Skip to content

Shimei

15 వచనాలు · 1 కుటుంబ సభ్యుడు

Shimei ను ప్రస్తావించే వచనాలు

  1. రాజైన దావీదు బహూరీముకు వచ్చినప్పుడు, సౌలు కుటుంబ వంశానికి చెందిన ఒక వ్యక్తి అక్కడినుండి బయటకు వచ్చాడు. అతడు గెరా కుమారుడైన షిమీ. అతడు బయటకు వస్తూ దావీదును శపిస్తున్నాడు.

  2. అంతేకాక షిమీ అతన్ని శపిస్తూనే, “వెళ్లిపో, వెళ్లిపో, హంతకుడా, దుర్మార్గుడా!

  3. దావీదు, అతని మనుష్యులు తమ దారిన ముందుకు వెళ్తుండగా, షిమీ అతనికి ఎదురుగా కొండ ప్రక్క నుండి వెళ్తూ, దావీదును శపిస్తూ, అతని మీదికి రాళ్లు విసురుతూ, అతని మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నాడు.

  4. బహూరీముకు చెందిన బెన్యామీనీయుడైన గెరా కుమారుడైన షిమీ త్వరత్వరగా రాజైన దావీదును కలుసుకోడానికి యూదా వారితో పాటు వచ్చాడు.

  5. రాజు కుటుంబీకులను ఇవతలకు దాటించడానికి, రాజు కోరినట్లు చేయడానికి రేవు పడవను ఇవతలకు తెచ్చి పెట్టారు. రాజు యొర్దాను దాటిన తర్వాత గెరా కుమారుడైన షిమీ అతనికి సాష్టాంగ నమస్కారం చేసి,

  6. అప్పుడు సెరూయా కుమారుడైన అబీషై, “యెహోవా అభిషేకించినవాన్ని శపించిన ఈ షిమీకి మరణశిక్ష విధించాలి?” అన్నాడు.

  7. “నీకు మరణశిక్ష విధించను” అని షిమీతో రాజు ప్రమాణం చేశాడు.

  8. “బాగా గుర్తుంచుకో, నేను మహనయీముకు పారిపోయే రోజు, బహూరీము వాడైన బెన్యామీనీయుడు, గెరా కుమారుడైన షిమీ నన్ను ఘోరంగా శపించాడు. అతడు నన్ను కలుసుకోడానికి యొర్దాను నది దగ్గరకు వచ్చినప్పుడు, నేను యెహోవా పేరిట ‘నేను నిన్ను కత్తితో చంపను’ అని అతనికి ప్రమాణం చేశాను.

  9. తర్వాత రాజు షిమీని పిలిపించి అతనితో, “నీకోసం యెరూషలేములో ఇల్లు కట్టుకుని అక్కడ నివసించు, ఇంకెక్కడికీ వెళ్లకు.

  10. షిమీ రాజుతో, “మీరు చెప్పింది మంచిది, మీ దాసుడననైన నేను నా ప్రభువైన రాజు చెప్పినట్లు చేస్తాను” అన్నాడు. కాబట్టి షిమీ యెరూషలేములో కొంతకాలం నివసించాడు.

  11. అయితే మూడేళ్ళ తర్వాత షిమీ దాసులలో ఇద్దరు పారిపోయి గాతు రాజు, మయకా కుమారుడైన ఆకీషు దగ్గరకు వెళ్లారు. “మీ దాసులు గాతులో ఉన్నారు” అని షిమీకి చెప్పబడింది.

  12. వెంటనే షిమీ తన గాడిదకు జీను కట్టుకుని తన దాసులను వెదకడానికి గాతులో ఉన్న ఆకీషు దగ్గరకు వెళ్లాడు. షిమీ వెళ్లి గాతు నుండి తన దాసులను తీసుకువచ్చాడు.

  13. షిమీ యెరూషలేము నుండి గాతుకు వెళ్లి, తిరిగివచ్చిన సంగతి సొలొమోనుకు తెలిసినప్పుడు,

  14. రాజు షిమీని పిలిపించి అతనితో, “ ‘నీవు ఉన్నచోట నుండి ఎక్కడికి వెళ్లినా నీవు ఖచ్చితంగా చస్తావు’ అని యెహోవా పేరిట ప్రమాణం చేయించి నిన్ను హెచ్చరించలేదా? అప్పుడు నీవు నాతో, ‘మీరు చెప్పింది మంచిది. నేను లోబడతాను’ అని అన్నావు.

  15. రాజు షిమీతో ఇంకా మాట్లాడుతూ, “నీవు నా తండ్రియైన దావీదుకు చేసిన కీడు గురించి నీకు తెలుసు. ఇప్పుడు నీవు చేసిన చెడుకు యెహోవా నీకు తిరిగి చెల్లిస్తారు.