Asa
Asa ను ప్రస్తావించే వచనాలు
అబీయా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు ఆసా రాజయ్యాడు.
ఇశ్రాయేలు రాజైన యరొబాము పరిపాలనలోని ఇరవయ్యవ సంవత్సరంలో, ఆసా యూదా దేశానికి రాజయ్యాడు.
ఆసా తన పితరుడైన దావీదువలె యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు.
అతని అవ్వ మయకా అషేరాను పూజించడానికి ఒక అసహ్యమైన ప్రతిమను చేయించింది కాబట్టి ఆమెను రాజమాత స్థానం నుండి తొలగించాడు. ఆసా ఆ ప్రతిమను కూలగొట్టి, కిద్రోను లోయలో దానిని తగలబెట్టాడు.
అతడు క్షేత్రాలను మాత్రం తొలగించనప్పటికీ, ఆసా బ్రతికిన కాలమంతా యెహోవాకు సంపూర్ణంగా సమర్పించుకున్నాడు.
ఆసాకు, ఇశ్రాయేలు రాజైన బయెషాకు వారు బ్రతికిన కాలమంతా యుద్ధం జరుగుతూనే ఉండేది.
ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా వారి మీదికి వెళ్లి యూదా రాజైన ఆసా సరిహద్దులోనికి రాకపోకలు లేకుండ రామా పట్టణాన్ని పటిష్టం చేశాడు.
అప్పుడు ఆసా యెహోవా మందిరంలో, తన భవనంలో ఉన్న ఖజానాల్లో మిగిలిన వెండి బంగారాలంతా తీసి తన అధికారులకు అప్పగించి, దమస్కులో పరిపాలిస్తున్న తబ్రిమ్మోను కుమారుడు, హెజ్యోను మనుమడు, సిరియా రాజైన బెన్-హదదుకు పంపాడు.
రాజైన ఆసాతో బెన్-హదదు ఏకీభవించి, తన సేనాధిపతులను ఇశ్రాయేలు పట్టణాల మీదికి పంపాడు. అతడు ఈయోను, దాను, ఆబేల్-బేత్-మయకా, కిన్నెరెతు పరిసరాలన్నీ, నఫ్తాలి ప్రదేశమంతా జయించాడు.
అప్పుడు రాజైన ఆసా ఎవరినీ మినహాయించకుండా, యూదా వారంతా రావాలని ప్రకటన చేశాడు. వారు కూడి వచ్చి, రామా కట్టించడానికి బయెషా ఉపయోగించిన రాళ్లను, కలపను ఎత్తుకుపోయారు. వాటితో రాజైన ఆసా బెన్యామీను ప్రాంతంలో గెబాను, మిస్పాను కట్టించాడు.
ఆసా పరిపాలన గురించిన ఇతర విషయాలు అతని విజయాలు అతడు చేసిందంతా అతడు కట్టించిన పట్టణాల గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా? అతని వృద్ధాప్యంలో అతని పాదాలకు వ్యాధి సోకింది.
తర్వాత ఆసా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, తన పితరుడైన దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు యెహోషాపాతు రాజయ్యాడు.
యూదా దేశంలో రాజైన ఆసా పరిపాలనలోని రెండవ సంవత్సరంలో యరొబాము కుమారుడైన నాదాబు ఇశ్రాయేలు దేశానికి రాజయ్యాడు. అతడు రెండేళ్ళు ఇశ్రాయేలును పరిపాలించాడు.
యూదా రాజైన ఆసా పరిపాలనలోని మూడవ సంవత్సరంలో బయెషా నాదాబును చంపి, అతని తర్వాత రాజయ్యాడు.
ఆసాకు, ఇశ్రాయేలు రాజైన బయెషాకు వారు బ్రతికిన కాలమంతా యుద్ధం జరుగుతూనే ఉండేది.
యూదా రాజైన ఆసా పరిపాలనలోని మూడవ సంవత్సరంలో, అహీయా కుమారుడైన బయెషా తిర్సాలో ఇశ్రాయేలంతటికి రాజయ్యాడు. అతడు ఇరవైనాలుగు సంవత్సరాలు పరిపాలించాడు.
యూదా రాజైన ఆసా పరిపాలనలోని ఇరవై ఆరవ సంవత్సరంలో బయెషా కుమారుడైన ఏలహు ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు తిర్సాలో రెండేళ్ళు పరిపాలించాడు.
జిమ్రీ లోపలికి వచ్చి, అతన్ని మొత్తి చంపాడు, అతని తర్వాత అతడు రాజయ్యాడు. ఇది యూదా రాజైన ఆసా ఇరవై ఏడవ ఏట పరిపాలనలో జరిగింది.
యూదా రాజైన ఆసా పరిపాలనలోని ఇరవై ఏడవ సంవత్సరంలో జిమ్రీ తిర్సాలో ఏడు రోజులు పరిపాలించాడు. అప్పుడు ఇశ్రాయేలు సైన్యం ఫిలిష్తీయులకు చెందిన గిబ్బెతోను అనే పట్టణం ముట్టడించారు.
యూదా రాజైన ఆసా పరిపాలన యొక్క ముప్పై ఒకటవ సంవత్సరంలో ఒమ్రీ ఇశ్రాయేలుకు రాజై పన్నెండు సంవత్సరాల పరిపాలనలో ఆరు సంవత్సరాలు తిర్సాలో పరిపాలన చేశాడు.
యూదా రాజైన ఆసా పరిపాలనలోని ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు సమరయలో ఇశ్రాయేలు మీద ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలించాడు.
ఇశ్రాయేలు రాజైన అహాబు పరిపాలనలోని నాల్గవ సంవత్సరంలో ఆసా కుమారుడైన యెహోషాపాతు యూదాకు రాజయ్యాడు.
ప్రతీ విషయంలో అతడు తన తండ్రి ఆసా విధానాలను అనుసరించాడు, వాటినుండి తొలగిపోలేదు; అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. అయితే, క్షేత్రాలు తొలగించబడలేదు, ప్రజలు ఇంకా ఆ స్థలాల్లో బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చారు.
అతడు తన తండ్రి ఆసా పాలన తర్వాత కూడా అక్కడ మిగిలిపోయిన ఆలయాలలో ఉన్న పురుష వేశ్యలను దేశంలో నుండి తొలగించాడు.
సొలొమోను కుమారుడు రెహబాము, అతని కుమారుడు అబీయా, అతని కుమారుడు ఆసా, అతని కుమారుడు యెహోషాపాతు,