కంటెంట్‌కు వెళ్లండి

The Ammonites గురించి బైబిల్ వచనాలు

121 వచనాలు · 46 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు యెహోషాపాతు నేలకు సాష్టాంగపడి నమస్కరించాడు; యూదా, యెరూషలేము ప్రజలందరూ యెహోవా సన్నిధిలో ఆరాధించారు.

  2. కహాతు వంశానికి, కోరహీయుల వంశానికి చెందిన లేవీయులు కొందరు లేచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను పెద్ద స్వరంతో స్తుతించారు.

  3. తెల్లవారుజామున వారు తెకోవా ఎడారికి బయలుదేరారు. వారు బయలుదేరినప్పుడు, యెహోషాపాతు నిలబడి, “యూదా, యెరూషలేము ప్రజలారా, నా మాట వినండి! మీ దేవుడైన యెహోవాయందు విశ్వాసముంచండి, అప్పుడు మీరు స్థిరంగా నిలబడతారు; అతని ప్రవక్తలపై విశ్వాసముంచండి, మీరు విజయం సాధిస్తారు”

  4. ప్రజలతో మాట్లాడిన తర్వాత యెహోషాపాతు, యెహోవాకు ఇలా పాడటానికి, ఆయన పవిత్రత యొక్క వైభవాన్ని స్తుతించడానికి మనుష్యులను నియమించాడు, వారు సైన్యానికి ముందుగా నడిచారు: “యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిత్యం ఉంటుంది.”

  5. వారు అలా పాటలు పాడడం, స్తుతించడం మొదలుపెట్టినప్పుడు యెహోవా యూదా వారి మీద దండెత్తుతున్న అమ్మోనీయుల మీద, మోయాబీయుల మీద, శేయీరు కొండసీమవారి మీదా మాటుగాండ్రు ఉండేలా చేశారు. కాబట్టి వారు ఓడిపోయారు.

  6. ఎలాగంటే, అమ్మోనీయులు, మోయాబీయులు శేయీరు కొండసీమవారి మీద దాడి చేసి వారిని హతమార్చి నాశనం చేశారు. శేయీరు కొండసీమవారిని హతమార్చిన తర్వాత వారు ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు.

  7. యూదా మనుష్యులు ఎడారి వైపున ఉన్న ప్రదేశానికి వచ్చి విస్తారమైన సైన్యం వైపు చూసినప్పుడు, వారికి నేలమీద పడి ఉన్న మృతదేహాలు మాత్రమే కనిపించాయి; ఎవరూ తప్పించుకోలేదు.

  8. ఈ విషయాలన్ని జరిగిన తర్వాత నాయకులు నా దగ్గరకు వచ్చి, “ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, అందరు తమ పొరుగువారైన కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఈజిప్టువారు, అమోరీయుల నుండి వేరుగా ఉండకుండా వారితో కలిసిపోయి, వారు చేసే అసహ్యకరమైన ఆచారాలను పాటించారు.

  9. వారి కుమార్తెలను తమకు, తమ కుమారులకు భార్యలుగా చేసుకుంటూ, పరిశుద్ధజాతిగా ఉండకుండా తమ చుట్టూ ఉన్నవారితో కలిసిపోయారు. నాయకులు అధికారులు ఈ విషయంలో అపనమ్మకంగా ఉన్నారు” అని చెప్పారు.

  10. ఇది విని నేను నా చొక్కా, పై వస్త్రం చింపుకుని, తలవెంట్రుకలు, గడ్డం పీక్కుని దిగ్భ్రాంతితో కూర్చుండిపోయాను.

  11. అంతే కాకుండా, ఆ రోజుల్లో అష్డోదు, అమ్మోను, మోయాబులకు చెందిన స్త్రీలను పెళ్ళి చేసుకున్న యూదా పురుషులను నేను చూశాను.

  12. వారి పిల్లల్లో సగం మంది అష్డోదు భాషను గాని పరాయి ప్రజల భాషను గాని మాట్లాడేవారు కాని యూదా భాషలో ఎలా మాట్లాడాలో వారికి తెలియదు.

  13. నేను వారిని గద్దించి శపించాను. ఆ పురుషులలో కొంతమందిని కొట్టి వారి జుట్టు పెరికించాను. నేను వారితో దేవుని పేరిట ప్రమాణం చేయించి, “మీరు మీ కుమార్తెలకు వారి కుమారులతో పెళ్ళి చేయకూడదు, వారి కుమార్తెలతో మీరు మీ కుమారులు పెళ్ళి చేసుకోకూడదు.

  14. ఇలాంటి పెళ్ళిళ్ళను బట్టి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపం చేయలేదా? అనేక దేశాల్లో అతని వంటి రాజు మరొకడు లేడు. అతడు తన దేవునిచే ప్రేమించబడి దేవుడు అతన్ని ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా చేశాడు కాని యూదేతరుల స్త్రీలు అతనిచేత పాపం చేయించారు.

  15. ఈ ఘోరమైన చెడునంతా చేస్తూ యూదేతరుల స్త్రీలను పెళ్ళి చేసుకుని మన దేవుని పట్ల నమ్మకద్రోహులుగా ఉండి పాపం చేస్తున్న మీలాంటి వారి మాటలు మేము వినాలా?” అన్నాను.

  16. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు కుమారుడైన యోయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బల్లటుకు అల్లుడు. అతన్ని నా దగ్గర నుండి దూరంగా వెళ్లగొట్టాను.

  17. నేను ఉత్తరాది జనాంగాలను, నా సేవకుడైన బబులోను రాజు నెబుకద్నెజరును పిలిపిస్తాను” అని యెహోవా అంటున్నారు. నేను వారిని ఈ దేశం మీదికి, దాని నివాసుల మీదికి, చుట్టుప్రక్కల ఉన్న అన్ని దేశాల మీదికి తీసుకువస్తాను. నేను ఈ ప్రజలను పూర్తిగా నాశనం చేస్తాను. వారిని భయానకంగా, హేళనగా శాశ్వతమైన నాశనంగా చేస్తాను.

  18. నేను సంతోష ధ్వనులను, వధూవరుల స్వరాలను, తిరుగటిరాళ్ల శబ్దాన్ని దీపపు వెలుగును వారి నుండి దూరం చేస్తాను.

  19. ఈ దేశమంతా నిర్జనమైన బంజరుగా మారుతుంది, ఈ దేశాలు డెబ్బై సంవత్సరాలు బబులోను రాజుకు సేవ చేస్తాయి.

  20. “అయితే డెబ్బై సంవత్సరాలు పూర్తయినప్పుడు, నేను బబులోను రాజును, అతని ప్రజలను, బబులోనీయుల దేశాన్ని వారి దోషాన్ని బట్టి శిక్షిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “దానిని శాశ్వతంగా నిర్జనం చేస్తాను.

  21. నేను ఆ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాటన్నిటిని, ఈ పుస్తకంలో వ్రాసి ఉన్నవాటన్నిటిని, యిర్మీయా ప్రవచించిన ప్రకారం ఆ దేశం మీదికి రప్పిస్తాను.

  22. వారే అనేక దేశాలకు, గొప్ప రాజులకు బానిసలుగా ఉంటారు; వారి క్రియలనుబట్టి వారి చేతి పనులను బట్టి నేను వారికి ప్రతిఫలమిస్తాను.”

  23. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాతో ఇలా అన్నాడు: “నా ఉగ్రత అనే ద్రాక్షరసంతో నిండిన ఈ గిన్నెను నా చేతిలో నుండి తీసివేసి, నేను నిన్ను పంపే దేశాలన్నిటిని త్రాగనివ్వు.

  24. వారు దానిని త్రాగినప్పుడు, నేను వారి మధ్యకు పంపబోయే ఖడ్గాన్ని చూసి వారు తడబడి పిచ్చివారైపోతారు.”

  25. కాబట్టి నేను యెహోవా చేతిలో నుండి గిన్నె తీసుకుని, ఆయన నన్ను పంపిన దేశాలన్నిటిని త్రాగేలా చేశాను: