Gath
ఇలా కూడా పిలుస్తారు: Gittites
31.6900, 34.8400 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి
Gath ను ప్రస్తావించే వచనాలు
ఇశ్రాయేలీయుల భూభాగంలో అనాకీయులు ఎవరూ మిగల్లేదు; గాజా, గాతు, అష్డోదులలో మాత్రమే కొంతమంది మిగిలారు.
కనానీయులవని పిలువబడిన ఈజిప్టు తూర్పున ఉన్న షీహోరు నది నుండి ఉత్తరాన ఎక్రోను భూభాగం వరకు, అయిదుగురు ఫిలిష్తీయ పాలకులకు సంబంధించిన గాజా, అష్డోదు, అష్కెలోను, గాతు, ఎక్రోను; ఆవీయుల భూభాగం,
కాబట్టి వారు ఫిలిష్తీయుల పాలకులందరినీ పిలిచి, “ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మనం ఏమి చేద్దాం?” అని వారిని అడిగారు. అందుకు వారు, “ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని ఇక్కడినుండి గాతు పట్టణానికి పంపించండి” అని చెప్పారు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని అక్కడినుండి తీసుకెళ్లారు.
ఫిలిష్తీయులు యెహోవాకు అపరాధపరిహార అర్పణగా పంపిన బంగారు గడ్డలు అష్డోదు, గాజా, అష్కెలోను, గాతు, ఎక్రోనులకు ఒక్కొక్కటి.
ఇశ్రాయేలీయులు నుండి ఫిలిష్తీయులు ఆక్రమించుకున్న పట్టణాలు అనగా ఎక్రోను నుండి గాతు వరకు ఉన్న అన్ని పట్టణాలు ఇశ్రాయేలుకు తిరిగి వచ్చాయి. పొరుగున ఉన్న గ్రామాలను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించారు. అమోరీయులకు ఇశ్రాయేలీయులకు మధ్య సమాధానం ఏర్పడింది.
గాతుకు చెందిన గొల్యాతు అనే శూరుడు ఫిలిష్తీయుల శిబిరం నుండి బయలుదేరాడు. అతని ఎత్తు ఆరు మూరల ఒక జేన.
అతడు వారితో మాట్లాడుతుండగా గాతుకు చెందిన ఫిలిష్తీయుడైన గొల్యాతు అనే శూరుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి రోజు చేసినట్లే ఆ రోజు కూడా సవాలు చేస్తూ ఉండగా దావీదు విన్నాడు.
అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యూదా ప్రజలు లేచి జయధ్వనులు చేస్తూ లోయవరకు ఎక్రోను ద్వారాల వరకు ఫిలిష్తీయులను వెంటాడారు. చనిపోయిన ఫిలిష్తీయులు షరాయిము దారిలో గాతు ఎక్రోను పట్టణాల వరకు పడి ఉన్నారు.
దావీదు సౌలుకు భయపడి ఆ రోజే బయలుదేరి పారిపోయి గాతు రాజైన ఆకీషు దగ్గరకు వచ్చాడు.
దావీదు ఈ మాటలు గుర్తుపెట్టుకుని గాతు రాజైన ఆకీషుకు చాలా భయపడ్డాడు.
కాబట్టి దావీదు తనతో ఉన్న ఆరువందలమంది పురుషులతో బయలుదేరి మాయోకు కుమారుడు గాతు రాజైన ఆకీషు దగ్గరకు వెళ్లాడు.
దావీదు అతని మనుష్యులు ఆకీషుతో పాటు గాతులో స్థిరపడ్డారు. ప్రతిఒక్కరు తమ తమ కుటుంబాలతో ఉన్నారు. అలాగే దావీదు ఇద్దరు భార్యలు: యెజ్రెయేలుకు చెందిన అహీనోయము, కర్మెలుకు చెందిన అబీగయీలు (నాబాలు విధవరాలు) అతనితో ఉన్నారు.
దావీదు గాతుకు పారిపోయాడని సౌలుకు తెలిసిన తర్వాత అతడు దావీదును వెదకడం మానివేశాడు.
దావీదు ఇలా చేస్తున్నాడని తమ గురించి సమాచారం అందిస్తారని భావించిన దావీదు గాతుకు తీసుకురావడానికి పురుషులను గాని స్త్రీలను గాని ప్రాణాలతో విడిచిపెట్టలేదు. అతడు ఫిలిష్తీయుల దేశంలో ఉన్నంతకాలం అలాగే చేస్తూ ఉన్నాడు.
“ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషించకూడదు సున్నతిలేనివారి కుమార్తెలు ఆనందించకూడదు. కాబట్టి ఈ వార్త గాతులో చెప్పకండి, అష్కెలోను వీధుల్లో దీనిని ప్రకటించకండి.
రాజు సేవకులందరూ రాజుకు ఇరువైపులా నడిచారు. కెరేతీయులు, పెలేతీయులు, గాతు నుండి అతనితో వచ్చిన ఆరువందలమంది గిత్తీయులు రాజుకు ముందుగా నడిచారు.
గాతు దగ్గర జరిగిన మరో యుద్ధంలో చాలా పొడవైన వాడొకడు ఉన్నాడు. అతని రెండు చేతులకు కాళ్లకు ఆరు వ్రేళ్ళ చొప్పున మొత్తం ఇరవైనాలుగు వ్రేళ్ళు ఉన్నాయి. అతడు కూడా రాఫా సంతతివాడు.
ఈ నలుగురు గాతుకు చెందిన రాఫా సంతతివారు, వీరు దావీదు అతని సైనికుల చేతిలో చనిపోయారు.
అయితే మూడేళ్ళ తర్వాత షిమీ దాసులలో ఇద్దరు పారిపోయి గాతు రాజు, మయకా కుమారుడైన ఆకీషు దగ్గరకు వెళ్లారు. “మీ దాసులు గాతులో ఉన్నారు” అని షిమీకి చెప్పబడింది.
వెంటనే షిమీ తన గాడిదకు జీను కట్టుకుని తన దాసులను వెదకడానికి గాతులో ఉన్న ఆకీషు దగ్గరకు వెళ్లాడు. షిమీ వెళ్లి గాతు నుండి తన దాసులను తీసుకువచ్చాడు.
షిమీ యెరూషలేము నుండి గాతుకు వెళ్లి, తిరిగివచ్చిన సంగతి సొలొమోనుకు తెలిసినప్పుడు,
ఆ సమయంలో అరాము రాజైన హజాయేలు వెళ్లి గాతుపై దాడి చేసి దానిని స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత యెరూషలేము మీద దాడి చేయాలనుకున్నాడు.
అతని కుమారుడు జాబాదు, అతని కుమారుడు షూతలహు. (అతని కుమారులైన ఏజెరు ఎల్యాదులు తమ దేశంలో పుట్టిన గాతీయుల పశువులను పట్టుకోడానికి వెళ్లినప్పుడు, గాతీయులు వారిని చంపారు.
బెరీయా, షెమ. వీరు అయ్యాలోనులో నివసిస్తున్నవారి కుటుంబాలకు పెద్దలు, గాతు పట్టణస్థులను వెళ్లగొట్టారు.
కాలక్రమేణా దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోబరచుకున్నాడు, వారి ఆధీనంలో నుండి గాతును, దాని చుట్టూ ఉన్న గ్రామాలను స్వాధీనం చేసుకున్నాడు.