Skip to content

Ahab

80 వచనాలు · 6 కుటుంబ సభ్యులు

Ahab ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఒమ్రీ చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, అతన్ని సమరయలో సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు అహాబు రాజయ్యాడు.

  2. యూదా రాజైన ఆసా పరిపాలనలోని ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు సమరయలో ఇశ్రాయేలు మీద ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలించాడు.

  3. ఒమ్రీ కుమారుడైన అహాబు అతని ముందున్న వారందరికంటే యెహోవా దృష్టిలో చాలా చెడుగా ప్రవర్తించాడు.

  4. అహాబు అషేరా స్తంభాలను కూడా నిలిపి, ముందు ఉన్న ఇశ్రాయేలు రాజులందరికి కంటే ఎక్కువగా పాపం చేసి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం రేపాడు.

  5. గిలాదు ప్రాంతంలోని తిష్బీ గ్రామవాసియైన ఏలీయా అహాబుతో అన్నాడు, “నేను సేవించే ఇశ్రాయేలీయుల సజీవుడైన దేవుడు, యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, రాబోయే కొన్ని సంవత్సరాలు, నేను చెప్తేనే తప్ప, మంచు గాని, వర్షం గాని కురవదు.”

  6. చాలాకాలం తర్వాత కరువులో మూడవ సంవత్సరం యెహోవా వాక్కు ఏలీయాకు వచ్చింది: “నీవు వెళ్లి అహాబుకు కనబడు, నేను దేశం మీద వర్షం కురిపిస్తాను.”

  7. కాబట్టి అహాబుకు కనబడటానికి ఏలీయా వెళ్లాడు. ఆ సమయంలో సమరయలో కరువు తీవ్రంగా ఉంది.

  8. కాబట్టి అహాబు తన రాజభవన నిర్వాహకుడైన ఓబద్యాను పిలిపించాడు. (ఓబద్యా యెహోవా పట్ల భయభక్తులు గలవాడు.

  9. అహాబు ఓబద్యాతో, “దేశంలో తిరిగి పర్యటిస్తూ అన్ని ఊటలను, వాగులను చూడు. మన గుర్రాలు, కంచరగాడిదలు చావకుండ వాటికి గడ్డి దొరుకుతుందేమో అప్పుడు కొన్ని పశువులనైనా చావకుండ చూడగలం” అన్నాడు.

  10. కాబట్టి వారు దేశమంతా తిరిగి చూడడానికి వీలుగా ఒకవైపు అహాబు, మరోవైపు ఓబద్యా వెళ్లారు.

  11. అందుకు ఓబద్యా, “నేను చనిపోయేలా మీ దాసుడనైన నన్ను అహాబుకు అప్పగించడానికి నేను ఏ చెడ్డపని చేశాను?

  12. నేను మిమ్మల్ని విడిచి వెళ్లిన తర్వాత, యెహోవా ఆత్మ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాడో నాకు తెలియదు. నేను అహాబుకు చెప్పినప్పుడు, ఒకవేళ అతనికి మీరు కనబడకపోతే అతడు నన్ను చంపేస్తాడు. అది సరికాదు; మీ సేవకుడనైన నేను కూడ బాల్యం నుండే యెహోవాను ఆరాధించే వాన్ని.

  13. ఓబద్యా అహాబును కలుసుకోడానికి వెళ్లి ఈ విషయం తెలియజేయగా అహాబు ఏలీయాను కలుసుకోడానికి వెళ్లాడు.

  14. అహాబు ఏలీయాను చూడగానే అతనితో, “ఇశ్రాయేలును కష్టపెట్టేవాడివి నీవే గదా?” అన్నాడు.

  15. కాబట్టి అహాబు ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిపించాడు. ఆ ప్రవక్తలను కూడా కర్మెలు పర్వతం మీద సమావేశపరిచాడు.

  16. తర్వాత ఏలీయా అహాబుతో, “భారీ వర్షం వచ్చే ధ్వని వస్తుంది, నీవు వెళ్లి అన్నపానాలు పుచ్చుకో” అన్నాడు.

  17. కాబట్టి అహాబు అన్నపానాలు పుచ్చుకోడానికి వెళ్లాడు, కాని ఏలీయా కర్మెలు పర్వత శిఖరం మీదికి వెళ్లి, అక్కడ అతడు నేల మీద పడి ముఖం మోకాళ్ల మధ్య పెట్టుకున్నాడు.

  18. ఏడవసారి సేవకుడు వచ్చి, “మనిషి చేయి అంత చిన్న మేఘం సముద్రం నుండి పైకి లేస్తూ ఉంది” అని చెప్పాడు. అందుకు ఏలీయా, “నీవు వెళ్లి అహాబుతో, ‘వర్షం నిన్ను ఆపక ముందే నీ రథం సిద్ధం చేసుకుని వెళ్లు’ అని చెప్పు” అన్నాడు.

  19. అంతలో ఆకాశం మబ్బులతో చీకటిగా మారింది, గాలి వీచింది, భారీ వర్షం కురవడం మొదలయ్యింది. అహాబు రథమెక్కి యెజ్రెయేలుకు వెళ్లాడు.

  20. యెహోవా హస్తం ఏలీయాను బలపరచగా అతడు తన నడుము బిగించుకుని, అహాబు కంటే ముందే పరుగెత్తుకొని వెళ్లి యెజ్రెయేలు చేరుకున్నాడు.

  21. అహాబు వెళ్లి, ఏలీయా చేసిందంతా ప్రవక్తలందరినీ ఖడ్గంతో చంపిన సంగతంతా యెజెబెలుకు చెప్పాడు.

  22. అతడు పట్టణంలో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబు దగ్గరకు దూతలను పంపి, “బెన్-హదదు చెప్పేది ఇదే: ‘నీ వెండి బంగారాలు నావే, నీ భార్యల్లో నీ పిల్లల్లో ఉత్తమమైన వారు నా వారే’ ” అని కబురు పంపాడు.

  23. ఈలోగా, ఇశ్రాయేలు రాజైన అహాబు దగ్గరకు ఒక ప్రవక్త వచ్చి, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘ఈ గొప్ప సైన్యాన్ని చూస్తున్నావా? దానిని ఈ రోజు నీ చేతికి అప్పగిస్తాను, అప్పుడు యెహోవాను నేనని నీవు తెలుసుకుంటావు’ ” అని ప్రకటించాడు.

  24. “కాని ఇది ఎవరు చేస్తారు?” అని అహాబు అడిగాడు. అందుకు ప్రవక్త అన్నాడు, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘ప్రాంతీయ అధికారుల దగ్గర పని చేసే యువ అధికారులు చేస్తారు.’ ” “ఎవరు యుద్ధం ఆరంభిస్తారు?” అని అహాబు అడిగాడు. “నీవే” అని ప్రవక్త జవాబిచ్చాడు.

  25. అప్పుడు బెన్-హదదు, “మీ తండ్రి నుండి నా తండ్రి తీసుకున్న పట్టణాలను మీకు తిరిగి ఇస్తాను. నా తండ్రి సమరయలో చేసినట్టుగా మీరు దమస్కులో మీ సొంత వ్వాపార కేంద్రాలు ఏర్పరచుకోవచ్చు” అని అన్నాడు. అందుకు అహాబు, “ఈ ఒప్పందం మీద నేను నిన్ను విడుదల చేస్తాను” అని అన్నాడు. కాబట్టి అతడు ఒప్పందం చేసుకుని అతన్ని పంపించాడు.