Skip to content

Pharaoh

12 వచనాలు

ఇలా కూడా పిలుస్తారు: Pharaoh-hophra

Pharaoh ను ప్రస్తావించే వచనాలు

  1. యెహోవా ఇలా చెప్తున్నారు: ‘నేను ఎలాగైతే యూదా రాజైన సిద్కియాను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగించానో, అలాగే ఈజిప్టు రాజైన ఫరో హోఫ్రాను అతన్ని చంపాలనుకుంటున్న అతని శత్రువుల చేతులకు అప్పగించబోతున్నాను.’ ”

  2. యుద్ధం జరిగేటప్పుడు అనేకుల జీవితాలను నాశనం చేయాలని బబులోనీయులు ముట్టడి దిబ్బలు వేసి కోటలు కట్టినప్పుడు ఫరో తనకున్న మహా బలమైన గొప్ప సైన్యంతో వచ్చినా ఆ రాజుకు ఏమాత్రం సహాయం చేయలేడు.

  3. “మనుష్యకుమారుడా, నీ ముఖాన్ని ఈజిప్టు రాజైన ఫరోవైపు త్రిప్పి అతని గురించి ఈజిప్టు దేశమంతటి గురించి ప్రవచించి ఇలా చెప్పు:

  4. ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘ఈజిప్టు రాజైన ఫరో, నైలు నదిలో పడుకుని ఉన్న ఘటసర్పమా, నేను నీకు విరోధిని. “నైలు నది నాదే, నేనే దాన్ని చేశానని నీవు అంటావు.”

  5. “మనుష్యకుమారుడా, నేను ఈజిప్టు రాజైన ఫరో చేతిని విరగ కొట్టాను. అది బాగవ్వడానికి ఎవరూ దానికి కట్టు కట్టరు, అది కత్తి పట్టుకోడానికి కావలసినంత బలంగా మారడానికి బద్దపెట్టి కట్టరు.

  6. కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నేను ఈజిప్టు రాజైన ఫరోకు విరోధిని అయ్యాను. బాగా ఉన్న చేతిని విరిగిపోయిన చేతిని రెండింటిని నేను విరగ్గొట్టి అతని చేతిలో నుండి కత్తి పడిపోయేలా చేస్తాను.

  7. నేను బబులోను రాజు చేతులను బలపరుస్తాను, కాని ఫరో చేతులు చచ్చుబడిపోతాయి. ఈజిప్టు దేశం మీద ఆడించడానికి నేను నా ఖడ్గాన్ని బబులోను రాజు చేతికి ఇచ్చినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.

  8. “మనుష్యకుమారుడా, నీవు ఈజిప్టు రాజైన ఫరోతో అతని పరివారంతో ఇలా చెప్పు: “ ‘ఘనతలో నీకు సాటి ఎవరు?

  9. “ ‘వైభవంలో ఘనతలో ఏదెను తోటలో ఉన్న ఏ చెట్లు నీతో పోల్చబడగలవు? అయినప్పటికీ, నీవు కూడా ఏదెను చెట్లతో పాటు భూమి దిగువకు రప్పించబడతావు; సున్నతిలేనివారి మధ్య, ఖడ్గం వలన చచ్చినవారితో నీవు కూడ పడి ఉంటావు. “ ‘ఫరోకు, అతని పరివారానికి ఇలా జరుగుతుంది, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”

  10. “మనుష్యకుమారుడా, ఈజిప్టు రాజైన ఫరోను గురించి విలాప గీతం పాడి అతనితో ఇలా చెప్పు: “ ‘దేశాల మధ్య సింహంవంటివాడవు; నీవు నీ ప్రవాహంలో కొట్టుకుపోతూ, నీ పాదాలతో నీటిని చిమ్ముతూ, ప్రవాహాలను బురదమయం చేస్తూ, సముద్రాల్లో ఉండే భీకరమైన సముద్ర జీవిలాంటి వాడవు.

  11. “ఖడ్గంతో చంపబడిన ఫరో అతని సైన్యమంతా వారిని చూసి తమ అల్లరిమూకలన్నిటిని బట్టి ఓదార్పు పొందుతారు అని ప్రభువైన యెహోవా ప్రకటించారు.

  12. సజీవుల దేశంలో భయాన్ని వ్యాపింపజేసేలా చేశాను కాబట్టి ఫరో అతనితో పాటు అతని సైన్యం సున్నతిలేని వారితోనూ ఖడ్గం చేత హతులైనవారితోనూ పడి ఉంటారు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”