Skip to content

Rachel

45 వచనాలు · 5 కుటుంబ సభ్యులు

ఇలా కూడా పిలుస్తారు: Rahel

Rachel ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు యాకోబు, “లాబాను క్షేమమేనా?” అని అడిగాడు. “అవును, అతడు క్షేమమే, అదిగో, అతని కుమార్తె రాహేలు గొర్రెల మందతో వస్తుంది” అని వారు చెప్పారు.

  2. యాకోబు వారితో ఇంకా మాట్లాడుతుండగా, రాహేలు తన తండ్రి గొర్రెలతో వచ్చింది, ఆమె కూడా కాపరి.

  3. యాకోబు తన మామ లాబాను కుమార్తెయైన రాహేలును, తన మామ మందను చూడగానే, అతడు వెళ్లి బావి మీద ఉన్న రాయిని దొర్లించి తన మామ మందకు నీళ్లు పెట్టాడు.

  4. తర్వాత యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని బిగ్గరగా ఏడ్చాడు.

  5. అతడు తన తండ్రి బంధువని, రిబ్కా కుమారుడని రాహేలుతో చెప్పాడు. కాబట్టి ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి తన తండ్రికి చెప్పింది.

  6. లాబానుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు; పెద్దకుమార్తె పేరు లేయా, చిన్న కుమార్తె పేరు రాహేలు.

  7. లేయాకు బలహీనమైన కళ్లు ఉన్నాయి, కాని రాహేలు రూపవతి, అందగత్తె.

  8. యాకోబు రాహేలుతో ప్రేమలో ఉండి, “నీ చిన్న కుమార్తె రాహేలు కోసం నేను నీ దగ్గర ఏడు సంవత్సరాలు సేవ చేస్తాను” అన్నాడు.

  9. యాకోబు రాహేలు కోసం ఏడు సంవత్సరాలు పని చేశాడు, అయితే తనకు రాహేలు పట్ల ఉన్న ప్రేమను బట్టి అతనికి ఆ ఏడు సంవత్సరాలు కొద్దిరోజులే అనిపించింది.

  10. తెల్లవారినప్పుడు యాకోబు లేచి చూస్తే, అతనితో ఉన్నది లేయా! కాబట్టి యాకోబు లాబానును, “నీవు చేసింది ఏంటి? నేను రాహేలు కోసం నీకు పని చేశాను కదా; నీవు నన్నెందుకు మోసం చేశావు?” అని అడిగాడు.

  11. యాకోబు అలాగే చేశాడు. లేయాతో తన వారం ముగించుకున్న తర్వాత లాబాను తన కుమార్తె రాహేలును అతనికి భార్యగా ఇచ్చాడు.

  12. లాబాను తన దాసి బిల్హాను తన కుమార్తెయైన రాహేలుకు దాసిగా ఇచ్చాడు.

  13. యాకోబు రాహేలుతో కూడా పడుకున్నాడు, అతడు లేయాకంటే రాహేలును ఎక్కువ ప్రేమించాడు కాబట్టి అతడు లాబాను కోసం ఇంకా ఏడు సంవత్సరాలు పని చేశాడు.

  14. లేయా ప్రేమించబడడం లేదని యెహోవా చూసి, ఆమె గర్భవతి అయ్యేలా ఆయన కరుణించారు, కాని రాహేలు గొడ్రాలిగా ఉంది.

  15. రాహేలు తనకు పిల్లలు కలగడం లేదు అని గ్రహించి, తన అక్క మీద అసూయ పడింది. కాబట్టి యాకోబుతో, “నాకు పిల్లలను ఇవ్వు లేదా నేను చస్తాను!” అని అన్నది.

  16. యాకోబు ఆమెపై కోప్పడి, “నేనేమైన నీకు పిల్లలు పుట్టకుండా ఆపిన దేవుని స్థానంలో ఉన్నానా?” అని అన్నాడు.

  17. అప్పుడు రాహేలు, “దేవుడు నాకు శిక్షావిముక్తి చేశారు; నా మొర విని నాకు కుమారుని ఇచ్చారు” అని అన్నది. కాబట్టి అతనికి దాను అని పేరు పెట్టింది.

  18. రాహేలు దాసి బిల్హా మళ్ళీ గర్భవతియై యాకోబుకు మరో కుమారున్ని కన్నది.

  19. అప్పుడు రాహేలు, “నేను అక్కతో గొప్ప పోరాటం చేశాను, నేను గెలిచాను” అని అన్నది. కాబట్టి అతనికి నఫ్తాలి అని పేరు పెట్టింది.

  20. గోధుమ కోతకాలంలో రూబేను పొలాలకు వెళ్లాడు, అక్కడ ఉన్న పుత్రదాత వృక్షం పండ్లు కొన్ని తెచ్చి, తల్లి లేయాకు ఇచ్చాడు. రాహేలు లేయాతో, “నీ కుమారుడు తెచ్చిన పండ్లలో కొన్ని నాకు దయచేసి ఇవ్వు” అని అడిగింది.

  21. అయితే లేయా ఆమెతో, “నా భర్తను నీవు తీసుకున్నావు, అది చాలదా? ఇప్పుడు నా కుమారుడు తెచ్చిన పండ్లు కూడా కావాలా?” అని అన్నది. రాహేలు, “సరే, నీ కుమారుడు తెచ్చిన పండ్ల కోసం ఈ రోజు నీతో అతడు పడుకోవచ్చు” అని అన్నది.

  22. తర్వాత దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నారు; ఆయన ఆమె మనవి విన్నారు, ఆమెకు పిల్లలు పుట్టేలా చేశారు.

  23. రాహేలు యోసేపుకు జన్మనిచ్చిన తర్వాత, యాకోబు లాబానుతో, “నేను నా స్వదేశానికి వెళ్తాను, నన్ను పంపించు.

  24. యాకోబు తన మందలు ఉన్న పొలం దగ్గరకు రమ్మని రాహేలుకు, లేయాకు కబురు పంపాడు.

  25. అప్పుడు రాహేలు, లేయా జవాబిస్తూ, “మా తండ్రి స్వాస్థ్యంలో మాకు ఇంకా ఏమైనా పాలుపంపులు ఉన్నాయా?