Skip to content

Ramah

17 verses · 2 known names

ఇలా కూడా పిలుస్తారు: Ramath

31.8900, 35.2000 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Ramah ను ప్రస్తావించే వచనాలు

  1. గిబియోను, రామా, బెయేరోతు, మిస్పే,

  2. ఈ పట్టణాల చుట్టూరా బాలత్-బెయేరు (దక్షిణాన ఉన్న రామా) వరకు ఉన్న గ్రామాలన్నీ.

  3. ఆమె ఎఫ్రాయిం కొండ సీమలో రామాకు బేతేలుకు మధ్యనున్న దెబోరా ఖర్జూర చెట్టు క్రింద తీర్పులు తీర్చడానికి కూర్చుండేది, ఇశ్రాయేలీయులు వారి వివాదాలు పరిష్కరించుకోడానికి ఆమె దగ్గరకు వచ్చేవారు.

  4. “మనం గిబియాకు గాని రామాకు గాని చేరి ఒకచోట రాత్రి గడుపుదాం” అన్నాడు.

  5. ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా వారి మీదికి వెళ్లి యూదా రాజైన ఆసా సరిహద్దులోనికి రాకపోకలు లేకుండ రామా పట్టణాన్ని పటిష్టం చేశాడు.

  6. బయెషా ఈ వార్త విని రామాను కట్టించడం మానేసి తిర్సాకు వెళ్లిపోయాడు.

  7. అప్పుడు రాజైన ఆసా ఎవరినీ మినహాయించకుండా, యూదా వారంతా రావాలని ప్రకటన చేశాడు. వారు కూడి వచ్చి, రామా కట్టించడానికి బయెషా ఉపయోగించిన రాళ్లను, కలపను ఎత్తుకుపోయారు. వాటితో రాజైన ఆసా బెన్యామీను ప్రాంతంలో గెబాను, మిస్పాను కట్టించాడు.

  8. ఆసా పరిపాలిస్తున్న ముప్పై ఆరవ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా వారి మీదికి వెళ్లి యూదా రాజైన ఆసా సరిహద్దులోనికి రాకపోకలు లేకుండ రామా పట్టణాన్ని పటిష్టం చేశాడు.

  9. బయెషా ఈ వార్త విని రామాను కట్టించడం మానేసి తన పనిని నిలిపి వేశాడు.

  10. అప్పుడు రాజైన ఆసా యూదా మనుష్యులందరిని సమకూర్చాడు. వారు కూడి వచ్చి, రామా కట్టించడానికి బయెషా ఉపయోగించిన రాళ్లను, కలపను ఎత్తుకుపోయారు. వాటితో ఆసా గెబాను, మిస్పాను కట్టించాడు.

  11. రామా, గెబా వారసులు 621;

  12. రామా, గెబా వారసులు 621;

  13. హాసోరులో, రామాలో, గిత్తయీములో,

  14. వారు మార్గం దాటి వెళ్తూ, “మేము గెబాలో రాత్రి బస చేస్తాం” అంటున్నారు. రామా వణకుతుంది; సౌలు గిబియా పారిపోతుంది.

  15. యెహోవా చెప్పే మాట ఇదే: “రామాలో రోదన, గొప్ప ఏడ్పు వినబడుతుంది, రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ ఇక వారు లేరని, ఓదార్పు పొందడానికి నిరాకరిస్తుంది.”

  16. రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను రామాలో విడిచిపెట్టిన తర్వాత యిర్మీయాకు యెహోవా నుండి వాక్కు వచ్చింది. నెబూజరదాను యెరూషలేము, యూదా నుండి బబులోనుకు బందీలుగా తీసుకువెళ్తున్న వారిలో గొలుసులతో బంధించబడి ఉన్న యిర్మీయాను చూశాడు.

  17. “గిబియాలో బాకానాదం చేయండి, రామాలో బూర ఊదండి. బెన్యామీనూ, నీ వెనుకే వస్తున్నాము; బేత్-ఆవెనులో యుద్ధ నినాదాలు చేయండి.