Skip to content

The Palm Tree గురించి బైబిల్ వచనాలు

19 వచనాలు · 18 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. తర్వాత వారు ఎలీముకు వచ్చారు. అక్కడ పన్నెండు నీటి ఊటలు డెబ్బై తాటి చెట్లు ఉన్నాయి. వారు ఆ నీటి దగ్గరే బస చేశారు.

  2. మొదటి రోజున మీరు మనోహరమైన చెట్ల కొమ్మలు, తాటి మట్టలు, కాలువల ప్రక్కన ఉండే నిరవంజి చెట్ల కొమ్మలు, ఇతర నిరవంజి చెట్ల కొమ్మలను పట్టుకుని మీ దేవుడైన యెహోవా ఎదుట ఏడు రోజులు ఆనందించండి.

  3. దక్షిణ ప్రాంతాన్ని, ఖర్జూర చెట్ల పట్టణమైన యెరికో లోయ నుండి సోయరు వరకు ఉన్న మొత్తం ప్రాంతాన్ని అతనికి చూపించారు.

  4. కెనీయుడైన మోషే మామ యూదా ప్రజలతో ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదా ఎడారికి వెళ్లి అక్కడ ఉన్నవారితో నివసించారు.

  5. ఆమె ఎఫ్రాయిం కొండ సీమలో రామాకు బేతేలుకు మధ్యనున్న దెబోరా ఖర్జూర చెట్టు క్రింద తీర్పులు తీర్చడానికి కూర్చుండేది, ఇశ్రాయేలీయులు వారి వివాదాలు పరిష్కరించుకోడానికి ఆమె దగ్గరకు వచ్చేవారు.

  6. గర్భాలయంలో, దాని బయట ఉన్న గదుల గోడల మీద అతడు కెరూబులు, ఖర్జూర చెట్లు, విచ్చుకున్న పువ్వులను చెక్కించాడు.

  7. ఒలీవ కర్రతో చేసిన ఆ రెండు తలుపుల మీద అతడు కెరూబులు, ఖర్జూర చెట్లు, విచ్చుకున్న పువ్వులను చెక్కించాడు, ఆ కెరూబుల మీద, చెట్లమీద బంగారంతో పొదిగించాడు.

  8. అతడు తలుపుల మీద కెరూబులు, ఖర్జూర వృక్షాలు, విచ్చుకున్న పువ్వులు చెక్కించి వాటిని బంగారంతో పొదిగించాడు.

  9. అతడు ప్రధాన గదిని దేవదారు పలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారం పొదిగించి, పైభాగాన ఖర్జూరపు చెట్లు, గొలుసుల్లాంటివి చెక్కించాడు.

  10. అలా ఆజ్ఞ జారీచేయడంతోనే ఇశ్రాయేలు ప్రజలు కానుకలు ధారాళంగా ఇచ్చారు. ధాన్యంలో మొదటి పంట, క్రొత్త ద్రాక్షరసంలో, నూనెలో, తేనెలో, పొలంలో పండే వాటిలో, కలిగిన వాటన్నిటిలో పదవ భాగాన్ని వారు తెచ్చారు. అది చాలా పెద్ద మొత్తము.

  11. వెంటనే వారు తమ పట్టణాల్లో యెరూషలేములో ఈ విధంగా ప్రకటించారు: “మీరు పర్వత ప్రాంతానికి వెళ్లి ఒలీవ చెట్ల కొమ్మలు, అడవి ఒలీవ చెట్ల కొమ్మలు, గొంజి చెట్టు కొమ్మలు, ఈత చెట్టు కొమ్మలు, గుబురుగా ఉండే చెట్టు కొమ్మలు తీసుకువచ్చి వ్రాయబడిన విధంగా తాత్కాలిక నివాసాలు నిర్మించాలి.”

  12. నీతిమంతులు తాటి చెట్లలా చిగురు పెడతారు, లెబానోనులో వారు దేవదారు చెట్టులా హుందాగా పెరుగుతారు.

  13. వారు వృద్ధాప్యంలో కూడా సఫలమైన జీవితంలో సారవంతంగా హాయిగా బ్రతుకుతారు,

  14. నీ రూపం తాటి చెట్టులా నీ స్తనములు గెలల్లా ఉన్నాయి.

  15. నేనన్నాను, “నేను తాటి చెట్టు ఎక్కుతాను; దాని ఫలములు పట్టుకుంటాను.” నీ స్తనములు ద్రాక్షవల్లికి ఉండే ద్రాక్ష గెలల్లా ఉండును గాక. నీ శ్వాస యొక్క పరిమళం ఆపిల్ పండ్ల వాసనలా ఉంది.

  16. దోసకాయ పొలంలో దిష్టిబొమ్మలా, వారి విగ్రహాలు మాట్లాడలేవు; అవి నడవలేవు కాబట్టి వాటిని మోయాలి. వాటికి భయపడవద్దు; అవి ఏ హాని చేయలేవు అలాగే ఏ మేలు కూడా చేయలేవు.”

  17. ద్రాక్ష ఎండిపోయింది అంజూర చెట్టు వాడిపోయింది; దానిమ్మ, తాటి చెట్టు, ఆపిల్ పండు చెట్లు, పొలం లోని చెట్లన్నీ ఎండిపోయాయి. ఖచ్చితంగా మనుష్యులకు ఆనందం లేకుండా పోయింది.

  18. ఖర్జూరపు మట్టలు తీసుకుని, “హోసన్నా!” “ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!” “ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక!” అని కేకలువేస్తూ ఆయనను కలుసుకోడానికి వెళ్లారు.

  19. ఈ సంగతుల తర్వాత ఒక గొప్ప జనసమూహం లెక్కపెట్టడానికి అసాధ్యమైనంత మంది ప్రజలు ప్రతి దేశం నుండి, ప్రతి గోత్రం నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి భాష మాట్లాడేవారి నుండి వచ్చారు. వారు తెల్లని వస్త్రాలు ధరించి ఖర్జూర మట్టలు చేతపట్టుకుని సింహాసనం ముందు వధించబడిన గొర్రెపిల్ల ముందు నిలబడి ఉండడం నేను చూశాను.