Visions గురించి బైబిల్ వచనాలు: To Ezekiel (See chapters 10,40-48 of Ezekiel)
To Ezekiel (See chapters 10,40-48 of Ezekiel) గురించి వచనాలు
నేను చూసినప్పుడు ఉత్తరం నుండి గాలి తుఫాను రావడం కనిపించింది; అది జ్వలించే అగ్నితో ప్రకాశవంతమైన కాంతితో నిండిన గొప్ప మేఘము. ఆ అగ్ని మధ్య భాగం కరిగిన ఇత్తడిలా కనిపించింది.
దానిలో కరిగిన ఇత్తడిలా నాలుగు జీవుల్లాంటి ఒక రూపం కనిపించింది. వాటి రూపం మానవరూపంలా ఉంది.
కాని ప్రతి జీవికి నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు ఉన్నాయి.
వాటి కాళ్లు తిన్నగా ఉండి అరికాళ్లు దూడ కాళ్లలా ఉన్నాయి. అవి ఇత్తడిలా తళతళ మెరుస్తున్నాయి.
వాటి రెక్కల క్రింద నాలుగు వైపులా మనుష్యుల చేతులు ఉన్నాయి. ఆ నాలుగింటికి ముఖాలు, రెక్కలు ఉన్నాయి.
ఒకదాని రెక్కలు మరొకదాని రెక్కలకు తాకుతున్నాయి. అవి అటూ ఇటూ తిరగకుండా అన్నీ తిన్నగా ముందుకు వెళ్తున్నాయి.
ఆ నాలుగింటికి మానవ ముఖంలాంటి ముఖాలు ఉన్నాయి, కుడి వైపున సింహపు ముఖం, ఎడమవైపున ఎద్దు ముఖం ఉన్నాయి. ప్రతి దానికి గ్రద్ద ముఖం ఉంది.
వాటి ముఖాలు అలా ఉన్నాయి. ప్రతి దానికి పైకి చాచి ఉన్న రెండు రెక్కలు వాటి ప్రక్కన ఉన్నవాటి రెక్కలను తాకుతూ ఉన్నాయి. మరో రెండు రెక్కలు వాటి శరీరాలను కప్పాయి.
ప్రతిదీ తిన్నగా ముందు వెళ్తూ ఉంది. అవి అటూ ఇటూ తిరగకుండా ఆత్మ ఏ వైపుకు వెళ్తే అవి ఆ వైపుకే వెళ్తున్నాయి.
ఆ జీవుల రూపం మండుతున్న నిప్పులా దివిటీలా ఉంది. అగ్ని ఆ జీవుల మధ్య ముందుకి వెనుకకు కదులుతూ ఉంది. ఆ అగ్ని చాలా ప్రకాశవంతంగా ఉండి దానిలో నుండి మెరుపులు వస్తున్నాయి.
మెరుపు తీగెల్లా ఆ జీవులు అటూ ఇటూ తిరుగుతున్నాయి.
నేను చూస్తుండగా ఒక మానవ ఆకారం కనిపించింది. అతని నడుము నుండి క్రిందికి నిప్పులా ఉన్నాడు, అక్కడినుండి అతని రూపం మెరుస్తున్న లోహంలా ప్రకాశవంతంగా ఉంది.
ఆయన చేయిలాంటి దానిని చాపి నా జుట్టు పట్టుకున్నారు. ఆత్మ నన్ను భూమికి ఆకాశానికి మధ్యకు ఎత్తి దేవుని దర్శనాలలో ఆయన నన్ను యెరూషలేముకు లోపలి ఆవరణ ఉత్తర ద్వారం దగ్గర ఉన్న రోషం పుట్టించే విగ్రహం దగ్గరకు తీసుకువచ్చాడు.
అప్పుడు సమతల మైదానంలో నేను చూసిన దర్శనంలో కనిపించినట్లే ఇశ్రాయేలీయుల దేవుని మహిమ మళ్ళీ కనిపించింది.
ఆయన నాతో, “మనుష్యకుమారుడా, ఉత్తరదిక్కు చూడు” అని చెప్పినప్పుడు, నేను ఉత్తరదిక్కు చూడగా అక్కడ బలిపీఠపు ఉత్తర ద్వారం దగ్గర రోషం పుట్టించే విగ్రహం కనిపించింది.
ఆయన నాతో, “మనుష్యకుమారుడా, వారు చేస్తున్నది నీవు చూశావు కదా! నా పరిశుద్ధాలయం నుండి నన్ను దూరం చేసేలా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేస్తున్న చాలా అసహ్యకరమైన పనులు చూశావా? కాని వీటి కంటే మరింత అసహ్యకరమైన వాటిని నీవు చూస్తావు” అన్నారు.
అప్పుడు ఆయన నన్ను ఆవరణ ద్వారం దగ్గరకు తీసుకువచ్చారు. అక్కడ నేను చూడగా, నాకు గోడకు ఒక రంధ్రం కనిపించింది.
ఆయన నాతో, “మనుష్యకుమారుడా, ఆ గోడ లోపలికి త్రవ్వు” అని చెప్పారు. నేను ఆ గోడ లోపలికి త్రవ్వగా ద్వారం ఒకటి కనిపించింది.
ఆయన నాతో, “లోపలికి వెళ్లి వారు ఇక్కడ చేస్తున్న దుర్మార్గమైన అసహ్యకరమైన పనులు చూడు” అని చెప్పారు.
నేను లోపలికి వెళ్లి చూస్తే, అన్ని రకాల ప్రాకే జీవులు, అపవిత్రమైన జంతువులు, ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహాలు గోడ మీద అంతటా గీయబడి కనిపించాయి.
డెబ్బది మంది ఇశ్రాయేలీయుల పెద్దలు వాటి ముందు నిలబడి ఉన్నారు. వారి మధ్యలో షాఫాను కుమారుడైన యాజన్యా ఉన్నాడు. ప్రతి ఒక్కరి చేతిలో ధూపార్తి ఉంది. ఆ ధూపం యొక్క సువాసన మేఘంలా పైకి వెళ్తుంది.
ఆయన నాతో, “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు పెద్దలు చీకటిలో తమ తమ విగ్రహాల గుడి దగ్గర ప్రతి ఒక్కరూ తమ తమ విగ్రహాల గుడి దగ్గర ఏమి చేస్తున్నారో నీవు చూశావు గదా? యెహోవా మమ్మల్ని చూడడు; యెహోవా దేశాన్ని విడిచిపెట్టాడని వారు అనుకుంటున్నారు” అన్నారు.
ఆయన ఇంకా నాతో, “నీవు ఈ వైపుకు తిరిగి చూస్తున్నావా? వీటికి మించిన అసహ్యమైన పనులు వీరు చేయడం నీవు చూస్తావు” అన్నారు.
ఇలా చెప్పి ఆయన నన్ను యెహోవా ఆలయానికి ఉత్తర ద్వారం దగ్గరకు తీసుకువచ్చినప్పుడు, అక్కడ కొందరు స్త్రీలు కూర్చుని తమ్మూజు దేవతను గురించి ఏడుస్తూ నాకు కనిపించారు.
దేవుని ఆత్మ వలన వచ్చిన దర్శనంలో ఆత్మ నన్ను పైకి ఎత్తి బబులోనీయుల దేశంలో బందీలుగా ఉన్న వారి దగ్గరకు తీసుకువచ్చింది. అంతలో నాకు కనబడిన దర్శనం నన్ను విడిచి వెళ్లిపోయింది.