Skip to content

Visions గురించి బైబిల్ వచనాలు: To Amos

16 వచనాలు · 32 కోణాలు

To Amos గురించి వచనాలు

  1. ప్రభువైన యెహోవా నాకు చూపించింది ఇది: రాజుకు రావలసిన పంట వచ్చిన తర్వాత గడ్డి మళ్ళీ మొలిచినప్పుడు, యెహోవా మిడత గుంపులను సిద్ధపరిచారు.

  2. అవి మొత్తం పంటను తినివేసినప్పుడు, “ప్రభువైన యెహోవా, క్షమించండి! యాకోబు వంశం చిన్నది అది ఎలా మనుగడ సాగించగలదు?” అని నేను మొరపెట్టాను.

  3. కాబట్టి యెహోవా జాలిపడ్డారు. “ఇది జరగదు” అని యెహోవా అన్నారు.

  4. ప్రభువైన యెహోవా నాకు చూపించింది ఇది: ప్రభువైన యెహోవా అగ్ని ద్వారా తీర్పును ప్రకటిస్తున్నారు; అది మహా అగాధాన్ని ఎండగొట్టి, నేలను మ్రింగివేసింది.

  5. అప్పుడు నేను, “ప్రభువైన యెహోవా, దయచేసి ఆపండి! యాకోబు వంశం చిన్నది అది ఎలా మనుగడ సాగించగలదు?” అని మొరపెట్టాను.

  6. కాబట్టి యెహోవా జాలిపడ్డారు. “ఇది కూడా జరగదు” అని ప్రభువైన యెహోవా అన్నారు.

  7. ఆయన నాకు చూపించింది ఇదే: ప్రభువు తన చేతిలో కొలనూలు పట్టుకుని, మట్టపు గుండు ప్రకారం కట్టబడిన గోడ దగ్గర నిలబడి ఉన్నారు.

  8. యెహోవా నన్ను, “ఆమోసూ, నీవు ఏమి చూస్తున్నావు?” అని అడిగారు. “కొలనూలు” అని నేను జవాబిచ్చాను. అప్పుడు ప్రభువు అన్నారు, “చూడు, నా ఇశ్రాయేలు ప్రజలమధ్య కొలనూలు వేయబోతున్నాను, ఇకమీదట వారిని శిక్షించకుండ వదలను.

  9. “ఇస్సాకు క్షేత్రాలు నాశనమవుతాయి ఇశ్రాయేలు పరిశుద్ధ స్థలాలు పాడైపోతాయి; యరొబాము ఇంటి మీదికి నా కత్తి ఎత్తుతాను.”

  10. ప్రభువైన యెహోవా నాకు చూపించింది ఇదే: పండిన పండ్ల గంప.

  11. “ఆమోసూ! నీవేం చూస్తున్నావు?” అని ఆయన అడిగారు. “పండిన పండ్ల గంప” అని నేను జవాబిచ్చాను. అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు, “నా ప్రజలైన ఇశ్రాయేలుకు సమయం దగ్గరపడింది; ఇక నేను వారిని శిక్షించకుండా ఉండను.

  12. “ఆ రోజు గుడిలో వారు పాడే పాటలు విలాపంగా మారుతాయి. ఎన్నో శవాలు ఉంటాయి; ఎక్కడ చూసినా అవే! ఊరుకోండి!” అని ప్రభువైన యెహోవా చెప్తున్నారు.

  13. అవసరతలో ఉన్నవారిని అణగద్రొక్కే వారలారా, దేశంలో ఉన్న పేదలను అంతం చేసేవారలారా,

  14. అలా చేస్తూ, “మనం ధాన్యం అమ్ముకోడానికి, అమావాస్య ఎప్పుడు దాటి పోతుందో, గోధుమ వ్యాపారం సాగటానికి విశ్రాంతి దినం ఎప్పుడు గతించి పోతుందో?” అనుకునేవారలారా వినండి. మీరు కొల గంపలు చిన్నగా చేస్తూ, ధర ఎక్కువ చేస్తూ, దొంగ త్రాసుతో మోసగిస్తారు,

  15. బీదలను వెండికి కొంటారు, చెప్పులిచ్చి అవసరతలో ఉన్నవారిని కొంటారు, పాడైపోయి గింజలు కూడా అమ్మివేస్తారు.

  16. బలిపీఠం దగ్గర ప్రభువు నిలబడి ఉండడం నేను చూశాను, ఆయన ఇలా అన్నారు: “గడపలు కదిలి పోయేలా, స్తంభాల పైభాగాలను కొట్టు. వాటిని ప్రజలందరి తలల మీద పడవేయు; మిగిలిన వారిని నేను ఖడ్గంతో హతం చేస్తాను. ఒక్కడు కూడా పారిపోలేడు, ఎవ్వడూ తప్పించుకోలేడు.