Laban గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
రిబ్కాకు లాబాను అనే సోదరుడు ఉన్నాడు, అతడు వెంటనే నీటిబుగ్గ దగ్గర ఉన్న ఆ వ్యక్తిని కలవడానికి వెళ్లాడు.
లాబాను రిబ్కా ధరించిన ముక్కుపుడక, చేతి కడియాలు చూసి, ఆ వ్యక్తి రిబ్కాతో మాట్లాడినదంతా ఆమె తన వారితో చెప్పినప్పుడు, వెంటనే ఆ వ్యక్తిని కలవడానికి వెళ్లి, ఆ బావి దగ్గర తన ఒంటెలతో నిలబడి ఉండడం చూశాడు.
“యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా, లోపలికి రా, నీవు బయటే ఎందుకు నిలబడ్డావు? నీవు బసచేయడానికి ఇల్లును, ఒంటెలకు స్థలాన్ని సిద్ధం చేశాను” అని అతడు అన్నాడు.
కాబట్టి ఆ వ్యక్తి ఆ ఇంటికి వెళ్లి, ఒంటెల మీది నుండి బరువును దించారు. వాటికి మేత వేశారు, అతనికి, అతనితో ఉన్న మనుష్యులందరికి కాళ్లు కడుక్కోడానికి నీళ్లు ఇచ్చారు.
అతనికి భోజనం వడ్డించారు కాని అతడు, “నేను వచ్చిన పని ఏంటో మీకు చెప్పకుండా నేను తినను” అని అన్నాడు. అందుకు లాబాను, “అయితే చెప్పు” అన్నాడు.
అతడు తన తండ్రి బంధువని, రిబ్కా కుమారుడని రాహేలుతో చెప్పాడు. కాబట్టి ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి తన తండ్రికి చెప్పింది.
తన సోదరి కుమారుడైన యాకోబును గురించిన సమాచారం విన్న వెంటనే, లాబాను అతన్ని కలవడానికి త్వరపడ్డాడు. అతన్ని హత్తుకుని, ముద్దుపెట్టి, తన ఇంటికి తీసుకెళ్లాడు, అక్కడ యాకోబు అన్ని విషయాలు అతనికి చెప్పాడు.
లాబాను అతనితో, “నీవు నా సొంత శరీరం, రక్తం” అన్నాడు. ఒక పూర్తి నెల యాకోబు అతనితో ఉన్న తర్వాత,
లాబాను అతనితో, “నీవు నా బంధువైనంత మాత్రాన ఏమి తీసుకోకుండ నా కోసం పని చేస్తావా? నీకు జీతంగా ఏమి కావాలో చెప్పు” అని అన్నాడు.
లాబానుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు; పెద్దకుమార్తె పేరు లేయా, చిన్న కుమార్తె పేరు రాహేలు.
లేయాకు బలహీనమైన కళ్లు ఉన్నాయి, కాని రాహేలు రూపవతి, అందగత్తె.
యాకోబు రాహేలుతో ప్రేమలో ఉండి, “నీ చిన్న కుమార్తె రాహేలు కోసం నేను నీ దగ్గర ఏడు సంవత్సరాలు సేవ చేస్తాను” అన్నాడు.
లాబాను, “ఆమెను పరాయి మనుష్యునికి ఇవ్వడం కంటే నీకివ్వడం మంచిది. నా దగ్గరే పని చేస్తూ ఉండు” అన్నాడు.
యాకోబు రాహేలు కోసం ఏడు సంవత్సరాలు పని చేశాడు, అయితే తనకు రాహేలు పట్ల ఉన్న ప్రేమను బట్టి అతనికి ఆ ఏడు సంవత్సరాలు కొద్దిరోజులే అనిపించింది.
తర్వాత యాకోబు లాబానుతో, “నా భార్యను నాకు ఇవ్వు, నా గడువు తీరింది. నేను ఆమెతో పడుకుంటాను” అని అన్నాడు.
కాబట్టి లాబాను ఆ ప్రాంత ప్రజలందరినీ సమావేశపరిచి విందు చేశాడు.
అయితే అతడు రాత్రివేళలో తన కుమార్తె లేయాను యాకోబుకు ఇచ్చాడు, యాకోబు తనతో పడుకున్నాడు.
లాబాను తన దాసి జిల్పాను తన కుమార్తెయైన లేయాకు దాసిగా ఇచ్చాడు.
తెల్లవారినప్పుడు యాకోబు లేచి చూస్తే, అతనితో ఉన్నది లేయా! కాబట్టి యాకోబు లాబానును, “నీవు చేసింది ఏంటి? నేను రాహేలు కోసం నీకు పని చేశాను కదా; నీవు నన్నెందుకు మోసం చేశావు?” అని అడిగాడు.
లాబాను జవాబిస్తూ, “పెద్దకుమార్తెకు ముందు చిన్న కుమార్తెను ఇవ్వడం మా ఆచారం కాదు.
లేయాతో వైవాహిక వారం గడువు ముగించు. తర్వాత మరో ఏడు సంవత్సరాలు నా దగ్గర పని చేస్తే రాహేలును కూడా నీకిస్తాను” అని అన్నాడు.
యాకోబు అలాగే చేశాడు. లేయాతో తన వారం ముగించుకున్న తర్వాత లాబాను తన కుమార్తె రాహేలును అతనికి భార్యగా ఇచ్చాడు.
లాబాను తన దాసి బిల్హాను తన కుమార్తెయైన రాహేలుకు దాసిగా ఇచ్చాడు.
యాకోబు రాహేలుతో కూడా పడుకున్నాడు, అతడు లేయాకంటే రాహేలును ఎక్కువ ప్రేమించాడు కాబట్టి అతడు లాబాను కోసం ఇంకా ఏడు సంవత్సరాలు పని చేశాడు.
అయితే లాబాను, “నీకు నాపై దయ ఉంటే, దయచేసి ఉండు. నిన్ను బట్టి యెహోవా నన్ను దీవించారని నేను భవిష్యవాణి ద్వార తెలుసుకున్నాను.