Skip to content

Wheel గురించి బైబిల్ వచనాలు

23 వచనాలు · 3 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. జ్ఞానంగల రాజు దుష్టులను చెదరగొడతాడు అతడు వారి మీదికి చక్రం దొర్లిస్తాడు.

  2. వెండితాడు తెగిపోక ముందే, బంగారు గిన్నె పగిలిపోక ముందే, నీటి ఊట దగ్గర కుండ బద్దలైపోక ముందే, బావి దగ్గర చక్రం విరిగిపోక ముందే, నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో.

  3. కాబట్టి నేను కుమ్మరి ఇంటికి వెళ్లాను, అక్కడ కుమ్మరి చక్రంపై పని చేయడం చూశాను.

  4. నేను ఆ జీవులను చూసినప్పుడు, ప్రతి జీవి నాలుగు ముఖాల్లో ప్రతీదాని ప్రక్కన నేలమీద ఒక్కొక్క చక్రం కనిపించింది.

  5. చక్రాల రూపం, నిర్మాణం ఇలా ఉంది: అవి గోమేధికంలా మెరుస్తూ, నాలుగు ఒకేలా ఉన్నాయి. ప్రతిదీ ఒక చక్రంలో మరో చక్రం ఇమిడి ఉండేలా తయారుచేయబడినట్లు కనిపించింది.

  6. అవి కదిలినప్పుడు ఆ జీవుల ముఖాలు ఉన్న నాలుగు దిశలలో కదులుతున్నాయి; ఆ జీవులు వెళ్లినప్పుడు ఆ చక్రాలు దిశను మార్చలేదు.

  7. వాటి అంచులు ఎత్తుగా భయంకరంగా ఉన్నాయి. నాలుగు అంచుల చుట్టూ కళ్లతో నిండి ఉన్నాయి.

  8. జీవులు కదిలినప్పుడు, వాటి ప్రక్కన ఉన్న చక్రాలు కదిలాయి; జీవులు నేల నుండి లేచినప్పుడు, చక్రాలు కూడా లేచాయి.

  9. ఆత్మ ఎక్కడికి వెళ్తుందో, అక్కడికి అవి వెళ్తున్నాయి, వాటితో పాటు చక్రాలు కూడా లేస్తున్నాయి, ఎందుకంటే జీవుల ఆత్మ చక్రాలలో ఉంది.

  10. జీవులు కదిలినప్పుడు, అవి కూడా కదిలాయి; జీవులు నిశ్చలంగా ఉన్నప్పుడు, అవి కూడా నిలిచి ఉన్నాయి; జీవులు నేల నుండి లేచినప్పుడు, చక్రాలు వాటితో పాటు లేచాయి, ఎందుకంటే జీవుల ఆత్మ చక్రాలలో ఉంది.

  11. అది జీవుల రెక్కలు ఒకదానికొకటి తగులుతుంటే వచ్చిన శబ్దము. వాటి ప్రక్కన ఉన్న చక్రాల శబ్దం గొప్ప గర్జన వంటి శబ్దంలా ఉంది.

  12. ఒక్కొక్క కెరూబు దగ్గర ఒక చక్రం చొప్పున మొత్తం నాలుగు చక్రాలున్నాయి. అవి పుష్యరాగం వంటి ప్రశస్తమైన రాళ్లతో చేసినట్లుగా ఉన్నాయి.

  13. ఆ నాలుగు చక్రాలు ఒకేలా ఉన్నాయి. ఆ చక్రాలు ఒకదానిలో ఒకటి అమర్చినట్లుగా ఉన్నాయి.

  14. అవి కదిలినప్పుడు కెరూబులు తిరిగి ఉన్న నాలుగు వైపులకు అవి వెళ్తాయి అయితే కెరూబులు వెళ్తూ ఉన్నప్పుడు అవి వెనుకకు తిరగలేదు. కెరూబులు ఎటూ తిరగకుండా వాటి తలలు తిరగి ఉన్న వైపు వెళ్లాయి.

  15. వాటి వీపు, చేతులు రెక్కలతో సహా వాటి శరీరమంతా కళ్లు ఉన్నాయి; వాటికున్న నాలుగు చక్రాలు కూడా పూర్తిగా కళ్లతో నిండి ఉన్నాయి.

  16. తిరగండని చక్రాలతో చెప్పడం నేను విన్నాను.

  17. ప్రతి కెరూబుకు నాలుగు ముఖాలు ఉన్నాయి: మొదటిది కెరూబు ముఖం, రెండవది మానవ ముఖం, మూడవది సింహ ముఖం, నాల్గవది గ్రద్ద ముఖము.

  18. అప్పుడు కెరూబులు పైకి లేచాయి. కెబారు నది దగ్గర నేను చూసిన జీవులు ఇవే.

  19. కెరూబులు కదిలినప్పుడు వాటి ప్రక్కనున్న చక్రాలు కూడా కదిలాయి; కెరూబులు నేల నుండి పైకి లేవడానికి రెక్కలు విప్పినప్పుడు కూడా చక్రాలు వాటి దగ్గర నుండి తొలగిపోలేదు.

  20. జీవుల ఆత్మ చక్రాలలో ఉంది కాబట్టి కెరూబులు నిలబడినప్పుడు అవి కూడ నిలబడ్డాయి; లేచినప్పుడు అవి కూడా లేచాయి.

  21. అప్పుడు యెహోవా మహిమ ఆలయ గుమ్మం మీద నుండి వెళ్లిపోయి కెరూబుల పైన ఆగింది.

  22. నేను చూస్తుండగానే కెరూబులు రెక్కలు విప్పి నేల నుండి పైకి లేచాయి, అవి వెళ్తుండగా చక్రాలు వాటితో పాటు వెళ్లాయి. అవి యెహోవా ఆలయ తూర్పు ద్వారం దగ్గరకు వచ్చి ఆగాయి; ఇశ్రాయేలు దేవుని మహిమ వాటిపైన ఉంది.

  23. అప్పుడు కెరూబులు రెక్కలు విప్పాయి, చక్రాలు వాటి ప్రక్కనే ఉన్నాయి. ఇశ్రాయేలు దేవుని మహిమ వాటిపై ఉంది.