circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
ఈ కాలపు వచనాలు
- 1 దినవృత్తాంతములు 11:42సుమారు క్రీ.పూ. 1055
రూబేనీయుడైన షీజా కుమారుడు రూబేనీయులకు పెద్దయైన అదీనా, అతనితో ఉన్న ముప్పైమంది,
- 1 దినవృత్తాంతములు 11:43సుమారు క్రీ.పూ. 1055
మయకా కుమారుడైన హానాను, మిత్నీయుడైన యెహోషాపాతు,
- 1 దినవృత్తాంతములు 11:44సుమారు క్రీ.పూ. 1055
ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా, అరోయేరీయుడైన హోతాము కుమారులైన షామా, యెహీయేలు,
- 1 దినవృత్తాంతములు 11:45సుమారు క్రీ.పూ. 1055
షిమ్రీ కుమారుడైన యెదీయవేలు, అతని సోదరుడు తిజీయుడైన యోహా,
- 1 దినవృత్తాంతములు 11:46సుమారు క్రీ.పూ. 1055
మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కుమారులైన యెరీబై యోషవ్యా, మోయాబీయుడైన ఇత్మా,
- 1 దినవృత్తాంతములు 11:47సుమారు క్రీ.పూ. 1055
ఎలీయేలు, ఓబేదు, మెజోబాయా వాడైన యయశీయేలు.
కీషు కుమారుడైన సౌలు దగ్గర నుండి బహిష్కరించబడి దావీదు సిక్లగులో ఉన్నప్పుడు అతని దగ్గరకు వచ్చినవారు వీరు (అతనికి యుద్ధంలో సహాయపడిన వీరులలో ఉన్నవారు;
వీరు బాణాలు ధరించి కుడిచేతితో ఎడమచేతితో బాణాలు వేయడంలో, వడిసెలతో రాళ్లు రువ్వడంలో సమర్థులు; వీరు బెన్యామీను గోత్రం నుండి వచ్చిన సౌలు బంధువులు):
నాయకుడైన అహీయెజెరు, యోవాషు; వీరు గిబియోనీయుడైన షెమాయా కుమారులు; అజ్మావెతు కుమారులైన యెజీయేలు, పెలెటు; బెరాకా, అనాతోతీయుడైన యెహు,
ముప్పైమందిలో పరాక్రమశాలి, ముప్పైమందికి నాయకుడు, గిబియోనీయుడైన ఇష్మయా; యిర్మీయా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీయుడైన యోజాబాదు,
ఎలూజై, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, హరీపీయుడైన షెఫట్యా;
కోరహీయులైన ఎల్కానా, యెష్షీయా, అజరేలు, యోహెజెరు, యషోబీము;
గెదోరు వాడైన యెరోహాము కుమారులైన యోహేలా, జెబద్యా.
కొంతమంది గాదీయులు తమ కూటమిని మార్చుకొని అరణ్యంలో సురక్షితమైన స్థలంలో ఉన్న దావీదు దగ్గర చేరారు. వారు పరాక్రమశాలులు, యుద్ధానికి సిద్ధపడినవారు, డాలు ఈటెలను వాడే సమర్థులు, వారు సింహం ముఖంలాంటి ముఖాలు కలిగి కొండల్లో ఉండే జింకలంత వేగంగా పరుగెత్తగలరు.
వారెవరంటే, నాయకుడైన ఏజెరు, రెండవవాడు ఓబద్యా, మూడవవాడు ఏలీయాబు,
నాలుగవవాడు మిష్మన్నా, అయిదవవాడు యిర్మీయా,
ఆరవవాడు అత్తయి, ఏడవవాడు ఎలీయేలు,
ఎనిమిదవ వాడు యోహానాను, తొమ్మిదవ వాడు ఎల్జాబాదు,
పదవ వాడు యిర్మీయా, పదకొండవ వాడు మక్బన్నయి.
ఈ గాదీయులు సైన్యాధిపతులు; వీరిలో చివరివాడు వందమందికి, అత్యధికుడు వెయ్యిమందికి అధిపతులుగా ఉన్నారు.
యొర్దాను నది గట్లమీదుగా పొర్లి పారుతున్నప్పుడు, మొదటి నెలలో దానిని దాటి వెళ్లి లోయల్లో తూర్పు నుండి పడమర వరకు ఉన్నవారినందరిని తరిమివేసింది వీరే.
ఇతర బెన్యామీనీయులు, కొంతమంది యూదా వారు కూడా దావీదు ఉన్న సురక్షిత స్థలానికి వచ్చారు.
దావీదు వారిని కలుసుకోడానికి బయలుదేరి వెళ్లి వారితో, “మీరు సమాధానంతో నాకు సహాయం చేయడానికి నా దగ్గరకు వస్తే, మిమ్మల్ని నాతో చేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే నా వలన మీకు ప్రమాదమేమి లేదని తెలుసుకుని మీరు నన్ను శత్రువులకు అప్పగించడానికి వచ్చి ఉంటే, మన పూర్వికుల దేవుడు దానిని చూసి మీకు తీర్పు తీర్చును గాక” అన్నాడు.
అప్పుడు ముప్పైమందికి నాయకుడైన అమాశై మీదికి ఆత్మ రాగా అతడు అన్నాడు: “దావీదూ, మేము నీ వారము! యెష్షయి కుమారుడా! మేము నీతో ఉన్నాము. నీకు సమాధానం, సమాధానం, నీ సహాయకులకు సమాధానం కలుగును, నీ దేవుడే నీకు సహాయం చేస్తారు.” కాబట్టి దావీదు వారిని చేర్చుకొని తన బలగాలకు నాయకులుగా నియమించాడు.
సౌలు మీద యుద్ధం చేయడానికి ఫిలిష్తీయులతో పాటు దావీదు బయలుదేరినప్పుడు, మనష్షే గోత్రంలోని కొంతమంది అతని పక్షం చేరారు. (దావీదు అతని మనుష్యులు ఫిలిష్తీయులకు సహాయం చేయలేదు, ఎందుకంటే ఫిలిష్తీయుల నాయకులు, “అతడు మళ్ళీ తన యజమానియైన సౌలు పక్షం చేరితే మనకు ప్రాణాపాయం కలుగుతుంది” అని భావించి దావీదును పంపివేశారు.)