Skip to content

Dan

20 verses · 2 known names

ఇలా కూడా పిలుస్తారు: Dan-jaan

33.2400, 35.6500 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Dan ను ప్రస్తావించే వచనాలు

  1. అబ్రాము తన బంధువు బందీగా కొనిపోబడ్డాడు అని విన్నప్పుడు, తన ఇంట్లో పుట్టి శిక్షణ పొందిన 318 మందిని తీసుకుని వారిని దాను వరకు తరిమాడు.

  2. కానీ దాను గోత్రం వారి భూమిని స్వాధీనం చేసుకోవడంలో ఇబ్బంది పడింది, కాబట్టి వారు లెషెము పట్టణంపై దాడి చేసి దానిని స్వాధీనం చేసుకుని, దాని ప్రజలను చంపి అక్కడ స్థిరపడ్డారు. వారు తమ పూర్వికుల పేరు మీదుగా పట్టణానికి దాను అని పేరు పెట్టారు.

  3. దానికి ఇశ్రాయేలు కుమారుడైన దాను అని తమ పూర్వికుడైన దాను పేరు పెట్టారు; మొదట ఆ పట్టణం లాయిషు అని పిలువబడేది.

  4. అప్పుడు ఇశ్రాయేలీయులందరు, దాను నుండి బెయేర్షేబ వరకు ఉన్నవారు, గిలాదు ప్రదేశంలో ఉన్నవారు, అంతా ఏకమై మిస్పా దగ్గర యెహోవా సన్నిధిలో సమావేశమయ్యారు.

  5. కాబట్టి సమూయేలు యెహోవా ప్రవక్తగా స్థిరపడ్డాడని దాను నుండి బెయేర్షేబ వరకు ఇశ్రాయేలీయులందరు గుర్తించారు.

  6. To translate the kingdom from the house of Saul, and to set up the throne of David over Israel and over Judah, from Dan even to Beersheba.

  7. “కాబట్టి నా సలహా ఏంటంటే, దాను నుండి బెయేర్షేబ వరకు సముద్రపు ఇసుకరేణువులంత అసంఖ్యాకంగా ఇశ్రాయేలీయులందరు నీ దగ్గర సమకూడాలి. నీవే స్వయంగా వారిని యుద్ధంలో నడిపించాలి.

  8. కాబట్టి రాజు యోవాబును, అతనితో ఉన్న సైన్యాధిపతులను పిలిచి, “యుద్ధానికి వెళ్లగలిగిన వారి సంఖ్య నాకు తెలిసేలా దాను నుండి బెయేర్షేబ వరకు ఇశ్రాయేలు గోత్రాలన్నిటి దగ్గరకు వెళ్లి జనాభా లెక్క తీసుకురండి” అని చెప్పాడు.

  9. అక్కడినుండి గిలాదు, తహ్తీము హొద్షీ ప్రాంతానికి వచ్చి దానాయాను మీదుగా సీదోనుకు వచ్చారు.

  10. కాబట్టి యెహోవా ఉదయం నుండి నియమించబడిన సమయం పూర్తయ్యే వరకు ఇశ్రాయేలు మీదికి తెగులు రప్పించారు. అప్పుడు దాను నుండి బెయేర్షేబ వరకు డెబ్బైవేలమంది చనిపోయారు.

  11. సొలొమోను జీవితకాలంలో దాను నుండి బెయేర్షేబ వరకు యూదా, ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా, ప్రతి ఒక్కరు తమ సొంత ద్రాక్ష, అంజూర చెట్ల క్రింద నిర్భయంగా నివసించారు.

  12. అతడు ఒకదాన్ని బేతేలులో, ఇంకొక దానిని దానులో పెట్టాడు.

  13. కాని ఇది ఒక పాపంగా మారింది; ప్రజలు బేతేలులో ఉన్నదానిని పూజించారు, దూరమైనా సరే దానుకు వెళ్లి అక్కడ ఉన్నదానిని పూజించారు.

  14. రాజైన ఆసాతో బెన్-హదదు ఏకీభవించి, తన సేనాధిపతులను ఇశ్రాయేలు పట్టణాల మీదికి పంపాడు. అతడు ఈయోను, దాను, ఆబేల్-బేత్-మయకా, కిన్నెరెతు పరిసరాలన్నీ, నఫ్తాలి ప్రదేశమంతా జయించాడు.

  15. అయితే, ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన నెబాతు కుమారుడైన యరొబాము పాపాలు చేస్తూ యెహు బేతేలులో దానులో ఉన్న బంగారు దూడలను పూజించడం మానలేదు.

  16. కాబట్టి దావీదు యోవాబుతో, సైన్యాధిపతులతో, “మీరు వెళ్లి బెయేర్షేబ నుండి దాను వరకు ఉన్న ఇశ్రాయేలీయులను లెక్కించండి. వారి సంఖ్య నాకు తెలిసేలా ఆ వివరాలు నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పాడు.

  17. రాజైన ఆసాతో బెన్-హదదు ఏకీభవించి, తన సేనాధిపతులను ఇశ్రాయేలు పట్టణాల మీదికి పంపాడు. వారు ఈయోను, దాను, ఆబేల్-మయీము, నఫ్తాలి ప్రాంతానికి చేరిన పట్టణాలలోని కొట్లను జయించారు.

  18. ప్రజలంతా యెరూషలేముకు వచ్చి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరుపుకోవాలని బెయేర్షేబ నుండి దాను వరకు ఇశ్రాయేలు అంతటా ప్రకటించాలని వారు నిర్ణయించుకున్నారు. చాలాకాలంగా వ్రాయబడిన ప్రకారం పెద్ద సంఖ్యలో ప్రజలు పండుగ జరుపుకోలేదు.

  19. దాను నుండి ఒక స్వరం, ఎఫ్రాయిం కొండల నుండి కీడు వస్తుందని ప్రకటిస్తుంది.

  20. శత్రువుల గుర్రాల బుసలు కొట్టడం దాను నుండి వినబడుతుంది; వారి మగ గుర్రాల సకిలింపుకు దేశమంతా వణికిపోతుంది. వారు మ్రింగివేయడానికి భూమిని, అందులోని సమస్తాన్ని, పట్టణాన్ని, అందులో నివసించే వారినందరిని మ్రింగివేయడానికి వచ్చారు.