Skip to content

Zeruiah

25 వచనాలు · 7 కుటుంబ సభ్యులు

Zeruiah ను ప్రస్తావించే వచనాలు

  1. అప్పుడు దావీదు, “శిబిరంలోనికి సౌలు దగ్గరకు నాతో పాటు ఎవరు వస్తారు?” అని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కుమారుడైన యోవాబుకు సోదరుడైన అబీషైని అడిగాడు. అందుకు, “నీతో నేను వస్తాను” అని అబీషై అన్నాడు.

  2. సెరూయా కుమారుడైన యోవాబు, దావీదు మనుష్యులతో కలిసి బయలుదేరి వెళ్లి వారిని గిబియోను కొలను దగ్గర కలుసుకున్నారు. ఒక గుంపు కొలనుకు ఈ ప్రక్కన మరో గుంపు కొలనుకు ఆ ప్రక్కన కూర్చున్నారు.

  3. సెరూయా ముగ్గురు కుమారులైన యోవాబు, అబీషై, అశాహేలు అక్కడే ఉన్నారు. అశాహేలు అడవిలేడిలా చాలా వేగంగా పరుగెత్తగలడు.

  4. నేను రాజుగా అభిషేకించబడినా ఈ రోజు నేను బలహీనుడిని అయిపోయాను. ఈ సెరూయా కుమారులు నా కంటే బలవంతులు. ఈ చెడ్డ పని చేసినవాడికి యెహోవాయే తగిన శిక్ష విధించి ప్రతీకారం చేస్తారు” అన్నాడు.

  5. సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధిపతి; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్య దస్తావేజుల మీద అధికారి.

  6. రాజు అబ్షాలోము మీద మనస్సు పెట్టుకున్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించాడు.

  7. అప్పుడు సెరూయా కుమారుడైన అబీషై రాజుతో, “ఈ చచ్చిన కుక్క రాజైన నా ప్రభువును ఎందుకు శపించాలి? నేను వెళ్లి అతని తల నరికివేయనివ్వండి” అన్నాడు.

  8. అందుకు రాజు, “సెరూయా కుమారులారా! ఈ విషయంతో మీకేమి సంబంధం? ‘దావీదును శపించు’ అని ఒకవేళ యెహోవా అతనితో చెప్పినందుకు అతడు శపిస్తున్నాడేమో, అలాంటప్పుడు, ‘నీవు ఎందుకిలా చేస్తున్నావు’ అని ఎవరు అడగగలరు?” అన్నాడు.

  9. అబ్షాలోము యోవాబుకు బదులుగా అమాశాను సైన్యాధిపతిగా నియమించాడు. అమాశా తండ్రి ఇష్మాయేలీయుడైన యెతెరు. అతని తల్లి అబీగయీలు యోవాబు తల్లియైన సెరూయాకు సోదరియైన నాహాషు కుమార్తె.

  10. దావీదు తన సైన్యాన్ని మూడు భాగాలు చేసి ఒక భాగాన్ని యోవాబు ఆధీనంలో, మరొక భాగాన్ని యోవాబు సోదరుడు, సెరూయా కుమారుడైన అబీషై ఆధీనంలో, ఇంకొక భాగాన్ని గిత్తీయుడైన ఇత్తయి ఆధీనంలో ఉంచాడు. రాజు తన సేనలను పంపుతూ వారితో, “నేనే స్వయంగా మీతో వస్తున్నా” అని చెప్పాడు.

  11. అప్పుడు సెరూయా కుమారుడైన అబీషై, “యెహోవా అభిషేకించినవాన్ని శపించిన ఈ షిమీకి మరణశిక్ష విధించాలి?” అన్నాడు.

  12. అందుకు దావీదు, “సెరూయా కుమారులారా! దీనితో మీకు ఉన్న సంబంధం ఏమిటి? దీనిలో కల్పించుకోడానికి మీకు ఏమి హక్కు? ఇలాంటి సమయంలో మీరు నాకు శత్రువులవుతారా? ఈ రోజు ఇశ్రాయేలులో ఎవరికైనా మరణశిక్ష విధించడం సరియైనదేనా? ఈ రోజే నేను ఇశ్రాయేలుకు రాజును అని మీకు తెలియదా?” అని చెప్పి,

  13. అయితే సెరూయా కుమారుడైన అబీషై దావీదును కాపాడి ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాడు. అప్పుడు దావీదు మనుష్యులు, “ఇశ్రాయేలీయుల దీపమైన నీవు ఆరిపోకుండా ఉండేలా నీవు ఇకపై మాతో పాటు యుద్ధానికి రావద్దు” అని దావీదుతో ప్రమాణం చేయించారు.

  14. సెరూయా కుమారుడు, యోవాబు సోదరుడైన అబీషై ఆ ముగ్గురికి నాయకుడు. ఒక యుద్ధంలో అతడు తన ఈటెను ఆడిస్తూ మూడువందల మందిని చంపాడు, కాబట్టి అతడు ఆ ముగ్గురిలా ప్రసిద్ధి పొందాడు.

  15. అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై. ఇతడు సెరూయా కుమారుడైన యోవాబు ఆయుధాలను మోసేవాడు.

  16. అదోనియా సెరూయా కుమారుడైన యోవాబుతో, యాజకుడైన అబ్యాతారుతో చర్చించాడు. వారు అతనికి తమ సహకారం అందించారు.

  17. “సెరూయా కుమారుడు యోవాబు నాకు ఏమి చేశాడో నీకే తెలుసు. ఇశ్రాయేలు సేనాధిపతులైన నేరు కుమారుడైన అబ్నేరుకు, యెతెరు కుమారుడైన అమాశాకు ఏమి చేశాడో నీకు తెలుసు. సమాధానం కాలంలో వారిని యుద్ధ కాలంలో చంపినట్లు చంపి రక్తపాతం చేసి, తన నడికట్టుపై చెప్పులపై రక్తపు మరకలు చేసుకున్నాడు.

  18. అందుకు రాజైన సొలొమోను తన తల్లితో, “అదోనియా కోసం షూనేమీయురాలైన అబీషగును ఎందుకు అడుగుతున్నావు? ఎంతైనా అతడు నాకు అన్న కాబట్టి అతని కోసం యాజకుడైన అబ్యాతారు కోసం సెరూయా కుమారుడైన యోవాబు కోసం రాజ్యాన్ని కూడా అడగవచ్చు కదా” అన్నాడు.

  19. సెరూయా, అబీగయీలు వారి సహోదరీలు. సెరూయా కుమారులు ముగ్గురు: అబీషై, యోవాబు, అశాహేలు.

  20. దావీదు, “ఎవడు మొదట యెబూసీయులపై దాడి చేస్తాడో వాడు ప్రముఖ సైన్యాధిపతి అవుతాడు” అని అన్నప్పుడు సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా దాడి చేసి అధిపతి అయ్యాడు.

  21. అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై, ఇతడు సెరూయా కుమారుడైన యోవాబు ఆయుధాలను మోసేవాడు,

  22. సెరూయా కుమారుడైన అబీషై ఉప్పు లోయలో 18,000 మంది ఎదోమీయులను చంపాడు.

  23. సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధిపతి; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్య దస్తావేజుల మీద అధికారి;

  24. దీర్ఘదర్శి సమూయేలు, కీషు కుమారుడైన సౌలు, నేరు కుమారుడైన అబ్నేరు, సెరూయా కుమారుడైన యోవాబు ప్రతిష్ఠించినవన్నీ, ఇతర ప్రతిష్ఠితమైన వస్తువులన్నీ షెలోమీతు అతని బంధువుల సంరక్షణలో ఉన్నాయి.)

  25. సెరూయా కుమారుడైన యోవాబు జనాభా లెక్కలు వ్రాయడానికి ఆరంభించాడు కాని దానిని ముగించలేదు. జనాభా లెక్కలు వ్రాయడం వలన ఇశ్రాయేలు మీదికి దేవుని ఉగ్రత వచ్చింది కాబట్టి ఆ జనసంఖ్య రాజైన దావీదు చరిత్ర గ్రంథంలో నమోదు కాలేదు.