Visions గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
ఈ సంఘటనల తర్వాత దర్శనంలో యెహోవా వాక్కు అబ్రాము వద్దకు వచ్చి: “అబ్రామూ, భయపడకు, నేను నీకు డాలును, నీ గొప్ప బహుమానాన్ని.”
రాత్రి దర్శనం ద్వారా ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడారు. ఆయన, “యాకోబూ! యాకోబూ!” అని పిలిచారు. అతడు, “చిత్తం, నేను ఉన్నాను” అని జవాబిచ్చాడు.
అక్కడ ఒక పొదలో మండుతున్న అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆ పొద అగ్నితో మండుతూ ఉన్నప్పటికీ అది కాలిపోకపోవడం మోషే చూశాడు.
అప్పుడు మోషే, “నేను అక్కడికి వెళ్లి ఆ పొద ఎందుకు కాలిపోవడం లేదనే ఆ గొప్ప అద్భుతాన్ని చూస్తాను” అని అనుకున్నాడు.
ఆయన, “నా మాటలు వినండి: “ఒకవేళ మీ మధ్య ప్రవక్త ఉంటే, యెహోవానైన నేను దర్శనాలలో వారికి ప్రత్యక్షమవుతాను, కలలలో నేను వారితో మాట్లాడతాను.
దేవుని మాటలు వినే వాని ప్రవచనం, మహోన్నతుని దగ్గర నుండి తెలివి సంపాదించుకున్నవాడు, సర్వశక్తిగల వాడి నుండి దర్శనం చూసేవాడు, సాష్టాంగపడేవాడు, కళ్లు తెరవబడినవాడు:
బాలుడైన సమూయేలు ఏలీ సమక్షంలో యెహోవాకు పరిచర్య చేశాడు. ఆ రోజుల్లో యెహోవా వాక్కు అరుదుగా వచ్చేది; దర్శనాలు ఎక్కువగా ఉండేవి కావు.
ఒక రాత్రి, కళ్ళు మసకబారి స్పష్టంగా చూడలేకపోతున్న ఏలీ, తాను ఎప్పుడు పడుకునే స్థలంలో పడుకుని ఉన్నాడు.
అదే సమయంలో యెహోవా దీపం ఆరిపోక ముందు, యెహోవా మందిరంలో దేవుని మందసం ఉన్నచోట సమూయేలు పడుకుని ఉన్నాడు.
అప్పుడు యెహోవా సమూయేలును పిలిచారు. అందుకు సమూయేలు, “నేను ఇక్కడే ఉన్నాను” అంటూ,
అతడు ఏలీ దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లి, “మీరు నన్ను పిలిచారా? నేను ఇక్కడే ఉన్నాను” అని అన్నాడు. అందుకు ఏలీ, “నేను పిలువలేదు; వెళ్లి పడుకో” అని చెప్పగానే అతడు వెళ్లి పడుకున్నాడు.
మళ్ళీ యెహోవా, “సమూయేలూ!” అని పిలిచారు. అప్పుడు సమూయేలు లేచి ఏలీ దగ్గరకు వెళ్లి, “నేను ఇక్కడే ఉన్నాను; మీరు నన్ను పిలిచారా?” అని అడిగాడు. అయితే ఏలీ, “నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు; వెళ్లి పడుకో” అన్నాడు.
అప్పటికి సమూయేలుకు ఇంకా యెహోవా తెలియదు; యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు.
యెహోవా మూడవసారి, “సమూయేలూ!” అని పిలిచినప్పుడు, అతడు లేచి ఏలీ దగ్గరకు వెళ్లి, “నేను ఇక్కడే ఉన్నాను; మీరు నన్ను పిలిచారా?” అని అడిగాడు. యెహోవాయే ఆ బాలుని పిలిచారని ఏలీ గ్రహించాడు.
కాబట్టి ఏలీ సమూయేలుతో, “నీవు వెళ్లి పడుకో, ఎవరైనా మళ్ళీ పిలిస్తే, ‘యెహోవా, చెప్పండి, మీ సేవకుడనైన నేను వింటున్నాను’ అని చెప్పు” అన్నాడు. కాబట్టి సమూయేలు వెళ్లి తన స్థలంలో పడుకున్నాడు.
తర్వాత యెహోవా వచ్చి అక్కడ నిలబడి, “సమూయేలూ! సమూయేలూ!” అని మళ్ళీ పిలిచారు. వెంటనే సమూయేలు, “చెప్పండి, మీ సేవకుడనైన నేను వింటున్నాను” అన్నాడు.
అప్పుడు యెహోవా సమూయేలుతో ఇలా చెప్పారు: “ఇశ్రాయేలీయులలో నేను ఒక పని చేయబోతున్నాను; దాని గురించి విన్నవారి చెవులు గింగురుమంటాయి.
ఆ రోజున ఏలీ ఇంటివారికి వ్యతిరేకంగా నేను మాట్లాడినదంతా మొదటి నుండి చివరి వరకు వారి మీదికి రప్పిస్తాను.
ఎందుకంటే అతనికి తెలిసిన పాపం కారణంగా నేను అతని కుటుంబానికి ఎప్పటికీ తీర్పు తీరుస్తానని అతనితో చెప్పాను; అతని కుమారులు దేవున్ని దూషించారు, అతడు వారిని అరికట్టలేక పోయాడు.
కాబట్టి, ‘ఏలీ ఇంటివారి దోషానికి బలుల వలన గాని, అర్పణల వలన గాని ఎప్పటికీ ప్రాయశ్చిత్తం జరుగదు’ అని ఏలీ ఇంటివారికి నేను ప్రమాణం చేశాను.”
తర్వాత సమూయేలు ఉదయమయ్యే వరకు పడుకుని లేచి, యెహోవా మందిర తలుపులను తెరిచాడు. అయితే తనకు వచ్చిన దర్శనం గురించి ఏలీతో చెప్పడానికి భయపడ్డాడు.
అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతాను దగ్గరకు ఇలా వచ్చింది:
నాతాను ఈ దర్శనంలోని మాటలన్నిటిని దావీదుకు చెప్పాడు.
రెహబాము రాజ్యం స్థిరపడి బలపడిన తర్వాత అతడు, ఇశ్రాయేలీయులంతా యెహోవా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు.
వారు యెహోవా పట్ల నమ్మకద్రోహులుగా ఉన్నారు కాబట్టి, రాజైన రెహబాము పాలనలోని అయిదవ సంవత్సరం ఈజిప్టు రాజైన షీషకు యెరూషలేము మీద దాడి చేశాడు.