Skip to content

Deborah

9 వచనాలు · 1 కుటుంబ సభ్యుడు

Deborah ను ప్రస్తావించే వచనాలు

  1. ఆ కాలంలో లప్పీదోతు భార్యయైన దెబోరా అనే ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండేది.

  2. ఆమె ఎఫ్రాయిం కొండ సీమలో రామాకు బేతేలుకు మధ్యనున్న దెబోరా ఖర్జూర చెట్టు క్రింద తీర్పులు తీర్చడానికి కూర్చుండేది, ఇశ్రాయేలీయులు వారి వివాదాలు పరిష్కరించుకోడానికి ఆమె దగ్గరకు వచ్చేవారు.

  3. అప్పుడు దెబోరా, “నీతో నేను తప్పకుండా వస్తాను, అయితే నీ ప్రయాణం వలన నీకు ఘనత రాదు, ఎందుకంటే యెహోవా ఒక స్త్రీకి సీసెరాను అప్పగిస్తారు” అని చెప్పి ఆమె బారాకుతో కలిసి కెదెషుకు వెళ్లింది.

  4. బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయులను కెదెషుకు పిలిపించినప్పుడు పదివేలమంది పురుషులు అతనితో వెళ్లారు. దెబోరా కూడా అతనితో వెళ్లింది.

  5. అప్పుడు దెబోరా బారాకుతో, “వెళ్లు! ఈ రోజు యెహోవా నీ చేతికి సీసెరాను అప్పగించారు. యెహోవా నీకు ముందుగా వెళ్లలేదా?” అని అడిగినప్పుడు బారాకు ఆ పదివేలమంది మనుష్యులను వెంటబెట్టుకొని తాబోరు పర్వతం నుండి దిగి వెళ్లాడు.

  6. ఆ రోజు దెబోరా, అబీనోయము కుమారుడైన బారాకు ఈ పాట పాడారు:

  7. ఇశ్రాయేలులో ఉన్న గ్రామస్థులు పోరాడలేరు; దెబోరా అనే నేను లేచేవరకు, ఇశ్రాయేలులో తల్లిగా నేను లేచేవరకు వారు వెనకడుగు వేశారు.

  8. ‘మేలుకో, మేలుకో, దెబోరా! మేలుకో, మేలుకో, కీర్తన పాడు! బారాకూ లే! అబీనోయము కుమారుడా, చెరపట్టిన వారిని చెరపట్టు.’

  9. ఇశ్శాఖారు అధిపతులు దెబోరాతో ఉన్నారు; ఇశ్శాఖారు మనుష్యులు బారాకుతో ఉన్నారు, అతని ఆదేశాన్ని బట్టి లోయలోనికి పంపబడ్డారు. రూబేను ప్రాంతాల్లో తీవ్ర హృదయాన్వేషణ కలిగింది.