Skip to content

The Ammonites గురించి బైబిల్ వచనాలు

121 వచనాలు · 46 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఇశ్రాయేలీయులు మరల యెహోవా కళ్ళెదుట చెడు కార్యాలు చేశారు. వారు బయలు, అష్తారోతు, అరాము, సీదోను, మోయాబు, అమ్మోనీయుల, ఫిలిష్తీయుల దేవుళ్ళను పూజించారు. ఇశ్రాయేలీయులు యెహోవాను విడిచి ఆయనను సేవించడం మానుకున్నారు.

  2. యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోప్పడి వారిని ఫిలిష్తీయులకు, అమ్మోనీయులకు అప్పగించారు,

  3. వారు ఆ సంవత్సరం నుండి పద్దెనిమిది సంవత్సరాలు యొర్దాను తూర్పున ఉన్న గిలాదులో, అమోరీయుల దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులందరిని బాధించి అణచివేశారు.

  4. అమ్మోనీయులు కూడా యూదా, బెన్యామీను, ఎఫ్రాయిం ప్రజలతో యుద్ధం చేయడానికి యొర్దానును దాటారు; ఇశ్రాయేలీయులు ఎంతో శ్రమ అనుభవించారు.

  5. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాతో, “మేము పాపం చేశాము. మీ ఇష్ట ప్రకారం మాకు చేయండి, కాని ఇప్పుడు దయచేసి మమ్మల్ని కాపాడండి” అని విన్నవించుకున్నారు.

  6. తర్వాత ఇశ్రాయేలీయులు తమ మధ్యలో ఉన్న ఇతర దేవుళ్ళను తొలగించి యెహోవాను సేవించారు. యెహోవా వారు అనుభవిస్తున్న శ్రమను ఇక సహించలేకపోయారు.

  7. ఆ సమయంలో అమ్మోనీయుల సైన్యాలు యుద్ధానికి సమావేశమై గిలాదులో బస చేశారు, ఇశ్రాయేలు ప్రజలు మిస్పాలో బస చేశారు.

  8. గిలాదు నాయకులు ఒకరితో ఒకరు, “అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి మనలను ఎవరు నడిపిస్తారో, అతడు గిలాదు నివాసులందరి మీద అధికారిగా ఉంటాడు” అని అనుకున్నారు.

  9. కొంతకాలం తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో పోరాడుతున్నప్పుడు, గిలాదు పెద్దలు టోబు దేశంలో ఉన్న యెఫ్తాను తీసుకురావడానికి వెళ్లారు.

  10. And it was so, that when the children of Ammon made war against Israel, the elders of Gilead went to fetch Jephthah out of the land of Tob:

  11. యెఫ్తాతో వారు, “రా, వచ్చి మా దళాధిపతిగా ఉండు, అప్పుడు మేము అమ్మోనీయులతో పోరాడగలం” అన్నారు.

  12. యెఫ్తా గిలాదు పెద్దలతో అన్నాడు, “మీరు నన్ను ద్వేషించి, నా తండ్రి ఇంటి నుండి నన్ను తరిమి వేయలేదా? ఇప్పుడు మీకు కష్టం వచ్చిందని నా దగ్గరకు ఎందుకు వచ్చారు?”

  13. గిలాదు పెద్దలు అతనితో, “అయినాసరే, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాము; అమ్మోనీయులతో పోరాడడానికి మాతో రా, నీవు గిలాదులో మా అందరికి అధిపతిగా ఉంటావు” అని యెఫ్తాతో అన్నారు.

  14. యెఫ్తా గిలాదు పెద్దలకు జవాబిస్తూ, “ఒకవేళ నేను అమ్మోనీయులతో పోరాడడానికి నన్ను మీరు తీసుకుంటే, యెహోవా నాకు వారిని ఇస్తే, అప్పుడు నేను మీ అధిపతిగా ఉంటానా?” అని అడిగాడు.

  15. అందుకు గిలాదు పెద్దలు, “యెహోవా మాకు సాక్షి; నీవు చెప్పినట్లు తప్పకుండ మేము చేస్తాము” అని యెఫ్తాతో అన్నారు.

  16. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో వెళ్లాడు, ప్రజలు అతన్ని ప్రధానిగా, దళాధిపతిగా నియమించారు. అతడు మిస్పాలో యెహోవా సన్నిధిలో తన మాటలన్నీ తిరిగి తెలిపాడు.

  17. తర్వాత యెఫ్తా అమ్మోనీయుల రాజు దగ్గరకు ఈ ప్రశ్నను అడగడానికి దూతలను పంపాడు: “నా దేశం మీద దాడి చేయడానికి నీకు నాకు విరుద్ధంగా ఉన్నది ఏంటి?”

  18. అమ్మోనీయుల రాజు యెఫ్తా దూతలతో, “ఇశ్రాయేలు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు, వారు అర్నోను నుండి యబ్బోకు వరకు, యొర్దాను వరకు ఉన్న నా దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు నాకు సమాధానంతో దానిని తిరిగి ఇచ్చేయాలి” అన్నాడు.

  19. యెఫ్తా అమ్మోనీయుల రాజు దగ్గరకు దూతలను తిరిగి పంపించి,

  20. “యెఫ్తా చెప్పేది ఇది: ఇశ్రాయేలు మోయాబు దేశాన్ని లేదా అమ్మోనీయుల దేశాన్ని తీసుకోలేదు.

  21. ఇశ్రాయేలీయులు ఈజిప్టులో నుండి వచ్చినప్పుడు, వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యంలో నడిచి కాదేషుకు వచ్చారు.

  22. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజు దగ్గరకు దూతలను పంపి, ‘మీ దేశం గుండా వెళ్లడానికి మమ్మల్ని అనుమతించండి’ అని అడిగినప్పుడు, ఎదోము రాజు వినలేదు. వారు మోయాబు రాజును కూడా అడిగారు, అతడు తిరస్కరించాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు కాదేషులో నివాసం ఉన్నారు.

  23. “తర్వాత వారు అరణ్యం గుండా ప్రయాణం చేస్తూ ఎదోము, మోయాబు దేశాల చుట్టూ తిరిగి, మోయాబుకు తూర్పుదిక్కు దాటి అర్నోను అవతలి వైపున మకాం వేశారు. అర్నోను మోయాబుకు సరిహద్దు కాబట్టి వారు మోయాబు సరిహద్దులోనికి ప్రవేశించలేదు.

  24. “తర్వాత ఇశ్రాయేలీయులు హెష్బోనులో ఏలే అమోరీయుల రాజైన సీహోను దగ్గరకు దూతలను పంపి, ‘మా స్థలానికి వెళ్లడానికి మీ దేశం గుండా మమ్మల్ని వెళ్లనివ్వండి’ అని అడిగారు.

  25. అయినప్పటికీ సీహోను ఇశ్రాయేలు తమ సరిహద్దు గుండా వెళ్లడం నమ్మలేదు. అతడు తన సైన్యాన్ని సమకూర్చుకొని, యహజు దగ్గర శిబిరం ఏర్పరచుకొని, అక్కడినుండి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశాడు.