- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Or Giants, the Rephaim గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
పద్నాలుగవ సంవత్సరంలో కదొర్లాయోమెరు, అతనితో పొత్తు పెట్టుకున్న రాజులు కలిసి అష్తారోతు కర్నాయింలో రెఫాయీయులను, హాములో జూజీయులను, షావే కిర్యతాయిములో ఎమీయులను
అంటే, అష్తారోతు ఎద్రెయీలో పాలించిన బాషానులోని ఓగు రాజ్యం మొత్తము. (అతడు రెఫాయీయులలో చివరివాడు.) మోషే వారిని ఓడించి వారి భూమిని స్వాధీనం చేసుకున్నాడు.
ఆ తర్వాత అది యెబూసీయుల పట్టణం (అంటే, యెరూషలేము) దక్షిణ వాలు వెంబడి బెన్ హిన్నోము లోయవరకు వెళ్లింది. అక్కడినుండి అది రెఫాయీము లోయకు ఉత్తరాన ఉన్న హిన్నోము లోయకు పశ్చిమాన ఉన్న కొండపై వరకు వ్యాపించింది.
యెహోషువ, “ఒకవేళ మీరు చాలామంది ఉండి ఎఫ్రాయిం కొండ ప్రాంతం మీకు ఇరుకుగా అనిపిస్తే అడవిలోకి వెళ్లి, పెరిజ్జీయులు రెఫాయీయుల దేశంలో మీ కోసం భూమిని ఖాళీ చేసుకోండి” అని వారికి చెప్పాడు.
గాతుకు చెందిన గొల్యాతు అనే శూరుడు ఫిలిష్తీయుల శిబిరం నుండి బయలుదేరాడు. అతని ఎత్తు ఆరు మూరల ఒక జేన.
దావీదు తన సంచిలో నుండి ఒక రాయి తీసి వడిసెలలో పెట్టి విసిరి ఆ ఫిలిష్తీయుని నుదిటి మీద కొట్టాడు. ఆ రాయి అతని నుదిటి లోపలికి చొచ్చుకొని పోగా గొల్యాతు నేలపై బోర్లాపడ్డాడు.
అలా దావీదు ఆ ఫిలిష్తీయుని కేవలం ఒక వడిసెల ఒక రాయితో జయించాడు; తన చేతిలో కత్తి లేకుండానే ఆ ఫిలిష్తీయుని పడగొట్టాడు.
ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీము లోయను విస్తరించారు.
కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లే దావీదు చేశాడు, అతడు గిబియోను నుండి గెజెరు వరకు ఫిలిష్తీయులను తరుముతూ వారిని హతం చేశాడు.
తర్వాత మరోసారి ఫిలిష్తీయులకు ఇశ్రాయేలీయులకు యుద్ధం జరిగింది. దావీదు తన సైనికులతో కలిసి వెళ్లి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి అలసిపోయాడు.
అక్కడ రాఫా సంతతివాడైన ఇష్బి-బెనోబు అనేవాడు క్రొత్త ఖడ్గం, మూడువందల షెకెళ్ళ బరువు ఉన్న ఇత్తడి ఈటె పట్టుకుని, “దావీదును చంపుతాను” అని అన్నాడు.
అయితే సెరూయా కుమారుడైన అబీషై దావీదును కాపాడి ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాడు. అప్పుడు దావీదు మనుష్యులు, “ఇశ్రాయేలీయుల దీపమైన నీవు ఆరిపోకుండా ఉండేలా నీవు ఇకపై మాతో పాటు యుద్ధానికి రావద్దు” అని దావీదుతో ప్రమాణం చేయించారు.
కొంతకాలం తర్వాత గోబు దగ్గర ఫిలిష్తీయులతో మరోసారి యుద్ధం జరిగింది. ఆ సమయంలో హుషాతీయుడైన సిబ్బెకై రాఫా వారసులలో ఒకడైన సఫును చంపాడు.
గోబు దగ్గర ఫిలిష్తీయులతో జరిగిన మరో యుద్ధంలో బేత్లెహేమీయుడైన యాయీరు కుమారుడు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సోదరున్ని చంపాడు. అతని ఈటె నేతపనివాని అడ్డకర్రంత పెద్దది.
గాతు దగ్గర జరిగిన మరో యుద్ధంలో చాలా పొడవైన వాడొకడు ఉన్నాడు. అతని రెండు చేతులకు కాళ్లకు ఆరు వ్రేళ్ళ చొప్పున మొత్తం ఇరవైనాలుగు వ్రేళ్ళు ఉన్నాయి. అతడు కూడా రాఫా సంతతివాడు.
అతడు ఇశ్రాయేలీయులను దూషించినప్పుడు, దావీదు సోదరుడు, షిమ్యా కుమారుడైన యోనాతాను అతన్ని చంపాడు.
ఈ నలుగురు గాతుకు చెందిన రాఫా సంతతివారు, వీరు దావీదు అతని సైనికుల చేతిలో చనిపోయారు.
అది కోత కోసేవారు ధాన్యం కోసినప్పుడు వారి చేతుల్లో వెన్నులు కోసినట్లుగా ఉంటుంది. రెఫాయీము లోయలో ఒకడు పరిగె ఏరుకున్నట్లుగా ఉంటుంది.