కంటెంట్‌కు వెళ్లండి

Laban గురించి బైబిల్ వచనాలు: Receives the servant of Abraham

5 వచనాలు · 7 కోణాలు

Receives the servant of Abraham గురించి వచనాలు

  1. రిబ్కాకు లాబాను అనే సోదరుడు ఉన్నాడు, అతడు వెంటనే నీటిబుగ్గ దగ్గర ఉన్న ఆ వ్యక్తిని కలవడానికి వెళ్లాడు.

  2. లాబాను రిబ్కా ధరించిన ముక్కుపుడక, చేతి కడియాలు చూసి, ఆ వ్యక్తి రిబ్కాతో మాట్లాడినదంతా ఆమె తన వారితో చెప్పినప్పుడు, వెంటనే ఆ వ్యక్తిని కలవడానికి వెళ్లి, ఆ బావి దగ్గర తన ఒంటెలతో నిలబడి ఉండడం చూశాడు.

  3. “యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా, లోపలికి రా, నీవు బయటే ఎందుకు నిలబడ్డావు? నీవు బసచేయడానికి ఇల్లును, ఒంటెలకు స్థలాన్ని సిద్ధం చేశాను” అని అతడు అన్నాడు.

  4. కాబట్టి ఆ వ్యక్తి ఆ ఇంటికి వెళ్లి, ఒంటెల మీది నుండి బరువును దించారు. వాటికి మేత వేశారు, అతనికి, అతనితో ఉన్న మనుష్యులందరికి కాళ్లు కడుక్కోడానికి నీళ్లు ఇచ్చారు.

  5. అతనికి భోజనం వడ్డించారు కాని అతడు, “నేను వచ్చిన పని ఏంటో మీకు చెప్పకుండా నేను తినను” అని అన్నాడు. అందుకు లాబాను, “అయితే చెప్పు” అన్నాడు.