కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెషయా 1:26సుమారు క్రీ.పూ. 759

    పూర్వం ఉన్నట్లు నీకు న్యాయాధిపతులను, తొలి రోజుల్లో ఉన్నట్లు నీకు పాలకులను నియమిస్తాను. అప్పుడు నీవు నీతిగల పట్టణమని, నమ్మకమైన పట్టణమని పిలువబడతావు.

  2. యెషయా 1:27సుమారు క్రీ.పూ. 759

    సీయోనుకు న్యాయంతో, పశ్చాత్తాపపడే వారికి నీతితో విడుదల కలుగుతుంది.

  3. యెషయా 1:28సుమారు క్రీ.పూ. 759

    అయితే తిరుగుబాటుదారులు, పాపులు నలుగగొట్టబడతారు, యెహోవాను విడిచిపెట్టిన వారు నశిస్తారు.

  4. యెషయా 1:29సుమారు క్రీ.పూ. 759

    “మీరు వేటిని బట్టి ఆనందించారో ఆ పవిత్ర సింధూర వృక్షాల గురించి మీరు సిగ్గుపడతారు; మీరు ఎంచుకున్న సింధూర తోటల గురించి మీరు అవమానించబడతారు.

  5. యెషయా 1:30సుమారు క్రీ.పూ. 759

    మీరు ఆకులు వాడిపోతున్న సింధూర వృక్షంలా, నీరు లేని తోటలా అవుతారు.

  6. యెషయా 1:31సుమారు క్రీ.పూ. 759

    బలవంతుడు పీచులా అవుతాడు అతని పని నిప్పురవ్వలా అవుతుంది; అవి రెండూ కలిసి కాలిపోతాయి, మంటను ఆర్పేవారు ఎవరూ ఉండరు.”

  7. యెషయా 2:1సుమారు క్రీ.పూ. 759

    యూదా గురించి, యెరూషలేము గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు వచ్చిన దర్శనం:

  8. యెషయా 2:2సుమారు క్రీ.పూ. 759

    చివరి రోజుల్లో యెహోవా మందిరం పర్వతాలన్నిటిలో ఉన్నతమైనదిగా స్థిరపరచబడుతుంది; అది కొండలకు పైగా హెచ్చింపబడుతుంది, జనాంగాలన్నీ దాని దగ్గరకు ప్రవాహంలా వెళ్తారు.

  9. యెషయా 2:3సుమారు క్రీ.పూ. 759

    చాలా జనాంగాలు వచ్చి ఇలా అంటారు, “రండి, మనం యెహోవా పర్వతం మీదికి, యాకోబు దేవుని ఆలయానికి వెళ్దాము. మనం ఆయన మార్గంలో నడిచేలా, ఆయన మనకు తన మార్గాల్ని బోధిస్తారు.” సీయోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయటకు వెళ్తాయి.

  10. యెషయా 2:4సుమారు క్రీ.పూ. 759

    ఆయన దేశాల మధ్య తీర్పు తీరుస్తారు, అనేక జనాంగాల వివాదాలను పరిష్కరిస్తారు. వారు తమ ఖడ్గాలను సాగగొట్టి నాగటి నక్కులుగా, తమ ఈటెలను సాగగొట్టి మడ్డికత్తులుగా చేస్తారు. ఒక దేశం మరొక దేశం మీద ఖడ్గం ఎత్తదు, వారు ఇకపై యుద్ధానికి శిక్షణ పొందరు.

  11. యెషయా 2:5సుమారు క్రీ.పూ. 759

    యాకోబు వారసులారా రండి, మనం యెహోవా వెలుగులో నడుద్దాము.

  12. యెషయా 2:6సుమారు క్రీ.పూ. 759

    యెహోవా, యాకోబు వారసులైన మీ ప్రజలను మీరు విడిచిపెట్టారు. వారు తూర్పు దేశాలకున్న మూఢనమ్మకాలతో నిండి ఉన్నారు; వారు ఫిలిష్తీయుల్లా భవిష్యవాణి చూస్తారు, ఇతరుల ఆచారాలను పాటిస్తారు.

  13. యెషయా 2:7సుమారు క్రీ.పూ. 759

    వారి దేశం వెండి బంగారాలతో నిండి ఉంది; వారి ధనానికి అంతులేదు. వారి దేశం గుర్రాలతో నిండి ఉంది; వారి రథాలకు అంతులేదు.

  14. యెషయా 2:8సుమారు క్రీ.పూ. 759

    వారి దేశం విగ్రహాలతో నిండి ఉంది. వారు తమ చేతులతో చేసిన వాటికి, తమ వ్రేళ్లతో చేసిన వాటికి తలవంచి నమస్కరిస్తారు.

  15. యెషయా 2:9సుమారు క్రీ.పూ. 759

    కాబట్టి ప్రజలు అణచివేయబడతారు ప్రతి ఒక్కరు తగ్గించబడతారు వారిని క్షమించకండి.

  16. యెషయా 2:10సుమారు క్రీ.పూ. 759

    యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి బండ సందులకు వెళ్లి నేలలో దాక్కోండి.

  17. యెషయా 2:11సుమారు క్రీ.పూ. 759

    మనుష్యుల అహంకారపు చూపు తగ్గించబడుతుంది, మనుష్యుల గర్వం అణచివేయబడుతుంది; ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతారు.

  18. యెషయా 2:12సుమారు క్రీ.పూ. 759

    సైన్యాల యెహోవా అహంకారం, గర్వం ఉన్న ప్రతివారి కోసం హెచ్చింపబడిన వాటన్నిటి కోసం ఒక రోజును నియమించారు. (అవి అణచివేయబడతాయి),

  19. యెషయా 2:13సుమారు క్రీ.పూ. 759

    ఎందుకంటే ఎత్తైన పొడవైన లెబానోను దేవదారు చెట్లన్నిటికి, బాషాను సింధూర వృక్షాలన్నిటికి,

  20. యెషయా 2:14సుమారు క్రీ.పూ. 759

    పెద్ద పర్వతాలన్నిటికి, ఎత్తైన కొండలన్నిటికి

  21. యెషయా 2:15సుమారు క్రీ.పూ. 759

    ఉన్నతమైన ప్రతి గోపురానికి ప్రతి కోటగోడకు,

  22. యెషయా 2:16సుమారు క్రీ.పూ. 759

    ప్రతీ వాణిజ్య నౌకకు మనోహరమైన నౌకలకు ఒక రోజును నియమించారు.

  23. యెషయా 2:17సుమారు క్రీ.పూ. 759

    మనుష్యుల అహంకారం అణచివేయబడుతుంది మానవుల గర్వం తగ్గించబడుతుంది; ఆ రోజు యెహోవా మాత్రమే ఘనపరచబడతారు.

  24. యెషయా 2:18సుమారు క్రీ.పూ. 759

    విగ్రహాలు పూర్తిగా అదృశ్యమవుతాయి.

  25. యెషయా 2:19సుమారు క్రీ.పూ. 759

    యెహోవా భూమిని వణికించడానికి లేచినప్పుడు, ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి పారిపోయి వారు కొండల గుహల్లో నేలలో ఉన్న సందుల్లో దాక్కుంటారు.