Skip to content

The Ammonites గురించి బైబిల్ వచనాలు

121 వచనాలు · 46 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “అప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సీహోనును, అతని సైన్యమంతటిని ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించారు, వారు వారిని ఓడించారు. ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశమంతటిని, ఆ దేశంలో నివసించేవారిని స్వాధీనం చేసుకుని,

  2. అర్నోను నుండి యబ్బోకు వరకు, అరణ్యం నుండి యొర్దాను వరకు అమోరీయుల భూభాగాన్ని ఆక్రమించుకున్నారు.

  3. “కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అమోరీయులను తన ప్రజలైన ఇశ్రాయేలు ఎదుట తరిమివేశారు, ఇప్పుడు దానిని తీసుకోవడానికి నీకు ఏమి హక్కు ఉంది?

  4. మీ దేవుడైన కెమోషు మీకు ఇచ్చేది మీరు తీసుకోరా? అలాగే మా దేవుడైన యెహోవా మాకు ఏది ఇచ్చినా దానిని మేము స్వాధీనం చేసుకుంటాము.

  5. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడైన బాలాకు కంటే నీవు గొప్పవాడివా? అతడు ఇశ్రాయేలుతో ఎప్పుడైనా వాదన కాని పోరాటం కాని చేశాడా?

  6. మూడువందల సంవత్సరాలు ఇశ్రాయేలు హెష్బోను, అరోయేరు, చుట్టుప్రక్కల స్థావరాలను, అర్నోనులో ఉన్న అన్ని పట్టణాలను ఆక్రమించింది. ఆ సమయంలో మీరు వాటిని ఎందుకు తిరిగి తీసుకోలేదు?

  7. నేను నీ పట్ల తప్పు చెయ్యలేదు, నీవే నా మీదికి యుద్ధానికి వస్తూ నా పట్ల తప్పు చేస్తున్నావు. న్యాయాధిపతియైన యెహోవా ఈ రోజు ఇశ్రాయేలీయులకు, అమ్మోనీయులకు న్యాయం తీర్చును గాక.”

  8. అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనకు పంపిన వర్తమానాన్ని లెక్కచేయలేదు.

  9. తర్వాత యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి వచ్చినప్పుడు, అతడు గిలాదు, మనష్షే నుండి దాటి, గిలాదు యొక్క మిస్పే నుండి వెళ్లి అక్కడినుండి అమ్మోనీయుల మీదికి వెళ్లాడు.

  10. అప్పుడు యెఫ్తా యెహోవాకు ఇలా మ్రొక్కుబడి చేశాడు: “మీరు అమ్మోనీయులను నా చేతికి అప్పగిస్తే,

  11. నేను అమ్మోనీయుల దగ్గర నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు, నా ఇంటి నుండి నన్ను కలుసుకోడానికి మొదలు ఏది బయటకు వస్తే, అది యెహోవాకు చెందినది, దానిని నేను దహనబలిగా అర్పిస్తాను.”

  12. తర్వాత యెఫ్తా అమ్మోనీయులతో పోరాడడానికి వెళ్లాడు, యెహోవా వారని అతని చేతికి అప్పగించారు.

  13. అతడు అరోయేరు నుండి మిన్నీతు వరకు, అలా ఆబేల్-కెరామీము వరకు ఇరవై పట్టణాలను నాశనం చేశాడు. ఇలా ఇశ్రాయేలు అమ్మోనును లోబరచుకుంది.

  14. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్-గిలాదును ముట్టడించినప్పుడు యాబేషు వారందరు అతనితో, “మాతో ఒప్పందం చేసుకో, మేము నీకు సేవకులమై ఉంటాము” అన్నారు.

  15. అయితే, “ఇశ్రాయేలీయులందరికి అవమానం కలిగేలా మీ అందరి కుడి కళ్లు పెరికివేస్తాననే ఒకే ఒక షరతు మీద మీతో ఒప్పందం చేసుకుంటాను” అని అమ్మోనీయుడైన నాహాషు జవాబిచ్చాడు.

  16. అందుకు యాబేషు పెద్దలు అతనితో, “మేము ఇశ్రాయేలు అంతటా రాయబారులను పంపడానికి మాకు ఏడు రోజుల సమయం ఇవ్వు; మమ్మల్ని రక్షించడానికి ఎవరూ రాకపోతే మేము నీకు లొంగిపోతాము” అన్నారు.

  17. కొంతకాలం తర్వాత అమ్మోనీయుల రాజు చనిపోగా, అతని స్థానంలో అతని కుమారుడు హానూను రాజయ్యాడు.

  18. అప్పుడు దావీదు, “హానూను తండ్రియైన నాహాషు నా మీద దయ చూపించినట్లే నేను హామాను మీద దయ చూపిస్తాను” అని అనుకున్నాడు. కాబట్టి అతని తండ్రి విషయంలో తన సానుభూతి తెలుపడానికి దావీదు తన ప్రతినిధులను పంపించాడు. దావీదు మనుష్యులు అమ్మోనీయుల దేశానికి చేరుకున్నపుడు,

  19. అమ్మోనీయుల దళాధిపతులు తమ ప్రభువైన హానూనుతో, “నీ తండ్రిని గౌరవించడానికి నీకు సానుభూతి తెలుపాలని దావీదు దూతలను పంపాడని అనుకుంటున్నావా? దావీదు వారిని పంపింది కేవలం పట్టణాన్ని పరిశోధించి, దాన్ని వేగుచూసి పడగొట్టడానికి కాదా?” అని అన్నారు.

  20. అందువల్ల హానూను దావీదు దూతలను పట్టుకుని ఒక్కొక్కరికి సగం గడ్డం గీసి, పిరుదుల దగ్గర వారి వస్త్రాలు కత్తిరించి పంపించేశాడు.

  21. ఇది విన్న దావీదు యోవాబును యుద్ధ సైనికులందరితో సహా పంపించాడు.

  22. అమ్మోనీయులు బయటకు వచ్చి తమ పట్టణ ద్వారం దగ్గర యుద్ధ పంక్తులు తీర్చారు. సోబా, రెహోబు నుండి వచ్చిన అరామీయులు, అలాగే టోబు, మయకా నుండి వచ్చినవారు విడివిడిగా పొలాల్లో ఉన్నారు.

  23. యోవాబు తన ముందు వెనుకా యుద్ధ పంక్తులు ఉండడం చూశాడు; ఇశ్రాయేలులో కొందరు అత్యుత్తమ దళాలను ఎంపికచేసి, వారిని అరామీయులకు ఎదురుగా మోహరించాడు.

  24. మిగిలిన వారిని తన సోదరుడైన అబీషై ఆధీనంలో ఉంచి వారిని అమ్మోనీయులకు ఎదురుగా మోహరించాడు.

  25. యోవాబు, “అరామీయులను ఎదుర్కోవడం నాకు కష్టమైనప్పుడు నన్ను రక్షించడానికి నీవు రావాలి. అమ్మోనీయులను ఎదుర్కోవడం నీకు కష్టమైనప్పుడు నిన్ను రక్షించడానికి నేను వస్తాను.