Jezreel
32.5500, 35.3300 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి
Jezreel ను ప్రస్తావించే వచనాలు
వారి భూభాగంలో ఇవి ఉన్నాయి: యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము
అతన్ని గిలాదు, అషూరీ, యెజ్రెయేలు, ఎఫ్రాయిం బెన్యామీను, ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా చేశాడు.
తానాకుకు, మెగిద్దోకు యెజ్రెయేలు దిగువన ఉన్న సారెతాను తర్వాత ఉన్న బేత్-షాను ప్రాంతం అంతా, బేత్-షాను నుండి ఆబేల్-మెహోలా యొక్మీము అవతలి వరకు అహీలూదు కుమారుడైన బయనా అధికారి;
అంతలో ఆకాశం మబ్బులతో చీకటిగా మారింది, గాలి వీచింది, భారీ వర్షం కురవడం మొదలయ్యింది. అహాబు రథమెక్కి యెజ్రెయేలుకు వెళ్లాడు.
యెహోవా హస్తం ఏలీయాను బలపరచగా అతడు తన నడుము బిగించుకుని, అహాబు కంటే ముందే పరుగెత్తుకొని వెళ్లి యెజ్రెయేలు చేరుకున్నాడు.
కొంతకాలం తర్వాత, యెజ్రెయేలు వాడైన నాబోతుకు చెందిన ద్రాక్షతోటకు సంబంధించి ఒక సంఘటన జరిగింది. యెజ్రెయేలులో సమరయ రాజైన అహాబు భవనానికి సమీపంగా ఒక ద్రాక్షతోట ఉంది.
“అంతేకాక యెజెబెలు గురించి యెహోవా ఇలా చెప్తున్నారు: ‘యెజ్రెయేలు ప్రాకారం దగ్గరే యెజెబెలును కుక్కలు తింటాయి.’
కాబట్టి రాజైన యోరాము రామోతు దగ్గర అరాము రాజైన హజాయేలుతో చేసిన యుద్ధంలో అరామీయులు తనకు చేసిన గాయాల నుండి కోలుకోవడానికి యెజ్రెయేలుకు తిరిగి వచ్చాడు. అప్పుడు యెహోరాము కుమారుడు యూదా రాజైన అహజ్యా గాయపడి ఉన్న అహాబు కుమారుడైన యోరామును చూడడానికి యెజ్రెయేలుకు వెళ్లాడు.
యెజెబెలును యెజ్రెయేలు ప్రాంతంలో కుక్కలు తింటాయి, ఎవరూ ఆమెను సమాధి చేయరు.’ ” తర్వాత అతడు తలుపు తెరిచి పరుగెత్తాడు.
కాని, రాజైన యెహోరాము అరాము రాజైన హజాయేలుతో యుద్ధంలో అరామీయుల వల్ల తగిలిన గాయాల నుండి కోలుకోవడానికి యెజ్రెయేలు పట్టణానికి తిరిగి వెళ్లాడు.) అప్పుడు యెహు, “మీరు నన్ను రాజుగా చేయాలనుకుంటే, ఈ విషయాన్ని యెజ్రెయేలుకు వెళ్లి చెప్పడానికి ఇక్కడినుండి ఎవరూ తప్పించుకుని వెళ్లకుండా చూడండి” అన్నాడు.
అప్పుడు యెహు తన రథం ఎక్కి యెజ్రెయేలుకు వెళ్లాడు, ఎందుకంటే అక్కడ యోరాము విశ్రాంతి తీసుకుంటున్నాడు, యూదా రాజైన అహజ్యా అతన్ని పరామర్శించడానికి అక్కడికి వెళ్లాడు.
యెజ్రెయేలు గోపురం మీద నిలుచున్న కావలివాడు యెహు, అతని సైనికుల గుంపు రావడం చూసి, “నాకు సైనికులు కొంతమంది వస్తున్నట్లు కనిపిస్తుంది” అని బిగ్గరగా అరిచాడు. అందుకు యెహోరాము, “ఒక రౌతును పిలిపించి, వారిని కలవడానికి పంపించు, అతడు వారితో, ‘సమాధానంగా వస్తున్నారా?’ అని అడుగు” అని ఆదేశించాడు.
తర్వాత యెహు యెజ్రెయేలుకు వెళ్లాడు. ఆ సంగతి యెజెబెలు విన్నప్పుడు, ఆమె తన కళ్లకు కాటుక పెట్టుకొని, తలను అలంకరించుకుని, కిటికీలో నుండి చూస్తూ ఉంది.
వారు తిరిగివచ్చి యెహుకు విషయం చెప్పినప్పుడు, అతడు ఇలా జవాబిచ్చాడు, “యెహోవా తన సేవకుడైన తిష్బీయుడైన ఏలీయా ద్వారా చెప్పిన మాట ఇది: యెజ్రెయేలులో ఈ నేల మీద యెజెబెలు శరీరాన్ని కుక్కలు తింటాయి.
‘ఈమె యెజెబెలు’ అని ఎవరూ అనుకోకుండ ఈమె శవం యెజ్రెయేలు పొలంలో నేలమీది పేడలా అవుతుంది.”
అప్పుడు యెహు రెండవ ఉత్తరం వ్రాసి వారికి పంపాడు. అందులో అతడు, “మీరు నా పక్షంగా ఉండి నాకు లోబడితే రేపు ఈ వేళకు యెజ్రెయేలులో నా దగ్గరకు మీ యజమాని కుమారుల తలలు తీసుకురండి” అన్నాడు. ఆ డెబ్బైమంది రాజకుమారులు వారిని పెంచుతున్న పట్టణపు పెద్దల దగ్గర ఉన్నారు.
ఆ ఉత్తరం వారికి చేరినప్పుడు వారు డెబ్బైమంది రాజకుమారులను పట్టుకుని వారినందరిని చంపి వారి తలలు బుట్టల్లో పెట్టి యెజ్రెయేలులో ఉన్న యెహుకు పంపారు.
కాబట్టి యెహు యెజ్రెయేలులో మిగిలిన అహాబు వంశీయులందరినీ, అహాబు పక్షం ఉన్న ప్రముఖులను అతని సన్నిహిత మిత్రులను అతని యాజకులతో పాటు చంపాడు. అతని పక్షం వారెవ్వవరినీ వదిలిపెట్టలేదు.
కాబట్టి అతడు రామోతు దగ్గర అరాము రాజైన హజాయేలుతో చేసిన యుద్ధంలో తనకు చేసిన గాయాల నుండి కోలుకోవడానికి యెజ్రెయేలుకు తిరిగి వచ్చాడు. అప్పుడు యెహోరాము కుమారుడు యూదా రాజైన అహజ్యా, గాయపడి ఉన్న అహాబు కుమారుడైన యోరామును చూడడానికి యెజ్రెయేలుకు వెళ్లాడు.
అప్పుడు యెహోవా హోషేయతో అన్నారు, “అతనికి యెజ్రెయేలు అనే పేరు పెట్టు, ఎందుకంటే యెజ్రెయేలులో జరిగిన రక్తపాతాన్ని బట్టి త్వరలో నేను యెహు వంశాన్ని శిక్షిస్తాను, ఇశ్రాయేలు రాజ్యాన్ని తుదముట్టిస్తాను.
యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఏకమవుతారు; వారు ఒక నాయకున్ని నియమించుకుంటారు, వారు ఈ దేశంలో ఎదుగుతారు, ఎందుకంటే యెజ్రెయేలు దినం గొప్పగా ఉండబోతుంది.
భూమి ధాన్యంతో, నూతన ద్రాక్షరసంతో, ఒలీవనూనెతో మాట్లాడుతుంది. అవి యెజ్రెయేలుతో మాట్లాడతాయి.