Skip to content

Geba

14 verses · 2 known names

ఇలా కూడా పిలుస్తారు: Gaba

31.8500, 35.2500 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Geba ను ప్రస్తావించే వచనాలు

  1. కెఫార్-అమ్మోని, ఓఫ్ని, గెబా అనేవి పన్నెండు పట్టణాలు వాటి గ్రామాలు.

  2. బెన్యామీను గోత్రం నుండి వారికి ఇచ్చినవి: గిబియోను, గెబా,

  3. యోనాతాను గెబాలో ఉన్న ఫిలిష్తీయుల సైనిక స్థావరాల మీద దాడి చేశాడు, ఆ విషయం ఫిలిష్తీయులకు తెలిసింది; అప్పుడు సౌలు దేశమంతట బూర ఊదించి, “హెబ్రీయులారా వినండి” అని చెప్పాడు.

  4. అప్పుడు రాజైన ఆసా ఎవరినీ మినహాయించకుండా, యూదా వారంతా రావాలని ప్రకటన చేశాడు. వారు కూడి వచ్చి, రామా కట్టించడానికి బయెషా ఉపయోగించిన రాళ్లను, కలపను ఎత్తుకుపోయారు. వాటితో రాజైన ఆసా బెన్యామీను ప్రాంతంలో గెబాను, మిస్పాను కట్టించాడు.

  5. యోషీయా యూదా పట్టణాల్లో ఉన్న యాజకులందరిని యెరూషలేముకు తెప్పించి ఆ యాజకులు ధూపం వేసే క్షేత్రాలను గెబా నుండి బెయేర్షేబ వరకు అపవిత్రపరచాడు. అతడు యెరూషలేము నగర అధికారియైన యెహోషువ ఇంటి ద్వారం ఎడమవైపు ఉన్న క్షేత్రాలను పడగొట్టించాడు.

  6. బెన్యామీను గోత్ర ప్రదేశాల్లో, గిబియోను, గెబా, అల్లెమెతు, అనాతోతు వాటి పచ్చిక మైదానాలతో పాటు ఇవ్వబడ్డాయి.

  7. వీరు ఏహూదు వారసులు, గెబాలో నివసిస్తున్న కుటుంబాలకు పెద్దలు. వీరు బలవంతంగా మనహతుకు తరలి వెళ్లాల్సి వచ్చింది:

  8. అప్పుడు రాజైన ఆసా యూదా మనుష్యులందరిని సమకూర్చాడు. వారు కూడి వచ్చి, రామా కట్టించడానికి బయెషా ఉపయోగించిన రాళ్లను, కలపను ఎత్తుకుపోయారు. వాటితో ఆసా గెబాను, మిస్పాను కట్టించాడు.

  9. రామా, గెబా వారసులు 621;

  10. రామా, గెబా వారసులు 621;

  11. గెబాలో స్థిరపడిన బెన్యామీనీయులు మిక్మషులో, అయ్యాలో, బేతేలు వాటి చుట్టుప్రక్కల గ్రామాల్లో,

  12. యెరూషలేము చుట్టూ సంగీతకారులు తమ కోసం గ్రామాలు నిర్మించుకున్నారు కాబట్టి బేత్-గిల్గాలు నుండి, గెబా అజ్మావెతు ప్రాంతాల నుండి వచ్చారు.

  13. వారు మార్గం దాటి వెళ్తూ, “మేము గెబాలో రాత్రి బస చేస్తాం” అంటున్నారు. రామా వణకుతుంది; సౌలు గిబియా పారిపోతుంది.

  14. యెరూషలేముకు దక్షిణాన ఉన్న గెబా నుండి రిమ్మోను వరకు ఉన్న దేశమంతా అరాబాలా మైదానంలా అవుతుంది. అయితే యెరూషలేము బెన్యామీను ద్వారం నుండి మూల ద్వారం వరకు అనగా మొదటి ద్వారం ఉన్న స్థలం వరకు, హనానేలు గోపురం నుండి రాజ ద్రాక్షగానుగల వరకు వ్యాపించి ఉంటుంది.