Persecution గురించి బైబిల్ వచనాలు: Mistaken zeal
Mistaken zeal గురించి వచనాలు
కానీ యూదా నాయకులు దైవభయం కలిగిన స్త్రీలను ఆ పట్టణ ప్రముఖులను ప్రేరేపించి, పౌలు బర్నబాలకు వ్యతిరేకంగా హింస కలుగచేసి వారిని తమ ప్రాంతం నుండి తరిమివేశారు.
“నజరేయుడైన యేసు నామాన్ని వ్యతిరేకించడానికి సాధ్యమైనవన్నీ చేయాలని నేను కూడా అనుకున్నాను.
యెరూషలేములో అలాగే చేశాను. ముఖ్య యాజకుని దగ్గర నుండి అధికారం పొందుకొని పరిశుద్ధులలో అనేకమందిని చెరసాలలో వేయించి, వారిని చంపినప్పుడు దానికి అంగీకారం తెలిపాను.
అనేకసార్లు వారిని శిక్షించడానికి ఒక సమాజమందిరం నుండి మరొక సమాజమందిరానికి వెళ్తూ, వారిని శిక్షిస్తూ దైవదూషణ చేసేలా వారిని బలవంతం చేశాను. వారిని ఇంకా హింసించాలని తీవ్రమైన కోపంతో ఇతర పట్టణాల్లో కూడా వారిని వెంటాడాను.