Calf గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
సలహా తీసుకున్న తర్వాత రాజు రెండు బంగారు దూడలను చేయించాడు. అతడు ప్రజలతో, “యెరూషలేముకు వెళ్లడం మీకు చాలా కష్టము. ఇశ్రాయేలీయులారా, మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించిన మీ దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు” అని చెప్పాడు.
అతడు ఒకదాన్ని బేతేలులో, ఇంకొక దానిని దానులో పెట్టాడు.
కాని ఇది ఒక పాపంగా మారింది; ప్రజలు బేతేలులో ఉన్నదానిని పూజించారు, దూరమైనా సరే దానుకు వెళ్లి అక్కడ ఉన్నదానిని పూజించారు.
యరొబాము ఎత్తైన స్థలాల మీద క్షేత్రాలు కట్టించి, లేవీయులు కాకపోయినా సరే, సాధారణ ప్రజలనే యాజకులుగా నియమించాడు.
యూదాలో జరిగిన పండుగలాంటి ఒక పండుగను యరొబాము ఎనిమిదవ నెల పదిహేనవ రోజున ఏర్పాటు చేసి, బలిపీఠం మీద బలులు అర్పించాడు. అలా అతడు బేతేలులో తాను చేయించిన దూడలకు బలి అర్పించుట ద్వార చేశాడు. అంతేకాదు బేతేలులో తాను చేయించిన క్షేత్రాల్లో యాజకులను కూడా నియమించాడు.
తాను స్వయంగా నిర్ణయించిన ప్రకారం ఎనిమిదవ నెల పదిహేనవ రోజు బేతేలులో తాను కట్టించిన బలిపీఠం మీద బలులు అర్పించాడు. కాబట్టి అతడు ఇశ్రాయేలీయుల కోసం పండుగను నిర్ణయించి, ధూపం వేయడానికి బలిపీఠం దగ్గరకు వెళ్లాడు.
యరొబాము బలి అర్పించడానికి బలిపీఠం దగ్గర నిలబడి ఉన్నప్పుడు, యెహోవా వాక్కు ద్వారా ఒక దైవజనుడు యూదా నుండి బేతేలుకు వచ్చాడు.
యెహోవా వాక్కు ప్రకారం అతడు బలిపీఠానికి వ్యతిరేకంగా బిగ్గరగా ఇలా అన్నాడు: “బలిపీఠమా, బలిపీఠమా! యెహోవా చెప్పే మాట ఇదే: ‘దావీదు కుటుంబంలో యోషీయా అనే కుమారుడు జన్మిస్తాడు. అతడు క్షేత్రాల మీద బలులు అర్పించే యాజకులను నీ మీద వధిస్తాడు, మనుష్యుల ఎముకలు నీ మీద కాల్చబడతాయి.’ ”
అదే రోజు ఆ దైవజనుడు ఒక సూచన ఇచ్చాడు: “యెహోవా చెప్పిన సూచన ఇదే: బలిపీఠం బద్దలై దాని మీదున్న బూడిద ఒలికి పోతుంది.”
రాజైన యరొబాము బేతేలులో ఉన్న బలిపీఠం గురించి దైవజనుడు ప్రకటించిన మాట విని, బలిపీఠం మీద నుండి తన చేయి చాపి, “అతన్ని పట్టుకోండి!” అన్నాడు. అయితే అతడు చాపిన చేయి తిరిగి వెనుకకు తీసుకోలేకుండా అది ఎండిపోయింది.
అంతేకాక, యెహోవా వాక్కు ద్వారా దైవజనుడు ఇచ్చిన సూచన ప్రకారం బలిపీఠం బద్దలై దానిమీది నుండి బూడిద ఒలికిపోయింది.
బేతేలులో ఉన్న బలిపీఠాన్ని, ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన నెబాతు కుమారుడైన యరొబాము కట్టిన పూజా స్థలాన్ని కూడా అతడు పడగొట్టాడు. ఆ క్షేత్రాన్ని కాల్చివేసి పొడి చేశాడు, అషేరా స్తంభాన్ని కూడా కాల్చివేశాడు.
అప్పుడు యోషీయా చూడగా ఆ కొండమీద, అతనికి ఆ కొండమీద సమాధులు కనిపించినప్పుడు, అతనికి ఆ సమాధుల్లో నుండి ఎముకలను తీయించి, బలిపీఠాన్ని అపవిత్ర పరచడానికి వాటిని దాని మీద కాల్చివేశాడు. గతంలో దైవజనుడు చాటించిన యెహోవా వాక్కు ప్రకారం ఇది జరిగింది.
రాజు, “నాకు కనిపిస్తున్న ఆ సమాధి రాయి ఏంటి?” అని అడిగాడు. అందుకు ఆ పట్టణస్థులు చెప్పారు, “అది యూదా నుండి వచ్చిన దైవజనుని సమాధి. మీరు బేతేలులో ఉన్న బలిపీఠానికి చేసిన దాని గురించి ప్రకటించింది అతడే” అని చెప్పారు.
యోషీయా, “అది అలాగే ఉంచండి. ఆయన ఎముకలను తీయనీయకండి” అని చెప్పగా వారు అతని ఎముకలను సమరయ నుండి వచ్చిన ప్రవక్త ఎముకలతో పాటు అలానే ఉండనిచ్చారు.
అతడు బేతేలులో ఎలా చేశాడో అలాగే, ఇశ్రాయేలు రాజులు సమరయ పట్టణాల్లో కట్టి యెహోవాకు కోపం రేపిన ఎత్తైన స్థలాల్లో ఉన్న క్షేత్రాలన్నిటినీ యోషీయా తీసివేశాడు.
యోషీయా ఆ క్షేత్రాల పూజారులందరినీ బలిపీఠాల మీద వధించాడు, మనుష్యుల ఎముకలను వాటి మీద కాల్చివేశాడు. తర్వాత అతడు యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.
సమరయా, నీ దూడ విగ్రహాన్ని తీసివేయి! నా కోపం వాటి మీద రగులుకుంది ఎంతకాలం మీరు అపవిత్రులుగా ఉంటారు?
ఆ విగ్రహాలు ఇశ్రాయేలువి! ఈ దూడను కంసాలి తయారుచేశాడు. అది దేవుడు కాదు, ఆ సమరయ దూడ ముక్కలుగా విరగ్గొట్టబడుతుంది.
సమరయలో నివసించే ప్రజలు, బేత్-ఆవెనులో ఉన్న దూడ విగ్రహం గురించి భయపడతారు. దాని ఘనత పోయిందని దాని ప్రజలు దుఃఖపడతారు, దాని వైభవం గురించి ఆనందించిన దాని యాజకులు ఏడుస్తారు.
అది అష్షూరుకు కొనిపోబడి, మహారాజుకు కానుకగా ఇవ్వబడుతుంది. ఎఫ్రాయిం అవమానించబడుతుంది; ఇశ్రాయేలు తాను చేసిన తప్పుడు ఆలోచనలను బట్టి సిగ్గుపడుతుంది.