కంటెంట్‌కు వెళ్లండి

Calf గురించి బైబిల్ వచనాలు: Prophecies against the golden calves at Beth-El

9 వచనాలు · 7 కోణాలు

Prophecies against the golden calves at Beth-El గురించి వచనాలు

  1. యరొబాము బలి అర్పించడానికి బలిపీఠం దగ్గర నిలబడి ఉన్నప్పుడు, యెహోవా వాక్కు ద్వారా ఒక దైవజనుడు యూదా నుండి బేతేలుకు వచ్చాడు.

  2. యెహోవా వాక్కు ప్రకారం అతడు బలిపీఠానికి వ్యతిరేకంగా బిగ్గరగా ఇలా అన్నాడు: “బలిపీఠమా, బలిపీఠమా! యెహోవా చెప్పే మాట ఇదే: ‘దావీదు కుటుంబంలో యోషీయా అనే కుమారుడు జన్మిస్తాడు. అతడు క్షేత్రాల మీద బలులు అర్పించే యాజకులను నీ మీద వధిస్తాడు, మనుష్యుల ఎముకలు నీ మీద కాల్చబడతాయి.’ ”

  3. అదే రోజు ఆ దైవజనుడు ఒక సూచన ఇచ్చాడు: “యెహోవా చెప్పిన సూచన ఇదే: బలిపీఠం బద్దలై దాని మీదున్న బూడిద ఒలికి పోతుంది.”

  4. రాజైన యరొబాము బేతేలులో ఉన్న బలిపీఠం గురించి దైవజనుడు ప్రకటించిన మాట విని, బలిపీఠం మీద నుండి తన చేయి చాపి, “అతన్ని పట్టుకోండి!” అన్నాడు. అయితే అతడు చాపిన చేయి తిరిగి వెనుకకు తీసుకోలేకుండా అది ఎండిపోయింది.

  5. అంతేకాక, యెహోవా వాక్కు ద్వారా దైవజనుడు ఇచ్చిన సూచన ప్రకారం బలిపీఠం బద్దలై దానిమీది నుండి బూడిద ఒలికిపోయింది.

  6. సమరయా, నీ దూడ విగ్రహాన్ని తీసివేయి! నా కోపం వాటి మీద రగులుకుంది ఎంతకాలం మీరు అపవిత్రులుగా ఉంటారు?

  7. ఆ విగ్రహాలు ఇశ్రాయేలువి! ఈ దూడను కంసాలి తయారుచేశాడు. అది దేవుడు కాదు, ఆ సమరయ దూడ ముక్కలుగా విరగ్గొట్టబడుతుంది.

  8. సమరయలో నివసించే ప్రజలు, బేత్-ఆవెనులో ఉన్న దూడ విగ్రహం గురించి భయపడతారు. దాని ఘనత పోయిందని దాని ప్రజలు దుఃఖపడతారు, దాని వైభవం గురించి ఆనందించిన దాని యాజకులు ఏడుస్తారు.

  9. అది అష్షూరుకు కొనిపోబడి, మహారాజుకు కానుకగా ఇవ్వబడుతుంది. ఎఫ్రాయిం అవమానించబడుతుంది; ఇశ్రాయేలు తాను చేసిన తప్పుడు ఆలోచనలను బట్టి సిగ్గుపడుతుంది.