కంటెంట్‌కు వెళ్లండి

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. విలాపవాక్యములు 3:7సుమారు క్రీ.పూ. 588

    నేను తప్పించుకోకుండా ఆయన నా చుట్టూ గోడ కట్టించారు; బరువైన గొలుసులతో ఆయన నన్ను బంధించారు.

  2. విలాపవాక్యములు 3:8సుమారు క్రీ.పూ. 588

    నేను సహాయం కోసం పిలిచినా, మొరపెట్టినా ఆయన నా ప్రార్థనకు తన చెవులు మూసుకుంటారు.

  3. విలాపవాక్యములు 3:9సుమారు క్రీ.పూ. 588

    ఆయన రాళ్లను నా దారికి అడ్డుపెట్టారు; ఆయన నా మార్గాలను వంకర చేశారు.

  4. విలాపవాక్యములు 3:10సుమారు క్రీ.పూ. 588

    పొంచి ఉన్న ఎలుగుబంటిలా, దాక్కున్న సింహంలా,

  5. విలాపవాక్యములు 3:11సుమారు క్రీ.పూ. 588

    ఆయన నన్ను దారిలో నుండి ఈడ్చుకెళ్లి, నన్ను ముక్కలు చేసి, నిస్సహాయ స్థితిలో వదిలేశారు.

  6. విలాపవాక్యములు 3:12సుమారు క్రీ.పూ. 588

    ఆయన తన విల్లు తీసి, తన బాణాలకు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు.

  7. విలాపవాక్యములు 3:13సుమారు క్రీ.పూ. 588

    ఆయన తన అంబుల పొదిలోని బాణాలతో, నా గుండెను గుచ్చారు.

  8. విలాపవాక్యములు 3:14సుమారు క్రీ.పూ. 588

    నేను నా ప్రజలందరికి నవ్వులాటగా మారాను; రోజంతా వారు పాటలో నన్ను హేళన చేస్తున్నారు.

  9. విలాపవాక్యములు 3:15సుమారు క్రీ.పూ. 588

    ఆయన నాతో చేదు మూలికలు తినిపించారు, త్రాగడానికి చేదు పానీయాన్ని ఇచ్చారు.

  10. విలాపవాక్యములు 3:16సుమారు క్రీ.పూ. 588

    ఆయన రాళ్లతో నా పళ్లను విరగ్గొట్టారు; నన్ను దుమ్ములో త్రొక్కారు.

  11. విలాపవాక్యములు 3:17సుమారు క్రీ.పూ. 588

    సమాధానం నాకు దూరమైంది, అభివృద్ధి అంటే ఏంటో మరచిపోయాను.

  12. విలాపవాక్యములు 3:18సుమారు క్రీ.పూ. 588

    కాబట్టి, “నా వైభవం పోయింది, యెహోవా నుండి నేను ఆశించినవన్నీ పోయాయి” అని నేనన్నాను.

  13. విలాపవాక్యములు 3:19సుమారు క్రీ.పూ. 588

    నా శ్రమ, నా నిరాశ్రయ స్థితి, నేను త్రాగిన చేదు పానీయం జ్ఞాపకం చేసుకోండి.

  14. విలాపవాక్యములు 3:20సుమారు క్రీ.పూ. 588

    నేను వాటిని బాగా జ్ఞాపకముంచుకున్నాను, నా ప్రాణం నాలో కృంగి ఉంది.

  15. విలాపవాక్యములు 3:21సుమారు క్రీ.పూ. 588

    అయినప్పటికీ నేను ఇది జ్ఞాపకం చేసుకుంటాను, కాబట్టి నాకు నిరీక్షణ ఉంది:

  16. విలాపవాక్యములు 3:22సుమారు క్రీ.పూ. 588

    యెహోవా మహా ప్రేమను బట్టి మనం నాశనం కాలేదు, ఎందుకంటే ఆయన కనికరం ఎన్నటికీ తగ్గదు.

  17. విలాపవాక్యములు 3:23సుమారు క్రీ.పూ. 588

    ప్రతి ఉదయం అవి క్రొత్తవిగా ఉంటాయి; మీ నమ్మకత్వం గొప్పది.

  18. విలాపవాక్యములు 3:24సుమారు క్రీ.పూ. 588

    నాలో నేను, “యెహోవా నా స్వాస్థ్యం; కాబట్టి నేను ఆయన కోసం వేచి ఉంటాను” అని అనుకుంటున్నాను.

  19. విలాపవాక్యములు 3:25సుమారు క్రీ.పూ. 588

    తన మీద నిరీక్షణ కలిగి ఉన్నవారికి, తనను వెదికేవారికి యెహోవా మేలు చేస్తారు;

  20. విలాపవాక్యములు 3:26సుమారు క్రీ.పూ. 588

    యెహోవా రక్షణ కోసం ఓపికతో వేచి ఉండడం మంచిది.

  21. విలాపవాక్యములు 3:27సుమారు క్రీ.పూ. 588

    ఒక మనిషి యవ్వన దశలో ఉన్నప్పుడే, కాడి మోయడం అతనికి మేలు.

  22. విలాపవాక్యములు 3:28సుమారు క్రీ.పూ. 588

    యెహోవాయే దాన్ని అతని మీద ఉంచారు, కాబట్టి అతడు ఒంటరిగా మౌనంగా కూర్చోవాలి.

  23. విలాపవాక్యములు 3:29సుమారు క్రీ.పూ. 588

    అతడు తన ముఖం ధూళిలో పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇంకా నిరీక్షణ ఉండవచ్చు.

  24. విలాపవాక్యములు 3:30సుమారు క్రీ.పూ. 588

    తనను కొట్టేవానికి తన చెంపను చూపించి, నిండా అవమానం పాలుకానివ్వు.

  25. విలాపవాక్యములు 3:31సుమారు క్రీ.పూ. 588

    ఎవ్వరూ ప్రభువుచేత శాశ్వతంగా త్రోసివేయబడరు.