Skip to content

Ashkelon

11 verses · 2 known names

ఇలా కూడా పిలుస్తారు: Askelon

31.6600, 34.5400 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Ashkelon ను ప్రస్తావించే వచనాలు

  1. యూదా వారు గాజాను అష్కెలోనును ఎక్రోనును ఈ పట్టణాల చుట్టూ ఉన్న ప్రదేశాలతో పాటు పట్టుకున్నారు.

  2. అప్పుడు యెహోవా ఆత్మ బలంగా అతని మీదికి వచ్చాడు. అతడు అష్కెలోను పట్టణానికి వెళ్లి, అక్కడి వారి ముప్పైమందిని చంపి, వారి వస్త్రాలను దోచుకొని పొడుపు కథ అర్థం చెప్పిన వారికిచ్చాడు. కోపంతో మండి పడుతూ అతడు తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్లాడు.

  3. ఫిలిష్తీయులు యెహోవాకు అపరాధపరిహార అర్పణగా పంపిన బంగారు గడ్డలు అష్డోదు, గాజా, అష్కెలోను, గాతు, ఎక్రోనులకు ఒక్కొక్కటి.

  4. “ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషించకూడదు సున్నతిలేనివారి కుమార్తెలు ఆనందించకూడదు. కాబట్టి ఈ వార్త గాతులో చెప్పకండి, అష్కెలోను వీధుల్లో దీనిని ప్రకటించకండి.

  5. అక్కడున్న విదేశీయులందరు అనగా ఊజు రాజులందరూ; ఫిలిష్తీయ పట్టణాలైన అష్కెలోను, గాజా, ఎక్రోను రాజులందరూ అష్డోదులో మిగిలిన ప్రజలు;

  6. గాజా దుఃఖంలో తల క్షౌరం చేసుకుంటుంది; అష్కెలోను నిశ్శబ్దం చేయబడుతుంది. సమతల మైదానంలో మిగిలి ఉన్నవారలారా, ఎంతకాలం మిమ్మల్ని మీరు గాయపరచుకుంటారు?

  7. అయితే అష్కెలోను మీదా, సముద్ర తీర ప్రాంతాల మీద దాడి చేయమని, యెహోవా దాన్ని ఆజ్ఞాపించినప్పుడు, అది ఎలా విశ్రమిస్తుంది?”

  8. నేను అష్డోదు రాజును నాశనం చేస్తాను, అతడు అష్కెలోనులో రాజదండం పట్టుకున్నవాడు. నేను ఫిలిష్తీయులలో చివరి వారు మరణించే వరకు, నేను ఎక్రోనుకు విరుద్ధంగా నా చేతిని ఉంచుతాను” అని ప్రభువైన యెహోవా చెప్తున్నారు.

  9. గాజా విడిచిపెట్టబడుతుంది, అష్కెలోను పాడైపోతుంది. మధ్యాహ్న సమయంలో అష్డోదు ఖాళీ చేయబడుతుంది, ఎక్రోను పట్టణం పెళ్ళగించబడుతుంది.

  10. ఆ ప్రాంతం యూదా వంశంలో మిగిలిన వారికి స్వాధీనం అవుతుంది. వారి దేవుడు యెహోవా వారి పట్ల శ్రద్ధ చూపిస్తారు, వారు బందీలుగా వెళ్లిన స్థలాల నుండి ఆయన వారిని రప్పిస్తారు. వారు ఆ ప్రాంతంలో తమ మందలు మేపుతారు. సాయంకాల సమయంలో అష్కెలోను ఇళ్ళలో పడుకుంటారు.

  11. అష్కెలోను దానిని చూసి భయపడుతుంది; గాజా వేదనతో విలపిస్తుంది ఎక్రోను కూడా తన నిరీక్షణ కోల్పోతుంది. గాజా తన రాజును కోల్పోతుంది అష్కెలోను ఎడారిగా మారుతుంది.