Baasha
Baasha ను ప్రస్తావించే వచనాలు
ఆసాకు, ఇశ్రాయేలు రాజైన బయెషాకు వారు బ్రతికిన కాలమంతా యుద్ధం జరుగుతూనే ఉండేది.
ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా వారి మీదికి వెళ్లి యూదా రాజైన ఆసా సరిహద్దులోనికి రాకపోకలు లేకుండ రామా పట్టణాన్ని పటిష్టం చేశాడు.
అతడు, “నా తండ్రికి నీ తండ్రికి మధ్య ఒప్పందం ఉన్నట్లు, నీకు నాకు మధ్య ఒప్పందం ఉండాలి. చూడు, నేను వెండి బంగారాలను కానుకగా పంపిస్తున్నాను. ఇప్పుడు ఇశ్రాయేలు రాజైన బయెషా నా దగ్గర నుండి వెళ్ళిపోయేలా అతనితో నీ ఒప్పందం తెంచుకో” అని అన్నాడు.
బయెషా ఈ వార్త విని రామాను కట్టించడం మానేసి తిర్సాకు వెళ్లిపోయాడు.
అప్పుడు రాజైన ఆసా ఎవరినీ మినహాయించకుండా, యూదా వారంతా రావాలని ప్రకటన చేశాడు. వారు కూడి వచ్చి, రామా కట్టించడానికి బయెషా ఉపయోగించిన రాళ్లను, కలపను ఎత్తుకుపోయారు. వాటితో రాజైన ఆసా బెన్యామీను ప్రాంతంలో గెబాను, మిస్పాను కట్టించాడు.
నాదాబు మీద ఇశ్శాఖారు గోత్రికుడు, అహీయా కుమారుడైన బాషా కుట్రపన్ని, ఇశ్రాయేలు వారంతా ఫిలిష్తీయులకు చెందిన గిబ్బెతోనును ముట్టడిస్తున్న సమయంలో గిబ్బెతోనులో బయెషా నాదాబును చంపేశాడు.
యూదా రాజైన ఆసా పరిపాలనలోని మూడవ సంవత్సరంలో బయెషా నాదాబును చంపి, అతని తర్వాత రాజయ్యాడు.
ఆసాకు, ఇశ్రాయేలు రాజైన బయెషాకు వారు బ్రతికిన కాలమంతా యుద్ధం జరుగుతూనే ఉండేది.
యూదా రాజైన ఆసా పరిపాలనలోని మూడవ సంవత్సరంలో, అహీయా కుమారుడైన బయెషా తిర్సాలో ఇశ్రాయేలంతటికి రాజయ్యాడు. అతడు ఇరవైనాలుగు సంవత్సరాలు పరిపాలించాడు.
బయెషా గురించి హనానీ కుమారుడైన యెహుకు యెహోవా నుండి వచ్చిన వాక్కు:
కాబట్టి నేను బయెషాను, అతని వంశాన్ని తుడిచివేస్తాను. నీ ఇంటిని నెబాతు కుమారుడైన యరొబాము ఇంటిలా చేస్తాను.
బయెషాకు సంబంధించిన వారిలో ఎవరు పట్టణంలో చనిపోతారో వారిని కుక్కలు తింటాయి, పొలంలో చనిపోయేవారిని పక్షులు తింటాయి.”
బయెషా పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసింది, అతడు సాధించిన విజయాలు, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
బయెషా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. తిర్సాలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు ఏలహు రాజయ్యాడు.
అంతేకాక బయెషాకు, అతని వంశానికి వ్యతిరేకంగా యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహు ప్రవక్త ద్వారా వచ్చింది. ఎందుకంటే యెహోవా దృష్టిలో అతడు చెడు చేసినందుకు, యరొబాము కుటుంబాన్ని నిర్మూలం చేసినందుకు అతడు యెహోవాకు కోపం రేపాడు.
యూదా రాజైన ఆసా పరిపాలనలోని ఇరవై ఆరవ సంవత్సరంలో బయెషా కుమారుడైన ఏలహు ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు తిర్సాలో రెండేళ్ళు పరిపాలించాడు.
జిమ్రీ సింహాసనం ఎక్కి పరిపాలించడం మొదలుపెట్టగానే అతడు బయెషా కుటుంబం వారందరినీ చంపేశాడు. అతని బంధువుల్లో, మిత్రులలో మగవారిని ఒక్కరిని కూడ వదలకుండా చంపాడు.
యెహోవా యెహు ప్రవక్త ద్వారా ప్రకటించిన వాక్కు ప్రకారం జిమ్రీ బయెషా వంశం అంతటిని నిర్మూలం చేశాడు.
బయెషా అతని కుమారుడైన ఏలహు చేసిన పాపాలన్నిటిని బట్టి, వారు ఇశ్రాయేలుతో చేయించిన పాపాన్ని బట్టి, వారి అయోగ్యమైన విగ్రహాలనుబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం రేపారు.
నీ వంశాన్ని నెబాతు కుమారుడైన యరొబాము వంశంలా, అహీయా కుమారుడైన బయెషా వంశంలా చేస్తాను, ఎందుకంటే నీవు నాకు కోపం రేపావు, ఇశ్రాయేలు పాపం చేయడానికి కారణమయ్యావు’ అని అన్నారు.
నేను నెబాతు కుమారుడైన యరొబాము వంశాన్ని, అహీయా కుమారుడైన బయెషా వంశాన్ని చేసినట్టే, అహాబు వంశాన్ని చేస్తాను.
ఆసా పరిపాలిస్తున్న ముప్పై ఆరవ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా వారి మీదికి వెళ్లి యూదా రాజైన ఆసా సరిహద్దులోనికి రాకపోకలు లేకుండ రామా పట్టణాన్ని పటిష్టం చేశాడు.
అతడు, “నా తండ్రికి నీ తండ్రికి మధ్య ఒప్పందం ఉన్నట్లు, నీకు నాకు మధ్య ఒప్పందం ఉండాలి. చూడు, నేను వెండి బంగారాలను పంపిస్తున్నాను. ఇప్పుడు ఇశ్రాయేలు రాజైన బయెషా నా దగ్గర నుండి వెళ్ళిపోయేలా అతనితో నీ ఒప్పందం తెంచుకో” అని అన్నాడు.
బయెషా ఈ వార్త విని రామాను కట్టించడం మానేసి తన పనిని నిలిపి వేశాడు.
అప్పుడు రాజైన ఆసా యూదా మనుష్యులందరిని సమకూర్చాడు. వారు కూడి వచ్చి, రామా కట్టించడానికి బయెషా ఉపయోగించిన రాళ్లను, కలపను ఎత్తుకుపోయారు. వాటితో ఆసా గెబాను, మిస్పాను కట్టించాడు.