కంటెంట్‌కు వెళ్లండి

Tirzah

13 verses

32.2700, 35.2900 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Tirzah ను ప్రస్తావించే వచనాలు

  1. తిర్సా రాజు ఒక్కడు

  2. అప్పుడు యరొబాము భార్య లేచి బయలుదేరి తిర్సాకు వెళ్లింది. ఆమె గడపలో అడుగుపెట్టిన వెంటనే ఆ బాలుడు చనిపోయాడు.

  3. బయెషా ఈ వార్త విని రామాను కట్టించడం మానేసి తిర్సాకు వెళ్లిపోయాడు.

  4. యూదా రాజైన ఆసా పరిపాలనలోని మూడవ సంవత్సరంలో, అహీయా కుమారుడైన బయెషా తిర్సాలో ఇశ్రాయేలంతటికి రాజయ్యాడు. అతడు ఇరవైనాలుగు సంవత్సరాలు పరిపాలించాడు.

  5. బయెషా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. తిర్సాలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు ఏలహు రాజయ్యాడు.

  6. యూదా రాజైన ఆసా పరిపాలనలోని ఇరవై ఆరవ సంవత్సరంలో బయెషా కుమారుడైన ఏలహు ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు తిర్సాలో రెండేళ్ళు పరిపాలించాడు.

  7. ఏలహు యొక్క రథాలు సగభాగం మీద అధికారి, అతని సేవకులలో ఒకడైన జిమ్రీ, అతని మీద కుట్రపన్నాడు. ఆ సమయంలో ఏలహు, తిర్సాలో అతని గృహనిర్వాహకుడైన అర్సా ఇంట్లో, బాగా త్రాగుతూ ఉన్నాడు.

  8. యూదా రాజైన ఆసా పరిపాలనలోని ఇరవై ఏడవ సంవత్సరంలో జిమ్రీ తిర్సాలో ఏడు రోజులు పరిపాలించాడు. అప్పుడు ఇశ్రాయేలు సైన్యం ఫిలిష్తీయులకు చెందిన గిబ్బెతోను అనే పట్టణం ముట్టడించారు.

  9. అప్పుడు ఒమ్రీ, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులంతా గిబ్బెతోనును విడిచివెళ్లి తిర్సాను ముట్టడించారు.

  10. యూదా రాజైన ఆసా పరిపాలన యొక్క ముప్పై ఒకటవ సంవత్సరంలో ఒమ్రీ ఇశ్రాయేలుకు రాజై పన్నెండు సంవత్సరాల పరిపాలనలో ఆరు సంవత్సరాలు తిర్సాలో పరిపాలన చేశాడు.

  11. అప్పుడు గాదీ కుమారుడైన మెనహేము తిర్సా నుండి బయలుదేరి సమరయకు వచ్చాడు. అతడు సమరయలో యాబేషు కుమారుడైన షల్లూము మీద దాడి చేసి అతన్ని చంపి అతని స్థానంలో రాజయ్యాడు.

  12. ఆ సమయంలో మెనహేము తిర్సా నుండి బయలుదేరి తిప్సహును, ఆ పట్టణంలో ఆ పరిసరాల్లో ఉన్న ప్రజలందరిపై దాడి చేశాడు, ఎందుకంటే వారు తమ తలుపులు తెరవడానికి నిరాకరించారు. అతడు తిప్సహును కొల్లగొట్టాడు, అందులో ఉన్న గర్భవతుల గర్భాలన్నిటిని చీరేశాడు.

  13. నా ప్రియురాలా, నీవు తిర్సా పట్టణంలా అందంగా ఉన్నావు, యెరూషలేములా మనోహరంగా ఉన్నావు, జెండాలు పట్టుకున్న సైన్యంలా గంభీరంగా ఉన్నావు.