కంటెంట్‌కు వెళ్లండి

Bahurim

6 verses · 2 known names

ఇలా కూడా పిలుస్తారు: Barhumite

31.8200, 35.3800 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Bahurim ను ప్రస్తావించే వచనాలు

  1. ఆమె భర్త ఆమె వెంట ఏడుస్తూ బహూరీము వరకు వచ్చాడు. అయితే అబ్నేరు అతన్ని వెనుకకు వెళ్లిపొమ్మని చెప్పడంతో అతడు వెళ్లిపోయాడు.

  2. రాజైన దావీదు బహూరీముకు వచ్చినప్పుడు, సౌలు కుటుంబ వంశానికి చెందిన ఒక వ్యక్తి అక్కడినుండి బయటకు వచ్చాడు. అతడు గెరా కుమారుడైన షిమీ. అతడు బయటకు వస్తూ దావీదును శపిస్తున్నాడు.

  3. కాని ఒక యువకుడు వారిని చూసి అబ్షాలోముకు చెప్పాడు. కాబట్టి వారిద్దరు వెంటనే బయలుదేరి బహూరీములో ఒక వ్యక్తి ఇంటికి వెళ్లి అతని ఇంటి ప్రాంగణంలో ఉన్న బావి లోపలికి దిగి దాక్కున్నారు.

  4. బహూరీముకు చెందిన బెన్యామీనీయుడైన గెరా కుమారుడైన షిమీ త్వరత్వరగా రాజైన దావీదును కలుసుకోడానికి యూదా వారితో పాటు వచ్చాడు.

  5. అర్బాతీయుడైన అబీ-అల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు,

  6. “బాగా గుర్తుంచుకో, నేను మహనయీముకు పారిపోయే రోజు, బహూరీము వాడైన బెన్యామీనీయుడు, గెరా కుమారుడైన షిమీ నన్ను ఘోరంగా శపించాడు. అతడు నన్ను కలుసుకోడానికి యొర్దాను నది దగ్గరకు వచ్చినప్పుడు, నేను యెహోవా పేరిట ‘నేను నిన్ను కత్తితో చంపను’ అని అతనికి ప్రమాణం చేశాను.