- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 970–930 BC
Solomon & The Temple
Solomon builds the great Temple in Jerusalem and rules with unprecedented wisdom and wealth before foreign gods divide his heart.
ఈ కాలపు వచనాలు
- 2 దినవృత్తాంతములు 1:1సుమారు క్రీ.పూ. 1015
దావీదు కుమారుడు సొలొమోను తన రాజ్యంలో రాజుగా స్థిరపడ్డాడు, అతని దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉండి అతన్ని గొప్పగా హెచ్చించాడు.
- 2 దినవృత్తాంతములు 1:2సుమారు క్రీ.పూ. 1015
అప్పుడు సొలొమోను ఇశ్రాయేలీయులందరితో అంటే సహస్రాధిపతులతో, శతాధిపతులతో, న్యాయాధిపతులతో, ఇశ్రాయేలులోని నాయకులందరితో, కుటుంబాల పెద్దలతో మాట్లాడాడు.
- 2 దినవృత్తాంతములు 1:3సుమారు క్రీ.పూ. 1015
సొలొమోను సమాజమంతా గిబియోనులోని ఉన్నత స్థలానికి వెళ్లారు, ఎందుకంటే యెహోవా సేవకుడైన మోషే అరణ్యంలో ఏర్పాటుచేసిన దేవుని యొక్క సమావేశ గుడారం అక్కడ ఉంది.
- 2 దినవృత్తాంతములు 1:4సుమారు క్రీ.పూ. 1015
దావీదు దేవుని మందసాన్ని కిర్యత్-యారీము నుండి దాని కోసం సిద్ధపరచిన స్థలానికి తీసుకువచ్చాడు, ఎందుకంటే అతడు యెరూషలేములో దాని కోసం ఒక గుడారాన్ని వేశాడు.
- 2 దినవృత్తాంతములు 1:5సుమారు క్రీ.పూ. 1015
అయితే హూరు మనుమడు ఊరి కుమారుడైన బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠం గిబియోనులో యెహోవా సమావేశ గుడారం ముందు ఉంది; కాబట్టి సొలొమోను సమాజం అక్కడ అతని గురించి విచారణ చేశారు.
- 2 దినవృత్తాంతములు 1:6సుమారు క్రీ.పూ. 1015
సొలొమోను సమావేశ గుడారంలో ఉన్న యెహోవా సన్నిధి ఎదుట ఉన్న బలిపీఠం దగ్గరకు వెళ్లి దానిమీద వెయ్యి దహనబలులు అర్పించాడు.
- 2 దినవృత్తాంతములు 1:7సుమారు క్రీ.పూ. 1015
ఆ రాత్రివేళ దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, “నేను నీకు ఏమివ్వాలో అడుగు” అన్నారు.
- 2 దినవృత్తాంతములు 1:8సుమారు క్రీ.పూ. 1015
అందుకు సొలొమోను దేవునితో, “మీరు నా తండ్రియైన దావీదు మీద ఎంతో దయను చూపించారు, అంతేకాక ఆయన స్థానంలో నన్ను రాజుగా చేశారు.
- 2 దినవృత్తాంతములు 1:9సుమారు క్రీ.పూ. 1015
యెహోవా దేవా, నా తండ్రియైన దావీదుకు మీరు చేసిన వాగ్దానాన్ని స్థిరపరచండి. భూమిమీది ధూళియంత విస్తారమైన ప్రజలకు నన్ను రాజుగా చేశారు.
- 2 దినవృత్తాంతములు 1:10సుమారు క్రీ.పూ. 1015
నేను ఈ ప్రజలను నడిపించడానికి నాకు జ్ఞానాన్ని, వివేచనను ఇవ్వండి. లేకపోతే మీ గొప్ప ప్రజలైన వీరిని ఎవరు పరిపాలించగలరు?”
- 2 దినవృత్తాంతములు 1:11సుమారు క్రీ.పూ. 1015
దేవుడు సొలొమోనుతో, “ఇది నీ హృదయ కోరిక, నీవు సంపదలు, ఆస్తులు గాని గౌరవాన్ని గాని నీ శత్రువుల మరణాన్ని గాని నీవు కోరలేదు, నీవు సుదీర్ఘ జీవితాన్ని కోరలేదు, కానీ ఏ ప్రజల మీద నిన్ను రాజుగా చేశానో, ఆ నా ప్రజలను పరిపాలించడానికి కావలసిన జ్ఞానం కోరావు,
- 2 దినవృత్తాంతములు 1:12సుమారు క్రీ.పూ. 1015
కాబట్టి నీకు జ్ఞాన వివేకాలు ఇస్తాను. అంతే కాకుండా నీకు ముందున్న ఏ రాజుకు నీ తర్వాత వచ్చే రాజులకు ఉండనంత సంపదలు, ఆస్తులు, గౌరవాన్ని నేను నీకు ఇస్తాను” అని చెప్పారు.
- 2 దినవృత్తాంతములు 1:13సుమారు క్రీ.పూ. 1015
తర్వాత సొలొమోను గిబియోనులో ఉన్న సమావేశ గుడారం ముందున్న బలిపీఠం దగ్గర నుండి యెరూషలేముకు వెళ్లి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాడు.
- 2 దినవృత్తాంతములు 1:14సుమారు క్రీ.పూ. 1015
సొలొమోను రథాలను, గుర్రాలను సమకూర్చుకున్నాడు. అతనికి 1,400 రథాలు, 12,000 గుర్రాలు ఉన్నాయి, వీటిని రథాల పట్టణాల్లో యెరూషలేములో తన దగ్గర ఉంచాడు.
- 2 దినవృత్తాంతములు 1:15సుమారు క్రీ.పూ. 1015
రాజు యెరూషలేములో వెండి బంగారాలను రాళ్లంత విస్తారంగా చేశాడు, దేవదారు మ్రానులను కొండ దిగువ ప్రదేశంలోని మేడిచెట్లలా అతి విస్తారంగా ఉంచాడు.
- 2 దినవృత్తాంతములు 1:16సుమారు క్రీ.పూ. 1015
సొలొమోను గుర్రాలను ఈజిప్టు నుండి, క్యూ నుండి దిగుమతి చేసుకున్నారు. రాజ వర్తకులు తగిన ధర చెల్లించి వాటిని క్యూ దగ్గర కొనుగోలు చేశారు.
- 2 దినవృత్తాంతములు 1:17సుమారు క్రీ.పూ. 1015
వారు ఈజిప్టు నుండి ఒక్కో రథానికి ఆరువందల షెకెళ్ళ వెండిని ఒక్కో గుర్రానికి నూట యాభై షెకెళ్ళ వెండిని ఇచ్చి దిగుమతి చేశారు. హిత్తీయుల రాజులందరికి సిరియా రాజులకు వాటిని ఎగుమతి కూడ చేశారు.
- 2 దినవృత్తాంతములు 2:1సుమారు క్రీ.పూ. 1015
సొలొమోను యెహోవా పేరిట ఒక మందిరం, తమ కోసం ఒక రాజభవనం కట్టాలని ఆజ్ఞాపించాడు.
- 2 దినవృత్తాంతములు 2:2సుమారు క్రీ.పూ. 1015
సొలొమోను 70,000 మందిని బరువులు మోయడానికి, 80,000 మందిని కొండల్లో రాళ్లు త్రవ్వడానికి ఏర్పాటు చేశాడు. ఆ పని తనిఖీ చేయడానికి వారిమీద 3,600 మంది అధికారులను కూడా నియమించాడు.
- 2 దినవృత్తాంతములు 2:3సుమారు క్రీ.పూ. 1015
తూరు రాజైన హీరాముకు సొలొమోను ఇలా కబురు పంపాడు. “నా తండ్రియైన దావీదుకు నివాసంగా ఒక భవనం కట్టడానికి మీరు దేవదారు మ్రానులను పంపినట్లే నాకు కూడ పంపించండి.
- 2 దినవృత్తాంతములు 2:4సుమారు క్రీ.పూ. 1015
ఎందుకంటే, నా దేవుడైన యెహోవా పేరిట మందిరం కట్టిస్తాను. ఆయన సన్నిధిలో పరిమళ ధూపం వేయడం కోసం, ఎల్లప్పుడూ సన్నిధి రొట్టెలు పెట్టడంకోసం, ప్రతి ఉదయం సాయంకాలం, సబ్బాతు దినాల్లో, అమావాస్యల్లో, మా దేవుడైన యెహోవాకు నియమించబడిన పండుగ సమయాల్లో దహనబలులు అర్పించడం కోసం మందిరాన్ని ఆయనకు ప్రతిష్ఠ చేస్తాను. ఇవన్నీ ఇశ్రాయేలుకు నిత్య కట్టుబాట్లుగా ఉంటాయి.
- 2 దినవృత్తాంతములు 2:5సుమారు క్రీ.పూ. 1015
“మా దేవుడు ఇతర దేవుళ్ళందరికంటే గొప్పవాడు. కాబట్టి నేను కట్టించే మందిరం గొప్పగా ఉంటుంది.
- 2 దినవృత్తాంతములు 2:6సుమారు క్రీ.పూ. 1015
అయితే ఆకాశ మహాకాశాలు కూడా ఆయనకు సరిపోవు. ఆయనకు మందిరం ఎవరు నిర్మించగలరు? ఆయనకు మందిరం కట్టించడానికి నా సామర్థ్యం ఏపాటిది? ఆయన సన్నిధానంలో ధూపం వేయడం కోసం ఒక స్థలాన్ని నిర్మిస్తాను.
- 2 దినవృత్తాంతములు 2:7సుమారు క్రీ.పూ. 1015
“యెరూషలేములోను యూదాదేశంలోను నా దగ్గర నేర్పరులైన పనివారున్నారు. వారిని నా తండ్రి దావీదు నియమించాడు. వారితో కలిసి, బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, ఎరుపు ఊదా నూలుతోను, నీలి నూలుతోను చేసేపని, అన్ని రకాల చెక్కడం పనులు నిర్వహించడానికి నేర్పుగల ఒక మనిషిని పంపండి.
- 2 దినవృత్తాంతములు 2:8సుమారు క్రీ.పూ. 1015
“లెబానోను అడవుల్లో మ్రానులు నరకడంలో మీ పనివారు నేర్పరులని నాకు తెలుసు. కాబట్టి లెబానోను నుండి నాకు సరళ వృక్షం దూలాలు, దేవదారు దూలాలు, చందనం దూలాలు పంపించండి. నా పనివారు మీ పనివారితో కలిసి పని చేస్తారు.