Skip to content

Treason గురించి బైబిల్ వచనాలు

21 వచనాలు · 5 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. తర్వాత అమాశాతో, ‘నీవు నాకు రక్త సంబంధివి కదా! యోవాబు స్థానంలో నిన్ను నా సేనాధిపతిగా నేను చేయకపోతే దేవుడు నన్ను తీవ్రంగా శిక్షిస్తాడు’ అని చెప్పండి” అన్నాడు.

  2. బహూరీముకు చెందిన బెన్యామీనీయుడైన గెరా కుమారుడైన షిమీ త్వరత్వరగా రాజైన దావీదును కలుసుకోడానికి యూదా వారితో పాటు వచ్చాడు.

  3. అతనితో వెయ్యిమంది బెన్యామీనీయులు ఉన్నారు. అంతేకాక సౌలు కుటుంబ సేవకుడైన సీబా, అతని పదిహేను మంది కుమారులు, అతని ఇరవైమంది సేవకులు కూడా వచ్చారు. వారు యొర్దాను ఒడ్డున ఉన్న రాజు దగ్గరకు త్వరగా వెళ్లారు.

  4. రాజు కుటుంబీకులను ఇవతలకు దాటించడానికి, రాజు కోరినట్లు చేయడానికి రేవు పడవను ఇవతలకు తెచ్చి పెట్టారు. రాజు యొర్దాను దాటిన తర్వాత గెరా కుమారుడైన షిమీ అతనికి సాష్టాంగ నమస్కారం చేసి,

  5. “నా రాజా! నేను చేసిన దాని బట్టి నా మీద నేరం మోపవద్దు. నా ప్రభువు రాజువైన నీవు యెరూషలేము విడిచివెళ్తున్నప్పుడు నేను చేసిన తప్పును జ్ఞాపకం చేసుకోవద్దు. దానిని మనస్సులో ఉంచుకోవద్దు.

  6. ఎందుకంటే నేను పాపం చేశానని నీ సేవకుడైన నాకు తెలుసు, కానీ ఈ రోజు నేను యోసేపు గోత్రాల నుండి మొదటివానిగా వచ్చి నా ప్రభువైన రాజును కలుసుకున్నాను” అని చెప్పాడు.

  7. అప్పుడు సెరూయా కుమారుడైన అబీషై, “యెహోవా అభిషేకించినవాన్ని శపించిన ఈ షిమీకి మరణశిక్ష విధించాలి?” అన్నాడు.

  8. అందుకు దావీదు, “సెరూయా కుమారులారా! దీనితో మీకు ఉన్న సంబంధం ఏమిటి? దీనిలో కల్పించుకోడానికి మీకు ఏమి హక్కు? ఇలాంటి సమయంలో మీరు నాకు శత్రువులవుతారా? ఈ రోజు ఇశ్రాయేలులో ఎవరికైనా మరణశిక్ష విధించడం సరియైనదేనా? ఈ రోజే నేను ఇశ్రాయేలుకు రాజును అని మీకు తెలియదా?” అని చెప్పి,

  9. “నీకు మరణశిక్ష విధించను” అని షిమీతో రాజు ప్రమాణం చేశాడు.

  10. ఆ సమాచారం గురించి విచారణ జరిపించినప్పుడు అది నిజమే అని తెలిసింది, ఆ ఇద్దరు అధికారులు స్తంభాలకు ఉరితీయబడ్డారు. ఇదంతా రాజు సమక్షంలో చరిత్ర గ్రంథాల్లో వ్రాయబడింది.

  11. తర్వాత యేసు పిలాతు అధిపతి ఎదుట నిలబడ్డాడు. అప్పుడు అధిపతి, “నీవు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు. అందుకు యేసు, “అని నీవే అన్నావు కదా” అని జవాబిచ్చారు.

  12. ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలమీద పెట్టారు. ఒక కర్ర తన కుడిచేతిలో ఉంచారు. అప్పుడు ఆయన ఎదుట మోకరించి, “యూదుల రాజా, నీకు శుభం!” అని అంటూ ఆయనను ఎగతాళి చేశారు.

  13. వారు ఆయన మీద ఉమ్మివేసి, కర్ర తీసుకుని దానితో ఆయనను తలమీద పదే పదే కొట్టారు.

  14. వారు ఆయన మీద, “ఇతడు మన దేశాన్ని తప్పుత్రోవ పట్టిస్తున్నాడని మేము తెలుసుకున్నాము. ఇతడు కైసరుకు పన్ను కట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాడు నేనే రాజైన క్రీస్తును అని చెప్పుకుంటున్నాడు” అని నేరారోపణ చేయడం మొదలుపెట్టారు.

  15. అందుకు పిలాతు యేసును, “నీవు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు. దానికి యేసు, “అని నీవే అన్నావు” అని జవాబిచ్చారు.

  16. ఆయనపై ఉన్న నేరం యొక్క వ్రాతపూర్వక ఉత్తర్వు ఇలా ఉంది: ఇతడు యూదుల రాజు.

  17. అప్పటినుండి పిలాతు యేసును విడుదల చేయడానికి ప్రయత్నించాడు కాని యూదా నాయకులు, “నీవు ఇతన్ని విడుదల చేస్తే నీవు కైసరుకు స్నేహితుడవు కావు. నేను రాజును అని చెప్పుకునే ప్రతివాడు కైసరుకు విరోధి” అని కేకలు వేశారు.

  18. అది పస్కాను సిద్ధపరచే రోజు, అప్పుడు ఇంచుమించు ఉదయం ఆరు గంటల సమయం అవుతుంది. పిలాతు, “ఇదిగో మీ రాజు” అని యూదులతో చెప్పాడు.

  19. కాని వారు, “అతన్ని తీసుకెళ్లండి! అతన్ని తీసుకెళ్లండి! సిలువ వేయండి!” అని కేకలు వేశారు. “మీ రాజును నేను సిలువ వేయనా?” అని పిలాతు అడిగాడు. అప్పుడు ముఖ్య యాజకులు, “మాకు కైసరు తప్ప వేరే రాజు లేడు” అన్నారు.

  20. పిలాతు సిలువకు వ్రాతపూర్వక ఉత్తర్వును తగిలించాడు. అది ఇలా ఉంది: నజరేతువాడైన యేసు, యూదుల రాజు.

  21. యాసోను వారిని తన ఇంటికి ఆహ్వానించాడు. వీరందరు యేసు అనే మరొక రాజు ఉన్నాడని చెప్పి, కైసరు చట్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు” అని కేకలు వేశారు.