కంటెంట్‌కు వెళ్లండి

circa 1010–970 BC

The Reign of David

David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.

1,230 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 1 దినవృత్తాంతములు 14:16సుమారు క్రీ.పూ. 1047

    కాబట్టి దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లే దావీదు చేశాడు, వారు గిబియోను నుండి గెజెరు వరకు ఫిలిష్తీయుల సైన్యాన్ని తరుముతూ వారిని హతం చేశారు.

  2. 1 దినవృత్తాంతములు 14:17సుమారు క్రీ.పూ. 1047

    కాబట్టి దావీదు కీర్తి అన్ని దేశాలకు వ్యాపించింది. యెహోవా ఇతర దేశాలన్నీ అతనికి భయపడేలా చేశారు.

  3. 1 దినవృత్తాంతములు 15:1సుమారు క్రీ.పూ. 1042

    దావీదు తన కోసం దావీదు పట్టణంలో భవనాలు కట్టించుకున్న తర్వాత, అతడు దేవుని మందసం కోసం ఒక స్థలాన్ని సిద్ధపరచి దాని కోసం గుడారం వేయించాడు.

  4. 1 దినవృత్తాంతములు 15:2సుమారు క్రీ.పూ. 1042

    తర్వాత దావీదు, “దేవుని మందసాన్ని మోయడానికి నిత్యంగా తనకు సేవ చేయడానికి యెహోవా లేవీయులను ఎన్నుకున్నారు కాబట్టి వారు తప్ప ఇంకెవరు యెహోవా మందసాన్ని మోయకూడదు” అని చెప్పాడు.

  5. 1 దినవృత్తాంతములు 15:3సుమారు క్రీ.పూ. 1042

    యెహోవా మందసాన్ని తాను సిద్ధపరచిన స్థలానికి తీసుకురావడానికి దావీదు ఇశ్రాయేలీయులందరిని యెరూషలేములో సమావేశపరిచాడు.

  6. 1 దినవృత్తాంతములు 15:4సుమారు క్రీ.పూ. 1042

    అప్పుడు అహరోను వారసులను, లేవీయులను పిలిపించాడు, వారు వీరే:

  7. 1 దినవృత్తాంతములు 15:5సుమారు క్రీ.పూ. 1042

    కహాతు వారసులలో నుండి, వారి నాయకుడైన ఊరియేలు, అతని బంధువుల్లో 120 మంది;

  8. 1 దినవృత్తాంతములు 15:6సుమారు క్రీ.పూ. 1042

    మెరారి వారసులలో నుండి వారి నాయకుడైన అశాయాను, అతని బంధువుల్లో 220 మంది;

  9. 1 దినవృత్తాంతములు 15:7సుమారు క్రీ.పూ. 1042

    గెర్షోను వారసులలో నుండి వారి నాయకుడైన యోవేలు, అతని బంధువుల్లో 130 మంది;

  10. 1 దినవృత్తాంతములు 15:8సుమారు క్రీ.పూ. 1042

    ఎలీషాపాను వారసులలో నుండి వారి నాయకుడైన షెమయా, అతని బంధువుల్లో 200 మంది;

  11. 1 దినవృత్తాంతములు 15:9సుమారు క్రీ.పూ. 1042

    హెబ్రోను వారసులలో నుండి వారి నాయకుడైన ఎలీయేలు, అతని బంధువుల్లో 80 మంది;

  12. 1 దినవృత్తాంతములు 15:10సుమారు క్రీ.పూ. 1042

    ఉజ్జీయేలు వారసులలో నుండి వారి నాయకుడైన అమ్మీనాదాబు, అతని బంధువుల్లో 112 మంది.

  13. 1 దినవృత్తాంతములు 15:11సుమారు క్రీ.పూ. 1042

    తర్వాత దావీదు యాజకులైన సాదోకు అబ్యాతారులను, లేవీయులైన ఊరియేలు, అశాయాను, యోవేలు, షెమయాను, ఎలీయేలు, అమ్మీనాదాబులను పిలిపించాడు.

  14. 1 దినవృత్తాంతములు 15:12సుమారు క్రీ.పూ. 1042

    అతడు వారితో ఇలా అన్నాడు, “మీరు లేవీయుల కుటుంబ పెద్దలు; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసాన్ని, నేను సిద్ధపరచిన స్థలానికి తీసుకురావడానికి మీరు, మీ బంధువులు, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి.

  15. 1 దినవృత్తాంతములు 15:13సుమారు క్రీ.పూ. 1042

    లేవీయులైన మీరు ఇంతకుముందు మన దేవుడైన యెహోవా మందసాన్ని మోయలేదు కాబట్టి మన దేవుడైన యెహోవా కోపంతో మనమీద విరుచుకుపడ్డారు. మనం ఎలా చేయాలో నియమించబడిన విధానం ప్రకారం ఆయనను అడగలేదు.”

  16. 1 దినవృత్తాంతములు 15:14సుమారు క్రీ.పూ. 1042

    అప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసాన్ని తీసుకురావడానికి యాజకులు, లేవీయులు తమను తాము ప్రతిష్ఠించుకున్నారు.

  17. 1 దినవృత్తాంతములు 15:15సుమారు క్రీ.పూ. 1042

    యెహోవా చెప్పిన మాట ప్రకారం మోషే ఆజ్ఞాపించినట్లు లేవీయులు దేవుని మందసాన్ని దాని మోతకర్రలతో తమ భుజాల మీదికి ఎత్తుకున్నారు.

  18. 1 దినవృత్తాంతములు 15:16సుమారు క్రీ.పూ. 1042

    తమ తోటి లేవీయులను సితారలు, వీణలు, తాళాలు మొదలైన వాయిద్యాలతో సంతోషకరమైన ధ్వని చేయమని సంగీతకారులుగా నియమించమని లేవీ నాయకులకు దావీదు ఆదేశించాడు.

  19. 1 దినవృత్తాంతములు 15:17సుమారు క్రీ.పూ. 1042

    కాబట్టి లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును నియమించారు; అతని బంధువుల్లో బెరెక్యా కుమారుడైన ఆసాపు; వారి బంధువులైన మెరారీయులలో కూషాయాహు కుమారుడైన ఏతాను;

  20. 1 దినవృత్తాంతములు 15:18సుమారు క్రీ.పూ. 1042

    వారితో పాటు రెండవ వరుసలో ఉన్న తమ బంధువులు: జెకర్యా, బేను, యహజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, బెనాయా, మయశేయా, మత్తిత్యా, ఎలీఫెలెహు, మిక్నేయాహులు, ద్వారపాలకులైన ఓబేద్-ఎదోము, యెహీయేలు.

  21. 1 దినవృత్తాంతములు 15:19సుమారు క్రీ.పూ. 1042

    సంగీతకారులైన హేమాను, ఆసాపు, ఏతానులు ఇత్తడి తాళాలను వాయించాలి;

  22. 1 దినవృత్తాంతములు 15:20సుమారు క్రీ.పూ. 1042

    జెకర్యా, అజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, మయశేయా, బెనాయాలు అలామోతు శైలిలో వీణలు వాయించాలి,

  23. 1 దినవృత్తాంతములు 15:21సుమారు క్రీ.పూ. 1042

    మత్తిత్యా, ఎలీఫెలెహు, మిక్నేయాహు, ఓబేద్-ఎదోము, యెహీయేలు, అజజ్యాహులు షెమినిత్ సితారలు వాయించాలి.

  24. 1 దినవృత్తాంతములు 15:22సుమారు క్రీ.పూ. 1042

    లేవీయుల నాయకుడైన కెనన్యా సంగీత నిర్వహణలో నైపుణ్యత గలవాడు కాబట్టి గాయకుల బృందానికి నాయకునిగా నియమించబడ్డాడు.

  25. 1 దినవృత్తాంతములు 15:23సుమారు క్రీ.పూ. 1042

    బెరెక్యా, ఎల్కానా దేవుని మందసానికి కావలివారిగా నియమించబడ్డారు.