Skip to content

Negeb

37 verses · 3 known names

ఇలా కూడా పిలుస్తారు: south, way

30.3000, 34.2000 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Negeb ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. తర్వాత అబ్రాము ప్రయాణిస్తూ దక్షిణంగా వెళ్లాడు.

  2. అబ్రాము తన భార్యను తనకున్న అంతటిని తీసుకుని ఈజిప్టు నుండి దక్షిణ దేశానికి వెళ్లాడు, లోతు అతనితో పాటు వెళ్లాడు.

  3. దక్షిణం నుండి బయలుదేరి బేతేలుకు వచ్చేవరకు, అంటే బేతేలుకు హాయికి మధ్యలో తాను మొదట గుడారం వేసుకున్న చోటికి వెళ్లి,

  4. అబ్రాహాము అక్కడినుండి దక్షిణాదికి ప్రయాణం చేసి కాదేషుకు, షూరుకు మధ్య నివాసం ఉన్నాడు. కొంతకాలం గెరారులో ఉన్నాడు.

  5. ఇప్పుడు ఇస్సాకు బెయేర్-లహాయి-రోయి నుండి వచ్చాడు, ఎందుకంటే అతడు దక్షిణాదిలో నివాసముంటున్నాడు.

  6. మోషే వారిని కనాను దేశాన్ని పరిశీలించమని పంపినప్పుడు, అతడు ఇలా చెప్పాడు, “మీరు దక్షిణ మార్గం గుండా వెళ్లి, కొండసీమ వైపు వెళ్లండి.

  7. దక్షిణ దిక్కునుండి వెళ్లి, హెబ్రోనుకు వచ్చారు, అక్కడ అహీమాను, షేషయి, తల్మయి అనే అనాకు వంశస్థులు నివసించారు. (హెబ్రోను, ఈజిప్టులోని సోయను కంటే ఏడు సంవత్సరాల ముందే కట్టబడిన పురాతన పట్టణము.)

  8. అమాలేకీయులు దక్షిణాదిలో నివసిస్తారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ సీమలో ఉంటారు. కనానీయులు సముద్రతీరాన యొర్దాను నది ఒడ్డున నివసిస్తారు.”

  9. ఇశ్రాయేలీయులు అతారీముకు వెళ్లే మార్గాన వస్తున్నారని దక్షిణ ప్రాంతంలో ఉన్న అరాదులో ఉన్న కనానీయ రాజు విని, ఇశ్రాయేలీయులపై దాడి చేసి, కొంతమందిని చెరగా తీసుకెళ్లాడు.

  10. కనాను దక్షిణ దిక్కున కనానీయుడైన అరాదు పట్టణ రాజు ఇశ్రాయేలీయులు వస్తున్నారని విన్నాడు.

  11. మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల కొండ ప్రాంతం వైపు వెళ్లండి; అరాబాలో, పర్వతాల్లో, పశ్చిమ కొండ ప్రాంతంలో, దక్షిణం వైపున సముద్రతీరంలో ఉన్న అన్ని స్థలాలకు, కనాను దేశానికి, లెబానోనుకు మహానదియైన యూఫ్రటీసు వరకు ఉన్న పొరుగు దేశాలకు వెళ్లండి.

  12. దక్షిణ ప్రాంతాన్ని, ఖర్జూర చెట్ల పట్టణమైన యెరికో లోయ నుండి సోయరు వరకు ఉన్న మొత్తం ప్రాంతాన్ని అతనికి చూపించారు.

  13. కాబట్టి యెహోషువ కొండ ప్రాంతాన్ని, దక్షిణ ప్రాంతాన్ని, పడమటి పర్వతాలను, కొండ వాలులతో సహా మొత్తం ప్రాంతాన్ని వాటి రాజులందరితో పాటు స్వాధీనం చేసుకున్నాడు. ఎవ్వరినీ మిగల్చలేదు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లుగానే, ఊపిరితో ఉన్నవారందరిని అతడు పూర్తిగా నాశనం చేశాడు.

  14. కాబట్టి యెహోషువ ఈ మొత్తం భూమిని స్వాధీనం అనగా కొండసీమ, దక్షిణ ప్రాంతం, గోషేను ప్రాంతమంతా, పశ్చిమ పర్వత ప్రాంతాలు, అరాబా, ఇశ్రాయేలు పర్వతాలు వాటి దిగువ ప్రాంతాలు,

  15. ఈ భూములలో కొండసీమ, పశ్చిమ పర్వతాలు, అరాబా, పర్వత వాలులు, అరణ్యం, దక్షిణ ప్రాంతం ఉన్నాయి. ఇవి హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయుల దేశాలు.

  16. అందుకామె జవాబిస్తూ, “నాకు ప్రత్యేక దీవెన కావాలి. నీవు నాకు దక్షిణం దేశంలో భూమి ఇచ్చావు, ఇప్పుడు నీటి ఊటలు కూడా ఇవ్వు” అని అన్నది. కాబట్టి కాలేబు ఆమెకు ఎగువన, దిగువన ఉన్న నీటి మడుగులను ఇచ్చాడు.

  17. ఈ పట్టణాల చుట్టూరా బాలత్-బెయేరు (దక్షిణాన ఉన్న రామా) వరకు ఉన్న గ్రామాలన్నీ.

  18. ఆ తర్వాత యూదా వారు కొండ సీమలో, దక్షిణ దేశంలో, పశ్చిమ కొండ దిగువ ప్రాంతంలో ఉన్న కనానీయులతో పోరాడటానికి వెళ్లారు.

  19. ఆమె జవాబిస్తూ, “నాకు ప్రత్యేక దీవెన కావాలి. నీవు నాకు దక్షిణం దేశంలో భూమి ఇచ్చావు, ఇప్పుడు నీటి ఊటలు కూడా ఇవ్వు” అని అన్నది. కాబట్టి కాలేబు ఆమెకు ఎగువ, దిగువ నీటి మడుగులను ఇచ్చాడు.

  20. కెనీయుడైన మోషే మామ యూదా ప్రజలతో ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదా ఎడారికి వెళ్లి అక్కడ ఉన్నవారితో నివసించారు.

  21. ఆకీషు, “ఈ రోజు మీరెక్కడ దాడి చేశారు?” అని అడిగినప్పుడు, దావీదు, “యూదా దేశానికి యెరహ్మెయేలు దేశానికి కెనీయుల దేశానికి దక్షిణంగా ఉన్న చోటుపై దాడి చేశాం” అని చెప్పాడు.

  22. దావీదు అతని మనుష్యులు మూడవ రోజున సిక్లగుకు చేరుకున్నారు. అంతలో అమాలేకీయులు దక్షిణదేశం మీద సిక్లగు మీద దాడిచేసి సిక్లగును దోచుకొని దానిని కాల్చివేశారు.

  23. మేము దాడిచేసి కెరేతీయుల దక్షిణ దేశాన్ని యూదా దేశాన్ని కాలేబు దక్షిణ దేశాన్ని దోచుకొని సిక్లగును కాల్చివేశాము” అని చెప్పాడు.

  24. దావీదు దానిని బేతేలులో దక్షిణ రామోతులో యత్తీరులో ఉన్నవారికి,

  25. అక్కడినుండి కోటలున్న తూరు పట్టణానికి హివ్వీయుల, కనానీయుల పట్టణాలన్నిటికి వచ్చారు. చివరిగా యూదా దేశానికి దక్షిణాన ఉన్న బెయేర్షేబ వరకు వచ్చారు.