Skip to content

Michmash

9 verses

31.8700, 35.2700 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Michmash ను ప్రస్తావించే వచనాలు

  1. సౌలు ఇశ్రాయేలీయులలో మూడువేలమందిని ఏర్పరచుకున్నాడు. వీరిలో రెండువేలమంది మిక్మషులో బేతేలు కొండ ప్రాంతంలో సౌలు దగ్గర ఉన్నారు; మిగిలిన వేయిమంది బెన్యామీనీయుల ఊరైన గిబియాలో యోనాతాను దగ్గర ఉన్నారు. మిగిలినవారిని వారి గుడారాలకు పంపివేశాడు.

  2. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి మూడువేల రథాలు, ఆరువేల గుర్రపురౌతులు, సముద్రపు ఒడ్డున ఉండే ఇసుక రేణువులంత విస్తారమైన సైనికులను సమకూర్చుకున్నారు. వీరు బయలుదేరి బేత్-ఆవెనుకు తూర్పున ఉన్న మిక్మషులో శిబిరం ఏర్పరచుకున్నారు.

  3. అయితే సమూయేలు అతన్ని, “నీవు చేసిన పని ఏమిటి?” అని అడిగాడు. అందుకు సౌలు, “నిర్ణయించిన సమయానికి నీవు రాకపోవడం, ప్రజలు నా దగ్గర నుండి చెదిరిపోవడం, ఫిలిష్తీయులు మిక్మషులో సమావేశమవ్వడం చూసి,

  4. సౌలు అతని కుమారుడైన యోనాతాను, వారితో ఉన్న ప్రజలతో కలిసి బెన్యామీనీయుల గెబాలో ఉన్నారు; ఫిలిష్తీయులు మిక్మషులో శిబిరం ఏర్పరచుకున్నారు.

  5. ఫిలిష్తీయుల సైన్యపు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చారు.

  6. మిక్మషుకు ఉత్తరం వైపు ఒక కొండ శిఖరం, గెబాకు దక్షిణం వైపు రెండవ కొండ శిఖరం ఉన్నాయి.

  7. ఆ రోజు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను మిక్మషు నుండి అయ్యాలోను వరకు చంపి చాలా అలసిపోయారు.

  8. గెబాలో స్థిరపడిన బెన్యామీనీయులు మిక్మషులో, అయ్యాలో, బేతేలు వాటి చుట్టుప్రక్కల గ్రామాల్లో,

  9. అష్షూరీయులు ఆయాతులో ప్రవేశించారు; మిగ్రోను గుండా వెళ్లారు; మిక్మషులో తమ సామాను ఉంచారు.