడదు, ముట్టుకుంటే వారు చస్తారు. కహాతీయులు సమావేశ గుడారంలో ఉన్నవాటిని మోయాలి.

  5. సంఖ్యాకాండము 4:16సుమారు క్రీ.పూ. 1490

    “అహరోను కుమారుడును యాజకుడునైన ఎలియాజరు, దీపానికి నూనె, పరిమళ వాసనగల ధూపద్రవ్యం, నిత్యం అర్పించే భోజనార్పణ, అభిషేక తైలం మొదలగువాటిని పర్యవేక్షిస్తాడు. అతడు సమావేశ గుడారమంతటిని, అందులో ఉన్న సామాగ్రిని, పరిశుద్ధ ఉపకరణాలతో పాటు ప్రతిదీ పర్యవేక్షిస్తాడు.”

  6. సంఖ్యాకాండము 4:17సుమారు క్రీ.పూ. 1490

    యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పారు,

  7. సంఖ్యాకాండము 4:18సుమారు క్రీ.పూ. 1490

    “లేవీయుల మధ్య నుండి కహాతీయుల వంశం నాశనమై పోకుండా చూడండి.

  8. సంఖ్యాకాండము 4:19సుమారు క్రీ.పూ. 1490

    వారు అతిపరిశుద్ధమైన వాటి దగ్గరకు వచ్చినప్పుడు చావకుండ బ్రతికి ఉండేలా మీరు వారి కోసం ఇలా చేయండి: అహరోను అతని కుమారులు పరిశుద్ధాలయంలోకి వెళ్లి, వారందరికి వారు చేయాల్సిన పనిని, వారు మోయాల్సిన వాటిని వారికి అప్పగించాలి.

  9. సంఖ్యాకాండము 4:20సుమారు క్రీ.పూ. 1490

    అయితే కహాతీయులు పరిశుద్ధమైన వాటిని చూడాలని, కనీసం ఒక్క క్షణమైనా లోనికి వెళ్లకూడదు, వెళ్తే వారు చస్తారు.”

  10. సంఖ్యాకాండము 4:21సుమారు క్రీ.పూ. 1490

    యెహోవా మోషేతో ఇలా అన్నారు,

  11. సంఖ్యాకాండము 4:22సుమారు క్రీ.పూ. 1490

    “గెర్షోనీయులను కూడా వారి కుటుంబాలు, వంశాల ప్రకారం జనాభా లెక్కలు తీసుకోండి.

  12. సంఖ్యాకాండము 4:23సుమారు క్రీ.పూ. 1490

    సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చే ముప్పై నుండి యాభై సంవత్సరాల లోపు వయస్సుగల పురుషులందరినీ లెక్కించండి.

  13. సంఖ్యాకాండము 4:24సుమారు క్రీ.పూ. 1490

    “మోయడంలో, అలాగే వారి ఇతర పనులలో గెర్షోను వంశస్థుల సేవ ఇదే:

  14. సంఖ్యాకాండము 4:25సుమారు క్రీ.పూ. 1490

    ప్రత్యక్ష గుడారం యొక్క తెరలు అంటే సమావేశ గుడారం దాని కప్పు అలాగే మన్నికైన తోలుతో చేయబడిన వెలుపటి కప్పు ఇంకా సమావేశ గుడార ద్వారం యొక్క తెరలు,

  15. సంఖ్యాకాండము 4:26సుమారు క్రీ.పూ. 1490

    సమావేశ గుడారం, బలిపీఠం చుట్టూ ఉన్న ఆవరణ తెరలు, ఆవరణ ప్రవేశ ద్వారపు తెరలు, వాటి త్రాళ్లు గుడారంలో సేవకు ఉపయోగించే వస్తువులన్నిటిని మోయాలి. వీటితో చేయాల్సిన పనులన్నీ గెర్షోనీయులు చేయాలి.

  16. సంఖ్యాకాండము 4:27సుమారు క్రీ.పూ. 1490

    గెర్షోనీయులు మోసుకెళ్లే పనైనా లేదా వేరే పనైనా వారి సేవ అంతా అహరోను అతని కుమారుల ఆధ్వర్యంలోనే జరగాలి. వారు మోయాల్సిన బాధ్యతను మీరు వారికి అప్పగించాలి.

  17. సంఖ్యాకాండము 4:28సుమారు క్రీ.పూ. 1490

    సమావేశ గుడారం దగ్గర గెర్షోను వంశస్థులు చేయాల్సిన సేవ ఇదే. వారి విధులను అహరోను కుమారుడును యాజకుడునైన ఈతామారు పర్యవేక్షణలో జరగాలి.

  18. సంఖ్యాకాండము 4:29సుమారు క్రీ.పూ. 1490

    “మెరారీయుల కుటుంబాలను వారి వంశాల ప్రకారం జనాభా లెక్క తీసుకోండి.

  19. సంఖ్యాకాండము 4:30సుమారు క్రీ.పూ. 1490

    సమావేశ గుడారంలో పని చేయడానికి వచ్చే ముప్పై నుండి యాభై సంవత్సరాల వయస్సుగల పురుషులందరినీ లెక్కించండి.

  20. సంఖ్యాకాండము 4:31సుమారు క్రీ.పూ. 1490

    గుడారంలో వారి సేవలో భాగంగా వారు గుడారపు పలకలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు,

  21. సంఖ్యాకాండము 4:32సుమారు క్రీ.పూ. 1490

    అంతేకాక, ఆవరణం చుట్టూ ఉండే స్తంభాలు వాటి దిమ్మలు, మేకులు, త్రాళ్లు వాటికి సంబంధించినవన్నీ వారే మోయాలి. ప్రతి ఒక్కరు మోయడానికి నిర్దిష్టమైన వాటిని అప్పగించండి.

  22. సంఖ్యాకాండము 4:33సుమారు క్రీ.పూ. 1490

    సమావేశ గుడారం దగ్గర అహరోను కుమారుడు, యాజకుడైన ఈతామారు పర్యవేక్షణలో మెరారి వంశస్థులు చేసే సేవ ఇది.”

  23. సంఖ్యాకాండము 4:34సుమారు క్రీ.పూ. 1490

    మోషే, అహరోనులు సమాజ నాయకులతో కలిసి కహాతీయులను వారి వంశాలు, వారి కుటుంబాల ప్రకారం లెక్కించారు.

  24. సంఖ్యాకాండము 4:35సుమారు క్రీ.పూ. 1490

    వంశాల ప్రకారం, ముప్పై నుండి యాభై సంవత్సరాల లోపు వయస్సు కలిగి సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చిన పురుషులంతా 2,750 మంది.

  25. సంఖ్యాకాండము 4:36సుమారు క్రీ.పూ. 1490

    And those that were numbered of them by their families were two thousand seven hundred and fifty.