కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సంఖ్యాకాండము 3:13సుమారు క్రీ.పూ. 1490

    ఎందుకంటే తొలిసంతానమంతా నావారు. ఈజిప్టు తొలిసంతానాన్ని నేను మొత్తినప్పుడు, ఇశ్రాయేలీయులలో మనుష్యుల్లో, పశువుల్లో ప్రతి తొలిసంతానాన్ని, నా కోసం ప్రత్యేకపరచుకున్నాను. వారు నా వారిగా ఉండాలి. నేనే యెహోవాను.”

  2. సంఖ్యాకాండము 3:14సుమారు క్రీ.పూ. 1490

    సీనాయి ఎడారిలో యెహోవా మోషేతో ఇలా అన్నారు.

  3. సంఖ్యాకాండము 3:15సుమారు క్రీ.పూ. 1490

    “లేవీయులను వారి కుటుంబాలు వంశాల ప్రకారం లెక్కించు. ఒక నెల మొదలుకొని ఆపై వయస్సున్న మగవారినందరిని లెక్కించు.”

  4. సంఖ్యాకాండము 3:16సుమారు క్రీ.పూ. 1490

    కాబట్టి యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మోషే వారిని లెక్కించాడు.

  5. సంఖ్యాకాండము 3:17సుమారు క్రీ.పూ. 1490

    లేవీ కుమారుల పేర్లు ఇవి: గెర్షోను, కహాతు, మెరారి.

  6. సంఖ్యాకాండము 3:18సుమారు క్రీ.పూ. 1490

    గెర్షోను వంశస్థుల పేర్లు ఇవి: లిబ్నీ, షిమీ.

  7. సంఖ్యాకాండము 3:19సుమారు క్రీ.పూ. 1490

    కహాతు వంశస్థుల పేర్లు ఇవి: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.

  8. సంఖ్యాకాండము 3:20సుమారు క్రీ.పూ. 1490

    మెరారి వంశస్థులు: మహలి, మూషి.

  9. సంఖ్యాకాండము 3:21సుమారు క్రీ.పూ. 1490

    లిబ్నీయులు, షిమీయులు వంశస్థులు గెర్షోనుకు చెందినవారు; వీరు గెర్షోను వంశస్థులు.

  10. సంఖ్యాకాండము 3:22సుమారు క్రీ.పూ. 1490

    వీరిలో ఒక నెల మొదలుకొని ఆపై వయస్సున్న మగవారందరి సంఖ్య 7,500.

  11. సంఖ్యాకాండము 3:23సుమారు క్రీ.పూ. 1490

    గెర్షోను వంశస్థులు సమావేశ గుడారం వెనుక పశ్చిమ వైపు దిగాలి.

  12. సంఖ్యాకాండము 3:24సుమారు క్రీ.పూ. 1490

    లాయేలు కుమారుడైన ఎలీయాసాపు గెర్షోను కుటుంబాల నాయకుడు.

  13. సంఖ్యాకాండము 3:25సుమారు క్రీ.పూ. 1490

    గెర్షోనీయులు కాపాడవలసినవి: సమావేశ గుడారం, గుడారం, దాని పైకప్పు, సమావేశ గుడార ద్వారం యొక్క తెర,

  14. సంఖ్యాకాండము 3:26సుమారు క్రీ.పూ. 1490

    ఆవరణం యొక్క తెరలు, గుడారం బలిపీఠం చుట్టూ ఉన్న ద్వారపు తెర, దాని త్రాళ్లు, వాటికి ఉపయోగించబడే ప్రతి వస్తువు.

  15. సంఖ్యాకాండము 3:27సుమారు క్రీ.పూ. 1490

    అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు కహాతుకు చెందినవారు; వీరు కహాతు వంశస్థులు.

  16. సంఖ్యాకాండము 3:28సుమారు క్రీ.పూ. 1490

    ఒక నెల ఆపై వయస్సున్న మగవారందరు 8,600 మంది. పరిశుద్ధాలయాన్ని కాపాడే బాధ్యత కహాతీయులది.

  17. సంఖ్యాకాండము 3:29సుమారు క్రీ.పూ. 1490

    కహాతు వంశస్థులు సమావేశ గుడారం యొక్క దక్షిణ వైపు దిగాలి.

  18. సంఖ్యాకాండము 3:30సుమారు క్రీ.పూ. 1490

    ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను కహాతు వంశస్థుల కుటుంబాల నాయకుడు.

  19. సంఖ్యాకాండము 3:31సుమారు క్రీ.పూ. 1490

    వారు మందసం, బల్ల, దీపస్తంభం, బలిపీఠాలు, పరిచర్య కోసం పరిశుద్ధాలయం లోని వస్తువులు, తెర వాటికి ఉపయోగించబడే ప్రతి వస్తువు విషయం బాధ్యత వహించాలి.

  20. సంఖ్యాకాండము 3:32సుమారు క్రీ.పూ. 1490

    యాజకుడును అహరోను కుమారుడునైన ఎలియాజరు లేవీయుల ప్రధాన నాయకుడు. పరిశుద్ధాలయాన్ని కాపాడే వారి మీద ఇతడు ముఖ్య నాయకునిగా నియమించబడ్డాడు.

  21. సంఖ్యాకాండము 3:33సుమారు క్రీ.పూ. 1490

    మహలీయులు, మూషీయుల వంశస్థులు మెరారికి చెందినవారు. వీరు మెరారి వంశస్థులు.

  22. సంఖ్యాకాండము 3:34సుమారు క్రీ.పూ. 1490

    ఒక నెల ఆపై వయస్సున్న మగవారందరి సంఖ్య 6,200.

  23. సంఖ్యాకాండము 3:35సుమారు క్రీ.పూ. 1490

    అబీహయిలు కుమారుడైన సూరీయేలు మెరారి వంశస్థుల కుటుంబాల నాయకుడు. వీరు సమావేశ గుడారం యొక్క ఉత్తర వైపున దిగాలి.

  24. సంఖ్యాకాండము 3:36సుమారు క్రీ.పూ. 1490

    మెరారీయులు సమావేశ గుడారం యొక్క పలకలు, దాని అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు, దాని ప్రతి ఉపకరణాలు వాటికి సంబంధించినవన్నీ,

  25. సంఖ్యాకాండము 3:37సుమారు క్రీ.పూ. 1490

    అలాగే ఆవరణం చుట్టూ ఉన్న ప్రాకార స్తంభాలు, వాటి దిమ్మలు, వాటి మేకులు త్రాళ్లను కాపాడడానికి నియమింపబడ్డారు.