Skip to content

Leah గురించి బైబిల్ వచనాలు

25 వచనాలు · 5 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. అయితే అతడు రాత్రివేళలో తన కుమార్తె లేయాను యాకోబుకు ఇచ్చాడు, యాకోబు తనతో పడుకున్నాడు.

  2. లాబాను తన దాసి జిల్పాను తన కుమార్తెయైన లేయాకు దాసిగా ఇచ్చాడు.

  3. తెల్లవారినప్పుడు యాకోబు లేచి చూస్తే, అతనితో ఉన్నది లేయా! కాబట్టి యాకోబు లాబానును, “నీవు చేసింది ఏంటి? నేను రాహేలు కోసం నీకు పని చేశాను కదా; నీవు నన్నెందుకు మోసం చేశావు?” అని అడిగాడు.

  4. లాబాను జవాబిస్తూ, “పెద్దకుమార్తెకు ముందు చిన్న కుమార్తెను ఇవ్వడం మా ఆచారం కాదు.

  5. లేయా ప్రేమించబడడం లేదని యెహోవా చూసి, ఆమె గర్భవతి అయ్యేలా ఆయన కరుణించారు, కాని రాహేలు గొడ్రాలిగా ఉంది.

  6. లేయా గర్భవతియై ఒక కుమారునికి జన్మనిచ్చింది. “యెహోవా నా బాధను చూశారు. ఇప్పుడు తప్పకుండ నా భర్త నన్ను ప్రేమిస్తాడు” అని చెప్పి, అతనికి రూబేను అని పేరు పెట్టింది.

  7. ఆమె మళ్ళీ గర్భవతియై కుమారుని కని, “నేను ప్రేమించబడడం లేదని యెహోవా విన్నారు కాబట్టి, ఇతన్ని కూడా నాకు ఇచ్చారు” అని చెప్పి, అతనికి షిమ్యోను అని పేరు పెట్టింది.

  8. లేయా మళ్ళీ గర్భవతియై కుమారుని కని, “నా భర్తకు నేను ముగ్గురు కుమారులను కన్నాను కాబట్టి ఇప్పుడు నన్ను అంటిపెట్టుకుని ఉంటాడు” అని ఆమె అతనికి లేవీ అని పేరు పెట్టింది.

  9. ఆమె మళ్ళీ గర్భవతియై కుమారుని కని, “ఈసారి నేను యెహోవాను స్తుతిస్తాను” అని ఆమె అతనికి యూదా అని పెట్టింది. తర్వాత ఆమె పిల్లలు కనడం ఆగిపోయింది.

  10. లేయా పిల్లలు కనడం ఆగిపోయింది అని గ్రహించినప్పుడు, తన దాసి జిల్పాను యాకోబుకు భార్యగా ఇచ్చింది.

  11. లేయా దాసి జిల్పా యాకోబుకు కుమారున్ని కన్నది.

  12. అప్పుడు లేయా, “ఎంత భాగ్యం!” అని అన్నది. కాబట్టి అతనికి గాదు అని పేరు పెట్టింది.

  13. లేయా దాసి జిల్పా యాకోబుకు మరో కుమారున్ని కన్నది.

  14. అప్పుడు లేయా అన్నది, “నాకు ఎంత సంతోషం! స్త్రీలు నన్ను సంతోషం అని పిలుస్తారు.” కాబట్టి అతనికి ఆషేరు అని పేరు పెట్టింది.

  15. దేవుడు లేయా మనవి విన్నారు, ఆమె గర్భవతియై అయిదవ కుమారున్ని కన్నది.

  16. అప్పుడు లేయా, “నా భర్తకు నా దాసిని ఇచ్చినందుకు దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చారు” అని అన్నది. కాబట్టి అతనికి ఇశ్శాఖారు అని పేరు పెట్టింది.

  17. ఆమె మరోసారి గర్భవతియై ఆరవ కుమారున్ని కన్నది.

  18. అప్పుడు లేయా, “దేవుడు నాకు ప్రశస్తమైన బహుమానం ఇచ్చారు. ఆరుగురు కుమారులను కన్నాను కాబట్టి నా భర్త నన్ను ఘనపరుస్తాడు” అని అన్నది. కాబట్టి అతనికి జెబూలూను అని పేరు పెట్టింది.

  19. కొంతకాలం తర్వాత ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమెకు దీనా అని పేరు పెట్టింది.

  20. అతడు దాసీలు, వారి పిల్లలను ముందు ఉంచి, తర్వాత లేయా తన పిల్లలను, చివరిగా రాహేలును, యోసేపును ఉంచాడు.

  21. అతడు అందరికంటే ముందు వెళ్తూ, తన సోదరున్ని సమీపించే వరకు ఏడుసార్లు సాష్టాంగపడ్డాడు.

  22. అయితే ఏశావు యాకోబును కలవడానికి పరుగెత్తి వెళ్లి అతన్ని హత్తుకున్నాడు; తన చేతులు అతని మెడ మీద వేసి ముద్దు పెట్టుకున్నాడు. వారు ఏడ్చారు.

  23. ఏశావు కళ్ళెత్తి స్త్రీలను, పిల్లలను చూశాడు. “నీతో ఉన్న వీరెవరు?” అని అడిగాడు. యాకోబు, “వీరు నీ సేవకునికి దేవుడు దయతో ఇచ్చిన పిల్లలు” అని జవాబిచ్చాడు.

  24. అప్పుడు ఆ దాసీలు, వారి పిల్లలు వచ్చి అతనికి నమస్కారం చేశారు.

  25. తర్వాత లేయా, ఆమె పిల్లలు వచ్చి నమస్కరించారు. చివరికి యోసేపు, రాహేలు కూడా వచ్చి నమస్కరించారు.