Chebar
33.1500, 44.0600 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి
Chebar ను ప్రస్తావించే వచనాలు
నా ముప్పయవ సంవత్సరం, నాల్గవ నెల, అయిదవ రోజున నేను కెబారు నది దగ్గర బందీల మధ్య ఉన్నప్పుడు ఆకాశం తెరువబడింది, నేను దేవుని దర్శనాలను చూశాను.
బబులోనీయుల దేశంలో కెబారు నది దగ్గర బూజీ కుమారుడు యాజకుడైన యెహెజ్కేలుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యింది. అక్కడ యెహోవా హస్తం అతని మీదికి వచ్చింది.
కెబారు నది దగ్గర ఉన్న తేలాబీబు అనే స్థలంలో బందీలుగా ఉన్న వారి దగ్గరకు వచ్చాను. వారు కూర్చున్న చోటే దిగులుగా ఏడు రోజులు కూర్చుండిపోయాను.
కాబట్టి నేను లేచి సమతల మైదానానికి వెళ్లాను. కెబారు నది దగ్గర నేను చూసిన యెహోవా మహిమ అక్కడ నిలబడి ఉంది. నేను ముఖం నేలకు ఆనించి మోకాళ్లమీద ఉన్నాను.
అప్పుడు కెరూబులు పైకి లేచాయి. కెబారు నది దగ్గర నేను చూసిన జీవులు ఇవే.
ఇవి కెబారు నది దగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నేను చూసిన జీవులు ఇవే. అవి కెరూబులను నేను గ్రహించాను.
వాటి ముఖాలు నేను కెబారు నది దగ్గర నేను చూసిన ముఖాల్లాగానే ఉన్నాయి. అవన్నీ తిన్నగా ముందుకు వెళ్తున్నాయి.
నేను చూసిన దర్శనం ఆయన పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు కెబారు నది దగ్గర నేను చూసిన దర్శనాల్లా ఉంది, నేను నేలపై సాష్టాంగపడ్డాను.