Hanun
Hanun ను ప్రస్తావించే వచనాలు
కొంతకాలం తర్వాత అమ్మోనీయుల రాజు చనిపోగా, అతని స్థానంలో అతని కుమారుడు హానూను రాజయ్యాడు.
అప్పుడు దావీదు, “హానూను తండ్రియైన నాహాషు నా మీద దయ చూపించినట్లే నేను హామాను మీద దయ చూపిస్తాను” అని అనుకున్నాడు. కాబట్టి అతని తండ్రి విషయంలో తన సానుభూతి తెలుపడానికి దావీదు తన ప్రతినిధులను పంపించాడు. దావీదు మనుష్యులు అమ్మోనీయుల దేశానికి చేరుకున్నపుడు,
అమ్మోనీయుల దళాధిపతులు తమ ప్రభువైన హానూనుతో, “నీ తండ్రిని గౌరవించడానికి నీకు సానుభూతి తెలుపాలని దావీదు దూతలను పంపాడని అనుకుంటున్నావా? దావీదు వారిని పంపింది కేవలం పట్టణాన్ని పరిశోధించి, దాన్ని వేగుచూసి పడగొట్టడానికి కాదా?” అని అన్నారు.
అందువల్ల హానూను దావీదు దూతలను పట్టుకుని ఒక్కొక్కరికి సగం గడ్డం గీసి, పిరుదుల దగ్గర వారి వస్త్రాలు కత్తిరించి పంపించేశాడు.
అప్పుడు దావీదు, “హానూను తండ్రియైన నాహాషు నా మీద దయ చూపించాడు కాబట్టి నేను హామాను మీద దయ చూపిస్తాను” అని అనుకున్నాడు. కాబట్టి అతని తండ్రి విషయంలో తన సానుభూతి తెలుపడానికి దావీదు తన ప్రతినిధులను పంపించాడు. దావీదు దూతలు అతనికి సానుభూతి తెలుపడానికి అమ్మోనీయుల దేశంలో ఉన్న హానూను దగ్గరకు వచ్చినప్పుడు,
అమ్మోనీయుల దళాధిపతులు హానూనుతో, “నీ తండ్రిని గౌరవించడానికి నీకు సానుభూతి తెలుపాలని దావీదు దూతలను పంపాడని అనుకుంటున్నావా? అతని దూతలు ఈ దేశాన్ని జయించడానికి గూఢాచారులుగా రాలేదా?” అన్నారు.
అందువల్ల హానూను దావీదు దూతలను పట్టుకుని వారి జుట్టు గొరిగించి, పిరుదుల దగ్గర వారి వస్త్రాలు కత్తిరించి పంపించేశాడు.
దావీదుకు తాము కోపం తెప్పించామని అమ్మోనీయులు గ్రహించి, హానూను అమ్మోనీయులు వేయి తలాంతుల వెండిని పంపి అరాము నహరయీము నుండి, అరాము మయకా నుండి, సోబా నుండి రథాలను, రథసారధులను కిరాయికి తీసుకున్నారు.