కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీకా 1:1సుమారు క్రీ.పూ. 750

    యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజుల పరిపాలన కాలాల్లో మోరెషెతు వాడైన మీకా దగ్గరకు వచ్చిన యెహోవా వాక్కు. సమరయ, యెరూషలేముల గురించి అతడు చూసిన దర్శనం.

  2. మీకా 1:2సుమారు క్రీ.పూ. 750

    ప్రజలారా, మీరంతా వినండి, భూమీ, నీవు నీలోని నివాసులందరూ ఆలకించండి, ప్రభువైన యెహోవా మీమీద నేరారోపణ చేయబోతున్నారు, ప్రభువు తన పరిశుద్ధ ఆలయం నుండి మాట్లాడుతున్నారు.

  3. మీకా 1:3సుమారు క్రీ.పూ. 750

    చూడండి! యెహోవా తన నివాసస్థలం నుండి వస్తున్నారు; ఆయన దిగి భూమిమీది ఉన్నతస్థలాల మీద నడవబోతున్నారు.

  4. మీకా 1:4సుమారు క్రీ.పూ. 750

    అగ్నికి మైనం కరిగినట్లు, వాలు మీద నీరు ప్రవహించినట్లు, ఆయన పాదాల క్రింద పర్వతాలు కరుగుతాయి, లోయలు చీలిపోతాయి.

  5. మీకా 1:5సుమారు క్రీ.పూ. 750

    దీనంతటికీ యాకోబు అతిక్రమం, ఇశ్రాయేలు ప్రజల పాపాలే కారణం. యాకోబు అతిక్రమం ఏంటి? అది సమరయ కాదా? యూదా యొక్క క్షేత్రం ఏంటి? అది యెరూషలేము కాదా?

  6. మీకా 1:6సుమారు క్రీ.పూ. 750

    “కాబట్టి నేను సమరయను రాళ్ల కుప్పగా చేస్తాను, అది ద్రాక్షతోటలు నాటే స్థలం అవుతుంది. దాని రాళ్లను లోయలో పారవేస్తాను, దాని పునాదులు బయట పడతాయి.

  7. మీకా 1:7సుమారు క్రీ.పూ. 750

    దాని విగ్రహాలన్నీ ముక్కలుగా విరగ్గొట్టబడతాయి; దాని గుడి కానుకలన్ని అగ్నితో కాల్చబడతాయి; నేను దాని ప్రతిమలన్నిటినీ నాశనం చేస్తాను. అది వేశ్య సంపాదనతో తన బహుమానాలను పోగుచేసింది కాబట్టి అవి మళ్ళీ వేశ్య జీతంగా ఇవ్వబడతాయి.”

  8. మీకా 1:8సుమారు క్రీ.పూ. 750

    దీనిని బట్టి నేను ఏడుస్తూ విలపిస్తాను; నేను చెప్పులు లేకుండా, దిగంబరిగా బయట తిరుగుతాను. నేను నక్కలా అరుస్తాను, గుడ్లగూబలాగా మూలుగుతాను.

  9. మీకా 1:9సుమారు క్రీ.పూ. 750

    ఎందుకంటే సమరయ తెగులు బాగు చేయలేనిది; అది యూదాకు వ్యాపించింది. అది నా ప్రజల ద్వారాల వరకు, యెరూషలేము వరకు కూడా వ్యాపించింది.

  10. మీకా 1:10సుమారు క్రీ.పూ. 750

    ఈ సంగతి గాతు పట్టణంలో చెప్పకండి; ఏమాత్రం ఏడవకండి. బేత్-లీఫ్రాలో నేను ధూళిలో పొర్లాడాను.

  11. మీకా 1:11సుమారు క్రీ.పూ. 750

    షాఫీరు వాసులారా, దిగంబరులై సిగ్గు పడుతూ దాటి వెళ్లండి. జయనాను నివాసులు బయటకు రారు. బేత్-ఏజెల్ శోకంలో ఉంది; అది ఇక ఎన్నడు మిమ్మల్ని కాపాడదు.

  12. మీకా 1:12సుమారు క్రీ.పూ. 750

    మారోతు వాసులు బాధలో ఉన్నారు, ఉపశమనం కోసం ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే, ఎందుకంటే, యెహోవా దగ్గర నుండి కీడు వచ్చింది, అది యెరూషలేము ద్వారం వరకు వచ్చింది.

  13. మీకా 1:13సుమారు క్రీ.పూ. 750

    లాకీషులో నివాసులారా, రథాలకు గుర్రాలను కట్టండి. ఇశ్రాయేలు అతిక్రమాలు మీలో కనిపించాయి, సీయోను కుమార్తె పాపానికి ప్రారంభం మీరు.

  14. మీకా 1:14సుమారు క్రీ.పూ. 750

    కాబట్టి మీరు మోరెషెత్-గాతుకు వీడుకోలు కానుకలిస్తారు. అక్సీబు పట్టణం ఇశ్రాయేలు రాజులను మోసగిస్తుందని రుజువు అవుతుంది.

  15. మీకా 1:15సుమారు క్రీ.పూ. 750

    మరేషా వాసులారా! మీ పట్టణాన్ని స్వాధీనపరచుకునేవారిని పంపుతాను. ఇశ్రాయేలు ఘనులు అదుల్లాముకు పారిపోతారు.

  16. మీకా 1:16సుమారు క్రీ.పూ. 750

    మీకు ఇష్టమైన పిల్లల కోసం శోకంలో మీ తలలు గొరిగించుకోండి; రాబందులా బోడితల చేసుకోండి ఎందుకంటే మీ పిల్లలు మీ నుండి బందీలుగా వెళ్తారు.

  17. మీకా 2:1సుమారు క్రీ.పూ. 730

    తమ పడకల మీద పాపపు ఆలోచనలు చేసేవారికి, కీడును తలంచే వారికి శ్రమ! వారికి అధికారం ఉంది కాబట్టి, ఉదయకాల వెలుగులో వారు చెడు చేస్తారు.

  18. మీకా 2:2సుమారు క్రీ.పూ. 730

    వారు భూములను ఆశించి ఆక్రమించుకుంటారు, ఇళ్ళను ఆశించి తీసుకుంటారు. వారు ప్రజలను మోసం చేసి వారి ఇళ్ళను లాక్కుంటారు, ప్రజల నుండి వారి స్వాస్థ్యాన్ని దోచుకుంటారు.

  19. మీకా 2:3సుమారు క్రీ.పూ. 730

    కాబట్టి యెహోవా చెప్పే మాట ఇదే: “నేను ఈ వంశం మీదికి విపత్తు రప్పించబోతున్నాను, దాని నుండి మీరు మిమ్మల్ని కాపాడుకోలేరు. అది విపత్తు కాలం కాబట్టి మీరు ఇక ఎన్నడు గర్వంగా నడవలేరు.

  20. మీకా 2:4సుమారు క్రీ.పూ. 730

    ఆ రోజు ప్రజలు మీ గురించి ఒక సామెత చెప్తారు; మీ గురించి ఈ విషాద గీతం పాడుతూ ఎగతాళి చేస్తారు: ‘మేము పూర్తిగా పాడైపోయాం; నా ప్రజల ఆస్తి విభజింపబడింది ఆయన దాన్ని నా నుండి తీసుకుంటారు! ఆయన మా భూములను దేశద్రోహులకు అప్పగించారు.’ ”

  21. మీకా 2:5సుమారు క్రీ.పూ. 730

    అందువల్ల చీట్లువేసి భూమిని కొలమానం ప్రకారం పంచడానికి యెహోవా సమాజంలో ఎవరూ ఉండరు.

  22. మీకా 2:6సుమారు క్రీ.పూ. 730

    “ప్రవచించకండి” అని వారి ప్రవక్తలు అంటారు, “వీటి గురించి ప్రవచించకండి; మనకు అవమానం కలుగకూడదు.”

  23. మీకా 2:7సుమారు క్రీ.పూ. 730

    యాకోబు వారసులారా, “యెహోవా సహనం కోల్పోయారా? ఆయన ఇలాంటి పనులు చేస్తారా?” అని అనవచ్చా? “యథార్థంగా ప్రవర్తించే వారికి నా మాటలు క్షేమం కలిగించవా?

  24. మీకా 2:8సుమారు క్రీ.పూ. 730

    ఇటీవల నా ప్రజలే శత్రువుగా లేచారు. యుద్ధం నుండి తిరిగి వచ్చే మనుష్యుల్లా, నిర్భయంగా దారిన పోతూ ఉన్న వారి నుండి సంపన్న వస్త్రాన్ని మీరు లాగివేస్తారు.

  25. మీకా 2:9సుమారు క్రీ.పూ. 730

    నా ప్రజల స్త్రీలను వారికిష్టమైన గృహాలలో నుండి వెళ్లగొడతారు. వారి పిల్లల మీద ఎప్పటికీ నా ఆశీర్వాదం ఉండకుండా చేస్తున్నారు.