కంటెంట్‌కు వెళ్లండి

Jerusalem

753 verses · 2 known names

ఇలా కూడా పిలుస్తారు: Jerusalem's

31.7700, 35.2300 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Jerusalem ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నీ సేవకుడు అరాములోని గెషూరులో ఉన్నప్పుడు, ‘ఒకవేళ యెహోవా నన్ను తిరిగి యెరూషలేముకు తీసుకెళ్తే నేను హెబ్రోనులో యెహోవాను ఆరాధిస్తాను’ అని మ్రొక్కుబడి చేశాను” అని మనవి చేశాడు.

  2. యెరూషలేము నుండి 200 మంది పురుషులు అబ్షాలోముతో పాటు వచ్చారు. అతడు వారిని అతిథులుగా రమ్మని పిలిచినప్పుడు, వారు విషయం తెలియక అమాయకంగా వెళ్లారు.

  3. దావీదు తనతో పాటు యెరూషలేములో ఉన్న తన అధికారులందరితో, “రండి, మనం పారిపోవాలి, లేకపోతే అబ్షాలోము నుండి మనలో ఎవరమూ తప్పించుకోలేము. మనం వెంటనే వెళ్లిపోవాలి లేదంటే అతడు త్వరగా వచ్చి మనలను పట్టుకుని మనలను మన పట్టణాన్ని ఖడ్గంతో నాశనం చేస్తాడు” అని చెప్పాడు.

  4. కాబట్టి సాదోకు అబ్యాతారులు దేవుని మందసాన్ని యెరూషలేముకు తిరిగి తీసుకెళ్లి అక్కడే ఉండిపోయారు.

  5. కాబట్టి అబ్షాలోము యెరూషలేముకు వస్తున్నప్పుడే దావీదు స్నేహితుడైన హూషై పట్టణానికి తిరిగి వెళ్లాడు.

  6. అప్పుడు రాజు, “నీ యజమాని మనుమడు ఎక్కడున్నాడు?” అని అడిగాడు. అందుకు సీబా రాజుతో, “ఈ రోజు ఇశ్రాయేలీయులు మా తాత రాజ్యాన్ని నాకు తిరిగి ఇస్తారనుకుని అతడు యెరూషలేములోనే ఉన్నాడు” అని జవాబిచ్చాడు.

  7. ఇంతలో అబ్షాలోము ఇశ్రాయేలు వారందరు యెరూషలేముకు వచ్చారు. అహీతోపెలు కూడా అతనితో ఉన్నాడు.

  8. తర్వాత అబ్షాలోము మనుష్యులు ఆ ఇంటి దగ్గరకు వచ్చి, “అహిమయస్సు, యోనాతానులు ఎక్కడ ఉన్నారు?” అని ఆమెను అడిగారు. అందుకామె, “వారు ఆ వాగు దాటి వెళ్లారు” అని చెప్పింది. ఆ మనుష్యులు వెదికారు గాని ఎవ్వరూ కనబడలేదు, కాబట్టి వారు యెరూషలేముకు తిరిగి వెళ్లారు.

  9. “నా రాజా! నేను చేసిన దాని బట్టి నా మీద నేరం మోపవద్దు. నా ప్రభువు రాజువైన నీవు యెరూషలేము విడిచివెళ్తున్నప్పుడు నేను చేసిన తప్పును జ్ఞాపకం చేసుకోవద్దు. దానిని మనస్సులో ఉంచుకోవద్దు.

  10. దావీదును కలుసుకోవటానికి అతడు యెరూషలేముకు వచ్చినప్పుడు రాజు, “మెఫీబోషెతూ, నీవు నాతో కూడా ఎందుకు వెళ్లలేదు?” అని అతన్ని అడిగాడు.

  11. రాజు, “నాతో పాటు నది దాటి యెరూషలేములో నా దగ్గరే ఉండిపో, నేను నిన్ను పోషిస్తాను” అని బర్జిల్లయితో చెప్పాడు.

  12. అందుకు బర్జిల్లయి రాజుతో, “రాజైన నీతో కూడా యెరూషలేము వచ్చి అక్కడ ఉండడానికి నేనెంతకాలం బ్రతుకుతాను.

  13. కాబట్టి ఇశ్రాయేలు వారంతా దావీదును విడిచిపెట్టి బిక్రి కుమారుడైన షేబను వెంబడించారు. కాని యూదావారైతే యొర్దాను నుండి యెరూషలేము వరకు తమ రాజు దగ్గరే ఉండిపోయారు.

  14. రాజైన దావీదు యెరూషలేములో తన భవనానికి వచ్చి ఆ భవనాన్ని చూసుకోవడానికి ఉంచిన పదిమంది ఉంపుడుగత్తెలను తీసుకెళ్లి కాపలా ఉన్న ఇంట్లో పెట్టి వారిని పోషించాడు కాని వారితో ఎలాంటి లైంగిక సంబంధం పెట్టుకోలేదు. వారు చచ్చే వరకు విధవరాండ్రుగా జీవించారు.

  15. కాబట్టి యోవాబు మనుష్యులు కెరేతీయులు పెలేతీయులు యుద్ధ వీరులందరు అబీషై నాయకత్వంలో యెరూషలేము నుండి బయలుదేరి బిక్రి కుమారుడైన షేబను వెంటాడటానికి వెళ్లారు.

  16. ఆమె వెళ్లి, తాను తెలివిగా యోవాబుతో మాట్లాడిన మాటలు పట్టణ ప్రజలకు చెప్పినప్పుడు వారు బిక్రి కుమారుడైన షేబ తల నరికి యోవాబు దగ్గర పడవేశారు. వెంటనే అతడు బూరధ్వని చేశాడు. అతని మనుష్యులందరు ఆ పట్టణాన్ని విడిచిపెట్టి ఎవరి ఇళ్ళకు వారు వెళ్లిపోయారు. యోవాబు యెరూషలేములో ఉన్న రాజు దగ్గరకు తిరిగి వెళ్లాడు.

  17. ఇలా వారు దేశమంతా తిరిగి తొమ్మిది నెలల ఇరవై రోజులకు యెరూషలేముకు చేరుకున్నారు.

  18. యెరూషలేమును నాశనం చేయడానికి దేవదూత చేయి చాపినప్పుడు జరిగిన కీడుకు యెహోవా మనస్సు కరిగి ప్రజలను నాశనం చేస్తున్న దూతతో, “ఇక చాలు! నీ చేయి వెనుకకు తీసుకో” అని చెప్పారు. అప్పుడు యెహోవా దూత యెబూసీయుడైన అరౌనాకు చెందిన నూర్పిడి కళ్ళం దగ్గర ఉన్నాడు.

  19. దావీదు ఇశ్రాయేలును నలభై సంవత్సరాలు పరిపాలించాడు. హెబ్రోనులో ఏడు సంవత్సరాలు, యెరూషలేములో ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించాడు.

  20. తర్వాత రాజు షిమీని పిలిపించి అతనితో, “నీకోసం యెరూషలేములో ఇల్లు కట్టుకుని అక్కడ నివసించు, ఇంకెక్కడికీ వెళ్లకు.

  21. షిమీ రాజుతో, “మీరు చెప్పింది మంచిది, మీ దాసుడననైన నేను నా ప్రభువైన రాజు చెప్పినట్లు చేస్తాను” అన్నాడు. కాబట్టి షిమీ యెరూషలేములో కొంతకాలం నివసించాడు.

  22. షిమీ యెరూషలేము నుండి గాతుకు వెళ్లి, తిరిగివచ్చిన సంగతి సొలొమోనుకు తెలిసినప్పుడు,

  23. సొలొమోను ఈజిప్టు రాజైన ఫరోతో పొత్తు పెట్టుకుని అతని కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు. అతడు తన సొంత రాజభవనాన్ని, యెహోవాకు దేవాలయాన్ని, యెరూషలేము చుట్టూ ప్రాకారం నిర్మించే వరకు ఆమెను దావీదు పట్టణానికి తీసుకువచ్చాడు.

  24. తర్వాత సొలొమోను మేల్కొని, అది కల అని గ్రహించాడు. అతడు యెరూషలేముకు తిరిగివెళ్లి, యెహోవా నిబంధన మందసం ఎదుట నిలబడి, దహనబలులు, సమాధానబలులు అర్పించాడు. తర్వాత తన సేవకులందరికి విందు చేశాడు.

  25. అప్పుడు రాజైన సొలొమోను దావీదు పట్టణమైన సీయోను నుండి యెహోవా నిబంధన మందసాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలు పెద్దలను, గోత్రాల పెద్దలను, ఇశ్రాయేలీయుల కుటుంబాల నాయకులందరిని యెరూషలేములో తన దగ్గరకు పిలిపించాడు.