కంటెంట్‌కు వెళ్లండి

Ahab

80 వచనాలు · 6 కుటుంబ సభ్యులు

Ahab ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఇశ్రాయేలు రాజైన అహాబు కుమారుడైన యోరాముతో కలిసి అరాము రాజైన హజాయేలు మీద యుద్ధం చేయడానికి రామోత్ గిలాదుకు వెళ్లినప్పుడు కూడా అతడు వారి సలహాను పాటించాడు. అరామీయులు యోరామును గాయపరిచారు;

  2. కాబట్టి అతడు రామోతు దగ్గర అరాము రాజైన హజాయేలుతో చేసిన యుద్ధంలో తనకు చేసిన గాయాల నుండి కోలుకోవడానికి యెజ్రెయేలుకు తిరిగి వచ్చాడు. అప్పుడు యెహోరాము కుమారుడు యూదా రాజైన అహజ్యా, గాయపడి ఉన్న అహాబు కుమారుడైన యోరామును చూడడానికి యెజ్రెయేలుకు వెళ్లాడు.

  3. అహజ్యా యోరామును దర్శించడం ద్వారా దేవుడు అహజ్యాను పతనానికి తెచ్చారు. అహజ్యా చేరుకున్నప్పుడు, అహాబు ఇంటిని నాశనం చేయడానికి యెహోవా అభిషేకించిన నిమ్షీ కుమారుడైన యెహు మీదికి అతడు యెహోరాముతో కలిసి వెళ్లాడు.

  4. యెహు అహాబు ఇంటిపై తీర్పును అమలు చేస్తున్నప్పుడు, అతడు యూదా అధికారులను, అహజ్యాకు సేవ చేస్తున్న అహజ్యా బంధువుల కుమారులను చూసి వారిని చంపాడు.

  5. మీరు ఒమ్రీ కట్టడాలను పాటించారు అహాబు ఇంటివారి విధానాలన్నీ పాటించారు; వారి సంప్రదాయాలను అనుసరించారు; కాబట్టి నేను మిమ్మల్ని నాశనం చేస్తాను ప్రజలు మిమ్మల్ని అపహాస్యం చేస్తారు; మీరు నా ప్రజల నిందను భరిస్తారు.”