- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
ఈ కాలపు వచనాలు
దావీదు సిక్లగుకు వెళ్లినప్పుడు దావీదు దగ్గర చేరిన మనష్షే గోత్రికులు వీరు: వేయిమంది సైన్యానికి అధిపతులైన అద్నా యోజాబాదు, యెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెతై.
వారందరు పరాక్రమశాలులు కాబట్టి దావీదు సైన్యంలో అధిపతులుగా ఉండి దోపిడి మూకలను ఎదుర్కోడానికి దావీదుకు సహాయం చేశారు.
ప్రతిరోజు దావీదుకు సహాయం చేయడానికి మనుష్యులు వస్తుండడంతో, అతని సైన్యం దేవుని సైన్యంవలె మహా సైన్యంగా మారింది.
- 1 దినవృత్తాంతములు 12:23సుమారు క్రీ.పూ. 1048
యెహోవా చెప్పినట్లు, సౌలు రాజ్యాన్ని దావీదు వశం చేయడానికి హెబ్రోనులో అతని దగ్గరకు ఆయుధాలు ధరించి వచ్చిన యుద్ధవీరుల లెక్కలు ఇవే:
- 1 దినవృత్తాంతములు 12:24సుమారు క్రీ.పూ. 1048
యూదా వారిలో డాలు, ఈటె పట్టుకుని యుద్ధానికి సిద్ధపడినవారు 6,800 మంది;
- 1 దినవృత్తాంతములు 12:25సుమారు క్రీ.పూ. 1048
షిమ్యోనీయులలో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న వీరులు 7,100 మంది;
- 1 దినవృత్తాంతములు 12:26సుమారు క్రీ.పూ. 1048
లేవీయులలో 4,600 మంది,
- 1 దినవృత్తాంతములు 12:27సుమారు క్రీ.పూ. 1048
అహరోను కుటుంబానికి నాయకుడైన యెహోయాదా, అతనితో ఉన్న 3,700 మంది,
- 1 దినవృత్తాంతములు 12:28సుమారు క్రీ.పూ. 1048
పరాక్రమవంతుడైన సాదోకు అనే యువకునితో పాటు అతని కుటుంబానికి చెందిన అధిపతులు 22 మంది;
- 1 దినవృత్తాంతములు 12:29సుమారు క్రీ.పూ. 1048
సౌలు గోత్రమైన బెన్యామీనీయులలో 3,000 మంది, అప్పటివరకు వారిలో చాలామంది సౌలు ఇంటికి నమ్మకంగా ఉన్నవారు;
- 1 దినవృత్తాంతములు 12:30సుమారు క్రీ.పూ. 1048
ఎఫ్రాయిం నుండి తమ వంశాలలో పేరు పొందిన పరాక్రమశాలులైన 20,800 మంది;
- 1 దినవృత్తాంతములు 12:31సుమారు క్రీ.పూ. 1048
మనష్షే అర్థగోత్రం నుండి, దావీదును రాజుగా చేయడానికి రావాలని పేరుపేరున నియమించబడినవారు 18,000 మంది;
- 1 దినవృత్తాంతములు 12:32సుమారు క్రీ.పూ. 1048
ఇశ్శాఖారీయుల్లో సమయోచిత జ్ఞానం కలిగి, ఇశ్రాయేలీయులు ఏం చేయాలో తెలిసిన 200 మంది అధిపతులు, వారి ఆజ్ఞకు లోబడి ఉండే వారి బంధువులందరు;
- 1 దినవృత్తాంతములు 12:33సుమారు క్రీ.పూ. 1048
జెబూలూనీయులలో అన్ని రకాల యుద్ధ ఆయుధాలు ధరించి యుద్ధానికి వెళ్లగలిగిన యుద్ధ నైపుణ్యం కలవారు, దావీదుకు నమ్మకంగా ఉండి యుద్ధం చేయగలవారు 50,000 మంది;
- 1 దినవృత్తాంతములు 12:34సుమారు క్రీ.పూ. 1048
నఫ్తాలీయులలో 1,000 అధికారులు, వారితో పాటు డాలు, ఈటె పట్టుకున్నవారు 37,000 మంది;
- 1 దినవృత్తాంతములు 12:35సుమారు క్రీ.పూ. 1048
దానీయులలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారు 28,600 మంది;
- 1 దినవృత్తాంతములు 12:36సుమారు క్రీ.పూ. 1048
ఆషేరీయులలో నైపుణ్యం కలిగి యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారు 40,000 మంది;
- 1 దినవృత్తాంతములు 12:37సుమారు క్రీ.పూ. 1048
ఇంకా యొర్దాను నది తూర్పున ఉండే రూబేనీయులలో, గాదీయులలో, మనష్షే అర్ధగోత్రపు వారిలో అన్ని రకాల ఆయుధాలను ధరించగలిగిన వారు 1,20,000 మంది.
- 1 దినవృత్తాంతములు 12:38సుమారు క్రీ.పూ. 1048
ఈ వీరులందరు సైన్యంలో పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వీరంతా హృదయంలో దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా చేయాలని సంపూర్ణంగా తీర్మానించుకొని ఆయుధాలు ధరించి హెబ్రోనుకు వచ్చారు. ఇశ్రాయేలులో మిగిలిన వారందరూ దావీదును రాజుగా చేయాలని ఏకమనస్సుతో కోరుకున్నారు.
- 1 దినవృత్తాంతములు 12:39సుమారు క్రీ.పూ. 1048
వారి కుటుంబాలు వారి కోసం భోజనపదార్థాలు సిద్ధం చేశారు, కాబట్టి వారు అక్కడే తిని త్రాగి దావీదుతో పాటు మూడు రోజులు ఉన్నారు.
- 1 దినవృత్తాంతములు 12:40సుమారు క్రీ.పూ. 1048
ఇశ్రాయేలీయులు సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇశ్శాఖారు, జెబూలూను, నఫ్తాలి సరిహద్దు ప్రాంతాల నుండి వారి పొరుగువారు గాడిదలు, ఒంటెలు, కంచరగాడిదలు, ఎడ్ల మీద ఆహారపదార్థాలు తీసుకువచ్చారు. వాటిలో పిండి వంటకాలు, అంజూర పండ్ల ముద్దలు, ద్రాక్షపండ్ల ముద్దలు, ద్రాక్షరసం, ఒలీవనూనె, పశువులు, గొర్రెలు సమృద్ధిగా ఉన్నాయి.
దావీదు వేయిమందికి వందమందికి అధిపతులుగా ఉన్నవారందరిని సంప్రదించాడు.
తర్వాత అతడు ఇశ్రాయేలు సమాజమంతటితో, “ఈ ఆలోచన మీకు మంచిదనిపిస్తే, ఇది మన దేవుడైన యెహోవా చిత్తమైతే, ఇశ్రాయేలు దేశమంతటా మిగిలి ఉన్న మన ప్రజలందరు, అలాగే వారి పట్టణాల్లో పచ్చిక మైదానాల్లో వారితో పాటు ఉంటున్న యాజకులు, లేవీయులు వచ్చి మనతో చేరాలని వారికి కబురు పంపండి.
మన దేవుని నిబంధన మందసాన్ని తిరిగి తీసుకువద్దాము. సౌలు పాలనలో దాని విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నాం” అన్నాడు.
సమాజమంత దీనికి అంగీకరించింది, ఎందుకంటే వారందరికి అది మంచిదనిపించింది.