Skip to content

Hazael గురించి బైబిల్ వచనాలు

16 వచనాలు · 4 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. రాజు హజాయేలుతో, “నీవు కానుక పట్టుకుని వెళ్లి దైవజనున్ని కలువు. అతని ద్వారా యెహోవాను సంప్రదించి ‘నేను ఈ జబ్బు నుండి కోలుకుంటానా?’ అని అడుగు” అన్నాడు.

  2. హజాయేలు బహుమానంగా దమస్కులోని శ్రేష్టమైన వస్తువులను తీసుకుని నలభై ఒంటెల మీద ఎక్కించి ఎలీషాను కలవడానికి వెళ్లాడు. అతడు వెళ్లి ఎలీషా ఎదుట నిలబడి, “మీ కుమారుడు, అరాము రాజైన బెన్-హదదు, ‘నేను ఈ జబ్బు నుండి కోలుకుంటానా?’ అని అడగమని నన్ను పంపాడు” అని చెప్పాడు.

  3. అందుకు ఎలీషా, “నీవు వెళ్లి, అతడు తప్పకుండ కోలుకుంటాడని చెప్పు. కానీ అతడు ఖచ్చితంగా చనిపోతాడని యెహోవా నాకు తెలియజేశారు” అన్నాడు

  4. హజాయేలు ఇబ్బందిపడేంతగా దైవజనుడు అతన్ని చూస్తూ ఏడ్వడం మొదలుపెట్టాడు.

  5. అప్పుడు హజాయేలు, “నా ప్రభువా ఎందుకు ఏడుస్తున్నారు?” అని అడిగాడు. అందుకతడు, “ఎందుకంటే మీరు ఇశ్రాయేలీయులకు చేసే కీడు నాకు తెలుసు. మీరు వారి కోటగోడలకు నిప్పంటిస్తారు, వారి యువకులను ఖడ్గంతో చంపుతారు, వారి చిన్న పిల్లలను నేలకు కొడతారు, వారి గర్భవతుల కడుపులు చీల్చివేస్తారు” అన్నాడు.

  6. అందుకు హజాయేలు, “మీ దాసుడు, కుక్కలాంటి వాడు, ఇంతటి సాహసం ఎలా చేస్తాడు?” అన్నాడు. ఎలీషా జవాబిస్తూ, “నీవు అరాము దేశానికి రాజవుతావని యెహోవా నాకు తెలియజేశారు” అని చెప్పాడు.

  7. అప్పుడు హజాయేలు ఎలీషాను విడిచి తన యజమాని దగ్గరకు తిరిగి వెళ్లాడు. బెన్-హదదు, “ఎలీషా నీతో ఏం చెప్పాడు” అని బెన్-హదదు అడిగినప్పుడు, హజాయేలు, “మీరు తప్పకుండా కోలుకుంటారు” అని జవాబిచ్చాడు.

  8. మరుసటిరోజు హజాయేలు మందమైన గుడ్డను తీసుకుని నీళ్లలో ముంచి రాజు ముఖం మీద పరచగా రాజు చనిపోయాడు. అప్పుడు హజాయేలు అతని స్థానంలో రాజయ్యాడు.

  9. అహజ్యా అహాబు కుమారుడైన యోరాముతో కలిసి, అరాము రాజైన హజాయేలు మీద యుద్ధం చేయడానికి రామోత్ గిలాదుకు వెళ్లగా అరామీయులు యోరామును గాయపరిచారు.

  10. కాబట్టి రాజైన యోరాము రామోతు దగ్గర అరాము రాజైన హజాయేలుతో చేసిన యుద్ధంలో అరామీయులు తనకు చేసిన గాయాల నుండి కోలుకోవడానికి యెజ్రెయేలుకు తిరిగి వచ్చాడు. అప్పుడు యెహోరాము కుమారుడు యూదా రాజైన అహజ్యా గాయపడి ఉన్న అహాబు కుమారుడైన యోరామును చూడడానికి యెజ్రెయేలుకు వెళ్లాడు.

  11. ఆ రోజుల్లో యెహోవా ఇశ్రాయేలు సరిహద్దును తగ్గించడం ప్రారంభించారు. హజాయేలు గిలాదు ప్రాంతమంతట్లో యొర్దానుకు తూర్పున ఉన్న ఇశ్రాయేలీయుల సరిహద్దును (గాదు, రూబేను, మనష్షేల ప్రాంతమంతా), అర్నోను లోయలో ఉన్న అరోయేరు నుండి, గిలాదు నుండి బాషాను వరకు స్వాధీనం చేసుకున్నాడు.

  12. From Jordan eastward, all the land of Gilead, the Gadites, and the Reubenites, and the Manassites, from Aroer, which is by the river Arnon, even Gilead and Bashan.

  13. ఆ సమయంలో అరాము రాజైన హజాయేలు వెళ్లి గాతుపై దాడి చేసి దానిని స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత యెరూషలేము మీద దాడి చేయాలనుకున్నాడు.

  14. అయితే యూదా రాజైన యెహోయాషు తన పూర్వికులు, యూదా రాజులైన యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా ప్రతిష్ఠించిన వస్తువులను, యెహోవా మందిరంలో, అలాగే రాజభవనంలో ఉన్న ఖజానాలోని బంగారమంతా అరాము రాజైన హజాయేలుకు పంపాడు. కాబట్టి హజాయేలు యెరూషలేము నుండి వెళ్ళిపోయాడు.

  15. ఇశ్రాయేలు రాజైన అహాబు కుమారుడైన యోరాముతో కలిసి అరాము రాజైన హజాయేలు మీద యుద్ధం చేయడానికి రామోత్ గిలాదుకు వెళ్లినప్పుడు కూడా అతడు వారి సలహాను పాటించాడు. అరామీయులు యోరామును గాయపరిచారు;

  16. కాబట్టి అతడు రామోతు దగ్గర అరాము రాజైన హజాయేలుతో చేసిన యుద్ధంలో తనకు చేసిన గాయాల నుండి కోలుకోవడానికి యెజ్రెయేలుకు తిరిగి వచ్చాడు. అప్పుడు యెహోరాము కుమారుడు యూదా రాజైన అహజ్యా, గాయపడి ఉన్న అహాబు కుమారుడైన యోరామును చూడడానికి యెజ్రెయేలుకు వెళ్లాడు.